మిషిగన్‌లో సమ్మరైపోయింది, ప్చ్!

కనీసం దసరాల దాకానైనా నా సరదా తీరుస్తుందనుకున్నాను.
వినాయకచవితైనా రాకుండానే అమాయకంగా వీడ్కోలు తీసేస్కుంది మా మిషిగన్ వేసవి.
కానీ, నా సావి రంగా, అది రాజ్యమేలినన్నాళ్ళూ ఏంఇ వైభవం, ఎన్నెన్ని హొయలు!
ఇహ ప్రకృతంతా నాదే కదా అన్నట్టు ఏకఛ్ఛత్రాధిపత్యం చెలాయించిందిగా!!
అచ్చం చక్రవర్తిణిలాగానే, మరీ ఒకే రకం పూలు సీజనంతా ఉంటే బోరని చెప్పి, రెండేసి వారాలకి ఒక కొత్త గుబాళింపు, ఇంకో కొత్త వెరైటీ పూల సోయగం, మార్పు మార్పు మార్పు, ఎడతెగని మార్పు, నిరంతర మార్పు.
వాహ్ వాహ్ మిషిగన్ వేసవి!
నీ రాజసం ముందు, నీ సోయగం ముందు దాసోహమ్మని తలవంచుతున్నాను.
ఈ రంగులూ రూపాలూ సువాసనలూ నాకోసమే విరిసి విసిరి మురిశావని అనుకోడానికి నేనెంతవాణ్ణి?
ఐనా నా అజ్ఞానంలో అలాగే అనుకుంటాను. ఐనా ఎక్కడో, ఏమూలో నా మెదడుకి అందని ఒక సమూలాగ్రమైన అంతశ్చేతనకి తెలుసు.
నువ్వే సకల సృష్టిని శాసించే జగన్మోహినివి.
నేనల్లా నీ మాయలో పడి ఓలలాడుతున్న పిచ్చివాడిని.
వాహ్ వాహ్ మిషిగన్ వేసవి!
నీ రాజసం ముందు, నీ సోయగం ముందు దాసోహమ్మని తలవంచుతున్నాను.


తెలుగు బ్లాగువనంలో ఒక విచిత్రమైన పూల తీగె వెన్నెల పూలు పూస్తోంది చూడండి.

Comments

ఇదన్యాయం.. మిషిగన్ అందాలు మీరు అనుభవించి మాటలతో మాతో పంచుకున్నారు. బానేఉంది . ఆ మనోహర ప్రకృతిదృశ్యాలు మాటలతోపాటు ఫోటోలుగా పంచుకుంటే మీ సొమ్మేంపోయేదంట?? ఇక్కడ మేము కుళ్లుకోవాలనా??hmmmmm
Anonymous said…
మిషిగన్ రాజసం, సోయగం మీ పదాల ద్వారా కొంత వరకు నాకు సాక్షాత్కరమైంది.
"ఈ రంగులూ రూపాలూ సువాసనలూ నాకోసమే విరిసి విసిరి మురిశావని అనుకోడానికి నేనెంతవాణ్ణి?
ఐనా నా అజ్ఞానంలో అలాగే అనుకుంటాను. ఐనా ఎక్కడో, ఏమూలో నా మెదడుకి అందని ఒక సమూలాగ్రమైన అంతశ్చేతనకి తెలుసు"--చాలా బాగుంది.
చాలా బాగుంది. మరీ దసరా దాకా మీకు వేసవి ఉండాలా? :-)

"ఐనా నా అజ్ఞానంలో అలాగే అనుకుంటాను. ఐనా ఎక్కడో, ఏమూలో నా మెదడుకి అందని ఒక సమూలాగ్రమైన అంతశ్చేతనకి తెలుసు.".. Too good!
Very Nice... చాలా బాగుందండీ...
@ జ్యోతి, సమ్మరంతా ఫొటోలు చాలానే తీశాను. వస్తుందిగా సుదీర్ఘమైన మంచుకాలం. అప్పుడు పెడతాను!

@ sat, సంతోషం.

@ కృష్ణప్రియ, అమెరికాలో ఉన్నప్పుడు మీరే ప్రాంతంలో ఉన్నారో నాకు తెలీదు. దసరాదాకా వేసవి కాకున్నా, మిషిగన్‌లో అక్టోబరు మధ్యదాకా కొంచెం పరవాలేదనిపించే పాటి వెచ్చదనం ఉంటుంది. ఈసారి లేబర్ డే ముందు వారంలోనే గాలివాన వచ్చేసి చలిని తెచ్చేసింది.
@వేణు శ్రీకాంత్, :)
మేము బే ఏరియా లో ఉండే వాళ్ళం. అక్కడా సెప్టెంబర్ మొదటి వారం దాకా వేడి గానే ఉండేది లెండి.
మీరు చాలా చాలా బాగా రాశారు. దాదాపు 7-8 సార్లు చదివుకుని, కొద్దిమంది స్నేహితులకి కూడా పంపాను ఈ లింకు ని.
భాను said…
mee mishgun andaalu kallamundu paricharu.
మా బ్లాగ్ కి లంకె ఉంచినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు
అన్నాజీ
కన్సానదీ తీరాన ఇంకనూ తొంభైలు తాకుచున్నది సూర్యప్రభ
:)
అన్నగారూ
మరో మాట,
మీ బ్లాగ్ మూసయందు *పింక్* కలర్ అంతగా బాగోలేదని తెలియజేస్కుంటున్నా..
మీరు ఈ హొయలు చూసి తన మిత్రుడైన శరత్కాలపు వెన్నల ఆహ్లాదాన్ని ఆస్వాదిన్చరేమోనని వెళ్ళిపోయి ఉంటుంది.
ఇందు said…
బాగుంది మీ కవితాత్మక వర్ణన...నిజమే మిషిగన్ వేసవి వెళ్ళిపోతోంది....చలి పులి దాడి అప్పుడే మొదలయింది.... ఇప్పటిదాకా వన్నెలు అద్దుకున్న చెట్లు ఇక ఆకులు రాల్చి స్వేతవర్ణం లోకి మారిపోతయెమో మంచుపూల దయవల్ల....
భాను, ధన్యవాదాలు. దయచేసి ఇకమీదట తెలుగు వ్యాఖ్యల్ని తెలుగులిపిలోనే రాయండి.

పున్నమి, సంతోషం.

భాస్కరా, నీకు ఇంటోనే ఇద్దరు సూర్యుళ్ళున్నారు. ఆ ప్రభ అలాగే వెలగనీ! :) నాబ్లాగుకి పింకు రంగు ఎందుకు ఉండకూడదు అధ్యక్షా ని ప్రశ్నిస్తున్నాను. ఐనా మనలో మాట - టెంప్లేటు మార్చే తీరికే ఉంటే కొత్త పోస్టులే రాసుకుందును గదా!

వాజసనేయ (ఈ తెలుగు స్పెల్లింగు కరక్టేనా?) అదీ నిజమే.

ఇందు, సంతోషం.
సావిరహే, దయచేసి తెలుగు వ్యాఖ్యని తెలుగు లిపిలోనే రాయండి.
మాకుమాత్రం శరద్కాలమే చాలాబావుంటుంది. అదెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా. ఇంకో రెండువారాల్లో పురివిప్పేస్తుందేమో చూడాలి మేస్టారు