కనీసం దసరాల దాకానైనా నా సరదా తీరుస్తుందనుకున్నాను.
వినాయకచవితైనా రాకుండానే అమాయకంగా వీడ్కోలు తీసేస్కుంది మా మిషిగన్ వేసవి.
కానీ, నా సావి రంగా, అది రాజ్యమేలినన్నాళ్ళూ ఏంఇ వైభవం, ఎన్నెన్ని హొయలు!
ఇహ ప్రకృతంతా నాదే కదా అన్నట్టు ఏకఛ్ఛత్రాధిపత్యం చెలాయించిందిగా!!
అచ్చం చక్రవర్తిణిలాగానే, మరీ ఒకే రకం పూలు సీజనంతా ఉంటే బోరని చెప్పి, రెండేసి వారాలకి ఒక కొత్త గుబాళింపు, ఇంకో కొత్త వెరైటీ పూల సోయగం, మార్పు మార్పు మార్పు, ఎడతెగని మార్పు, నిరంతర మార్పు.
వాహ్ వాహ్ మిషిగన్ వేసవి!
నీ రాజసం ముందు, నీ సోయగం ముందు దాసోహమ్మని తలవంచుతున్నాను.
ఈ రంగులూ రూపాలూ సువాసనలూ నాకోసమే విరిసి విసిరి మురిశావని అనుకోడానికి నేనెంతవాణ్ణి?
ఐనా నా అజ్ఞానంలో అలాగే అనుకుంటాను. ఐనా ఎక్కడో, ఏమూలో నా మెదడుకి అందని ఒక సమూలాగ్రమైన అంతశ్చేతనకి తెలుసు.
నువ్వే సకల సృష్టిని శాసించే జగన్మోహినివి.
నేనల్లా నీ మాయలో పడి ఓలలాడుతున్న పిచ్చివాడిని.

తెలుగు బ్లాగువనంలో ఒక విచిత్రమైన పూల తీగె వెన్నెల పూలు పూస్తోంది చూడండి.

Comments
"ఈ రంగులూ రూపాలూ సువాసనలూ నాకోసమే విరిసి విసిరి మురిశావని అనుకోడానికి నేనెంతవాణ్ణి?
ఐనా నా అజ్ఞానంలో అలాగే అనుకుంటాను. ఐనా ఎక్కడో, ఏమూలో నా మెదడుకి అందని ఒక సమూలాగ్రమైన అంతశ్చేతనకి తెలుసు"--చాలా బాగుంది.
"ఐనా నా అజ్ఞానంలో అలాగే అనుకుంటాను. ఐనా ఎక్కడో, ఏమూలో నా మెదడుకి అందని ఒక సమూలాగ్రమైన అంతశ్చేతనకి తెలుసు.".. Too good!
@ sat, సంతోషం.
@ కృష్ణప్రియ, అమెరికాలో ఉన్నప్పుడు మీరే ప్రాంతంలో ఉన్నారో నాకు తెలీదు. దసరాదాకా వేసవి కాకున్నా, మిషిగన్లో అక్టోబరు మధ్యదాకా కొంచెం పరవాలేదనిపించే పాటి వెచ్చదనం ఉంటుంది. ఈసారి లేబర్ డే ముందు వారంలోనే గాలివాన వచ్చేసి చలిని తెచ్చేసింది.
@వేణు శ్రీకాంత్, :)
మీరు చాలా చాలా బాగా రాశారు. దాదాపు 7-8 సార్లు చదివుకుని, కొద్దిమంది స్నేహితులకి కూడా పంపాను ఈ లింకు ని.
కన్సానదీ తీరాన ఇంకనూ తొంభైలు తాకుచున్నది సూర్యప్రభ
:)
మరో మాట,
మీ బ్లాగ్ మూసయందు *పింక్* కలర్ అంతగా బాగోలేదని తెలియజేస్కుంటున్నా..
పున్నమి, సంతోషం.
భాస్కరా, నీకు ఇంటోనే ఇద్దరు సూర్యుళ్ళున్నారు. ఆ ప్రభ అలాగే వెలగనీ! :) నాబ్లాగుకి పింకు రంగు ఎందుకు ఉండకూడదు అధ్యక్షా ని ప్రశ్నిస్తున్నాను. ఐనా మనలో మాట - టెంప్లేటు మార్చే తీరికే ఉంటే కొత్త పోస్టులే రాసుకుందును గదా!
వాజసనేయ (ఈ తెలుగు స్పెల్లింగు కరక్టేనా?) అదీ నిజమే.
ఇందు, సంతోషం.