మలి ప్రచురణ గమనిక: ఆడియో కవిలెల్ని mp3 కి మార్చి, ఇప్పుడు శ్రవణామాలికగా పెట్టాను, శ్రోతల సౌలభ్యం కోసం.
శ్రీపాద వారి అమోఘమైన రచన మార్గదర్శి కథ. రాజమండ్రిలో పేరుమోసిన బట్టల వర్తకుడు శంభుశాస్త్రిగారు. ఉద్యోగానికి సిఫార్సు చెయ్యమని వచ్చిన యువకుణ్ణి కూచోబెట్టి, తన సుదీర్ఘ జీవితానుభవాన్ని కాచి వడబోసి, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఎటువంటి దీక్ష కావాలో, ఎట్లాంటి స్వస్వరూప జ్ఞానం కావాలో, ఇంకా ఎటువంటి ఆత్మ చైతన్యం కావాలో ఉపదేశించాడు. ఆ గీతోపదేశం చేసిన కృష్ణభగవానుడు స్వయానా సుబ్రహ్మణ్య శాస్త్రిగారే. అయిష్టంగానైనా అర్జునులమై ఆయన ప్రబోధం విని మనసుకి పట్టించుకోవలసింది మనమే! కథలో ఆయన బ్రాహ్మణ జాతి యువకులనుద్దేశించి ప్రసంగించినా, ఆ బోధన ఈనాడు మన ఆంధ్రజాతి కంతటికీ వర్తిస్తుందని నేను నమ్ముతున్నాను. దురదృష్టం ఏవిటంటే శాస్త్రిగారు ఈ కథ రాసి దాదాపు యెనభయ్యేళ్లవుతోంది. అప్పటినించి ఇప్పటికి ఈ కథలో స్పృశించిన విషయాల్లో తెలుగుజాతి ఎదగడం పోయి మరింత దిగజారిన స్థితిలో ఉంది.
ఆ మహానుభావుని కలంనించి జాలువారిన ఈ మహాశక్తివంతమైన మాటల్ని నాగొంతులో పలికించడానికి సాహసించాను.
సహృదయులు మెచ్చుతారని ఆశిస్తున్నాను.
On Google Drive
చివరి మాట: మరి కొన్ని గొప్ప తెలుగు కథల్ని ఇలా ఆడియోగా అందించాలని సంకల్పం. ఇది తొలి అడుగు మాత్రమే. ఏవన్నా ఆచరణీయమైన మార్పులూ చేర్పులూ సూచనలూ ఉంటే, దయచేసి చెప్పండి.
శ్రీపాద వారి అమోఘమైన రచన మార్గదర్శి కథ. రాజమండ్రిలో పేరుమోసిన బట్టల వర్తకుడు శంభుశాస్త్రిగారు. ఉద్యోగానికి సిఫార్సు చెయ్యమని వచ్చిన యువకుణ్ణి కూచోబెట్టి, తన సుదీర్ఘ జీవితానుభవాన్ని కాచి వడబోసి, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఎటువంటి దీక్ష కావాలో, ఎట్లాంటి స్వస్వరూప జ్ఞానం కావాలో, ఇంకా ఎటువంటి ఆత్మ చైతన్యం కావాలో ఉపదేశించాడు. ఆ గీతోపదేశం చేసిన కృష్ణభగవానుడు స్వయానా సుబ్రహ్మణ్య శాస్త్రిగారే. అయిష్టంగానైనా అర్జునులమై ఆయన ప్రబోధం విని మనసుకి పట్టించుకోవలసింది మనమే! కథలో ఆయన బ్రాహ్మణ జాతి యువకులనుద్దేశించి ప్రసంగించినా, ఆ బోధన ఈనాడు మన ఆంధ్రజాతి కంతటికీ వర్తిస్తుందని నేను నమ్ముతున్నాను. దురదృష్టం ఏవిటంటే శాస్త్రిగారు ఈ కథ రాసి దాదాపు యెనభయ్యేళ్లవుతోంది. అప్పటినించి ఇప్పటికి ఈ కథలో స్పృశించిన విషయాల్లో తెలుగుజాతి ఎదగడం పోయి మరింత దిగజారిన స్థితిలో ఉంది.
ఆ మహానుభావుని కలంనించి జాలువారిన ఈ మహాశక్తివంతమైన మాటల్ని నాగొంతులో పలికించడానికి సాహసించాను.
సహృదయులు మెచ్చుతారని ఆశిస్తున్నాను.
On Google Drive
చివరి మాట: మరి కొన్ని గొప్ప తెలుగు కథల్ని ఇలా ఆడియోగా అందించాలని సంకల్పం. ఇది తొలి అడుగు మాత్రమే. ఏవన్నా ఆచరణీయమైన మార్పులూ చేర్పులూ సూచనలూ ఉంటే, దయచేసి చెప్పండి.
Comments
ఈస్నిప్సులో ప్లేలిస్టు పెట్టే విధానం ఒకటి ఉంది గానీ అది నాకు చేతకాలేదు. అది కుదిరితే, అన్ని ఫైళ్ళూ ఒకదాణి వెంబడీ ఒకటి ప్లే అయ్యేట్టు చెయ్యొచ్చు.
ఇప్పుడే ర.బలో వేగుచూసి వచ్చాను. వినడం పూర్తవలేదు విన్నంత వరకూ చాలా గొప్పగా వుంది. మీ గొంతూ, ఉచ్చారణా కథకి బాగా నప్పాయండి.
మీ గొంతు చాలా చక్కగా సరి పోయింది.
రచయితకు, గొంతు తో నటించిన మీకు ధన్యవాదాలు.
This is really good idea!
but somehow i am not able to play any of these files :(
somehow esnips play option is not enabled
i am able to listen Sravan's daily Keertana's without fail.
my two cents about audio books
this idea was there before, tried few groups for quite sometime, somehow this did not click, may be people did not like reader's modulation or may be with problems from internet.
but if someone can read like old radio's navala vahini' :) then i think it will be a big sucess!
మనలో మన మాట "సహృదయులు మెచ్చుతారని ఆశిస్తున్నాను" అంటే మెచ్చని వారు సహృదయులు కారనా :-) (Just kidding)
దయతో నాకు ఈ రికార్డింగు అదీ ఎలా చెయ్యొచ్చో ఎలా బ్లాగులో పోస్టు చెయ్యాలో కొంచెం చెప్పగలరా?
మీ గొంతు, ఉఛ్ఛారణ అప్పటి శైలి కి సమకాలీనంగా ఉంది.
సుమారు పది సం:రా ల క్రితం నాటిమాట. కీ.శే.జె.వి.సోమయాజులు,రమణమూర్తి గార్ల బృందం 'కన్యాశుల్కం'ప్రదర్శించారు. ప్రదర్శన సాంతం చూసి చాలా కలత చెంది, ప్రదర్శనానంతరం సోమయాజుల వారిని కలసి ఎందుకు అన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని అడిగాను. వారిచ్చిన సమాధానం...జనాదరణ కోసం మార్చాల్సి వచ్చిందని శెలవిచ్చారు. భాష శైలి మార్చారు. సరే. సన్నివేశాలెందుకు మార్చారని అడిగితే మళ్ళీ అదే సమాధానం.మరింక వాదించ దలచుకోలేదు.
ఇలా ఎవరికి తగినట్లు వారు మార్పులు చేసుకుంటూ పోతే ఇక ఆనాటి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ,సంప్రదాయాలు ముందు తరాలకి తెలిసేదెలా.
ఏదో అన్యాయం జరిగిపోతోందన్న వేదన, ఒక సాహిత్యాభిమానిగా ఏమీ చేయలేక పోతున్నాననే వెలితి నన్ను కలచి వేస్తుండేది.
ఇదిగో ఇన్నాళ్ళకి మీద్వార ఆ లోటు తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మీ తొలి ప్రయత్నం లోనే అఖండ విజయాన్ని సాధించారు.
ఒక మంచిపనికి అందరి అండదండలు ఉంటాయి.
The people who teach Personality development and Marketing strategies are unfit to their profession if they do not read this story.
మీరు అనుమతిస్తారో లేదో తెలియదుకాని మా పాఠశాల పిల్లలకి ఇది వినిపించాలని ఉంది. కనీసం తెలుగు ఉచ్చారణ ఇదీ అని తెలుస్తుంది.
మీ స్వరం నుండి మరిన్ని కధలు జాలు వారాలని
ఆశిస్తూ మీ అభిమాని.
మురళి .. ధన్యుణ్ణి. పేలాల కథ నాలుగో భాగంలో ఉంది. ఇంత పొడుగు కథ తరవాత, తదుపరి చేసేది చిన్నగా ఎంచుకుందామనిపించి, అమరావతి కథల్లో ఒకటి చదువుదామనుకుంటున్నా. మీ రికమెండేషను?
మైత్రేయి .. రిచ్ డాడ్ పూర్ డాడ్ చదవాల్సిన పుస్తకమే. కానీ ఈ కథలో శ్రీపాద వారు ఇంకా చాలా విలువైన జీవిత సత్యాలు చెప్పారు.
ఆనొన్ .. ఫ్లేసె ప్రొవిదె అ నమె నెక్ష్త్ తిమె. ఏస్నిప్స్ ప్లయ్ ఒప్తిఒన్ షౌల్ద్ బె వొర్కింగ్ నౌ.
వేణు .. రసజ్ఞులు అని ఉండాలి. నిజంగా ఇక్కడ సహృదయత ప్రస్తావన ఏమీ లేదు. అవును, నాలుగైదు చోట్ల తడబడ్డాను.
నరసింహ గారు, ఒక చిన్న mp3 ప్లేయరు కొనుక్కోండి, రికార్డింగు చేసే వెసులుబాటు ఉన్నదిగా చూసి. మీ పని సులువవుతుంది. మీక్కావాలంటే, నేను ఈ కథని రికార్డు చేసి ఇక్కడ పెట్టిన పద్ధతి అంతా ఒక బ్లాగు పోస్టు రాస్తాను.
శ్రీనిక .. మీ విద్యార్ధులకి తప్పక వినిపించండి. కాకపోతే, ఇది ఇంచుమించు 2.5 గంటల పొడుగు. ఇటుపైన ఇంకొంచెం చిన్న క్థలు వెలువరిస్తాను. కన్యాశుల్కం ప్రదర్శనల గురించి రమణమూర్తిగారు డిట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్యలో ప్రసంగించినప్పుడు చెప్పారు. ఇందులో సోమయాజులు గారు వేషం వెయ్యడం తప్ప ఆయన ప్రమేయం ఏం లేదుట. నిర్వహణ, మార్పులు చేర్పులు అంతా రమణమూర్తి గారిదే. ఆయన దృష్టిలో గిరీశం హీరో. అలా హీరో అయిన వాడు చివరికి దగుల్బాజీగా మిగిలిపోవడం నచ్చక, గిరీశం మారినట్టూ, బుచ్చమ్మని పెళ్ళాడినట్టూ మార్చుకుని ప్రదర్శించేవారు అని చెప్పారు. అవును, ఆయన కన్యాశుల్కం డయలాగులు చెబుతుంటే, విజయనగరం యాస కనబడదు. నా వాచికంలో కూడా శ్రీపాదవారి కోనసీమ యాస రాలేదు, నా విజయవాడ యాసే ఉంది. ఎవరైనా కోనసీమవాళ్ళు శాస్త్రిగారి కథల్ని రికార్డు చేస్తే బావుంటుంది.
అమరావతి కథల్లో 'పూల సుల్తాన్'చాలా టచింగ్‌గా ఉంటుంది, అదీనూ, భోజన చక్రవర్తి' మీ గొంతులో వినాలి.
అనుమతించినందుకు ధన్యవాదాలు.
ఇక మీ శైలి చిషయానికి వస్తే...
నేను తూ.గో.జిల్లా వాసినే.ఉభయ గోదావరి జిల్లాల భాష, క్రిష్ణా జిల్లా భాష శైలి విషయానికొస్తే.. పెద్ద వ్యత్యాసం ఉండదు. ముఖ్యంగా బ్రాహ్మణ జాతిలో..వేరే వర్ణాల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాని కొంచెం గుంటూరు జిల్లాకి వెళ్ళేసరికి యాసలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది మీ కామెంటు చదివాకా మళ్ళీ విన్నాను. మీ ప్రాంత ప్రభావమేమీ లేదు.
కవిలెలు అంటే files or format.
కవిలెలు అని అచ్చతెలుగులో చెప్పి, ఆడియో అనడంలోగల పరమార్ధం తెలుసుకోవచ్చా.నాకైతే సాంబారులో నూడుల్స్ వేసుకున్నట్టుగా అనిపించింది. ఏమనుకోకండి..:)
ఐనా అప్పుడప్పుడూ వెరైటీ కోసం సాంబార్లో నూడుల్స్ వేసుకున్నా తప్పేం లేదులేండి :)
--తాడేపల్లి
http://www.esnips.com/SharedFolderAction.ns;jsessionid=6829DCB793C75E23DFE88FA6D36D0293
మీ ప్రశ్నలకి ..
దురన్న దుర్దానాలు .. శంభుశాస్త్రి తండ్రిది యాచక వృత్తి. దాన్లోకూడా తరతమ భేదాలున్నాయి. తిలదానం కథ చదవండి. శనిగ్రహ శాంతికై నువ్వుల దానం స్వీకరించడం అన్నిటికన్నా లోకువ. తన తండ్రి అటువంటి లోకువపనులు చెయ్యలేదు అని శంభుశాస్త్రి అంటున్నాడు.
సన్నిపాతించడం అంటే నాకూ సరిగ్గా తెలీదు. కోమాలోకి వెళ్ళడం అనుకున్నాను నేను.
అణాపైసల లెక్క .. . అర్ధణా సంగతి చిల్లర శ్రీమహాలక్ష్మి టపాలో ప్రస్తావించాను. నాలుగు కానులు ఒక అణా, నాలుగు అణాలు ఒక పావులా, నాలుగు పావులాలు ఒక రూపాయి. కానీ నించి అణా దాకా లెక్క .. కానీ, అర్ధణా, ముక్కానీ, అణా.
అణానించి పావులాకి లెక్క .. అణా, అణాకానీ, బేడ, అణాముక్కాని, పావులా.
బేడ = రెండణాలు.
పూర్వం ముక్కానికీ, అణాకీ, బేడకీ కాసులుండేవి. షావుకారు సినిమా చూస్తే, సినిమా మొదట్లోనే .. ఈ అణా కానీల లెక్క ఒకటుంటుంది. మీ అమ్మగారి దగ్గర్నీంచి కనుక్కున్న దాంట్లో నేను చెప్పింది ఏదైనా తప్పని తెలిస్తే తప్పక తెలీయ్జెయ్యండి.
http://www.esnips.com/web/verrigonthukaviccimrosanu
మా అమ్మ కూడా అణాల లెక్క మీరు చెప్పిందే చెప్పింది... సన్నిపాతమంటే వాతం కమ్మటమంట..
చాలామంచి ప్రాజెక్టు. తెలుగు చదవడం రానివాళ్లకీ, కంప్యూటరుముందు అట్టేసేపు కూర్చోలేనివారికీ గొప్ప సదుపాయం. అభినందనలు.
నాకు చిన్నప్పుడు ఆకాశవాణి విజవాడ కేంద్రం లో విన్న కథానికలు గుర్తొచ్చాయి. గొప్ప ప్రయత్నం. మనసుకి హాయిగా ఉంది.
మనోజ్ఞ, స్వాతి, సౌమ్య - నెనర్లు.
సౌమ్య - ఏమోనండీ. నాకు ఈ ఆన్లైన్ సర్వీసులు చాలా వాటిని వాడడం చేతగాదు. మొదటి రికార్డింగులు ఎక్కడున్నాయో వెతకాలి. అవి దొరికితే ఏదన్నా ఫైల్ మార్పిడి గూట్లో పెట్టే వీలుందేమో చూసి తెలియజేస్తాను.