
ఎంత విచిత్రం?
సరిగ్గా ఇవ్వాళ్ళే త్యాగరాజస్వామి వారి ఆరాధన తిథి.
ఇప్పుడే ఈయన స్వర్గారోహణం.
అక్కడ త్యాగరాజస్వామితో కలిసి జుగల్బందీ చేస్తాడు కావును!
మొన్నటికి మొన్న వినాయకచవితి పండక్కీ, పండరిపూర్ యాత్రా సందర్భంగానూ పుణే నగర వీధుల్లో అనుకోకుండ ఈయన పాట ఎదురుపడితే నిశ్చేష్టుడినై, బయటికి వెళ్ళిన పని మరిచిపోయి ఆ సంగీతంలో తలమునకలై పోయిన అనుభవం ఇంకా పచ్చిగానే ఉంది. హేమంతపు రాత్రుల్లో తన గురువుగార్ని తల్చుకుంటూ మహామహుల్ని పుణేకి రప్పించి రాత్రింబవళ్ళు కచేరీలతో హోరెత్తించిన సవాయ్ గంధర్వ ఉత్సవ జ్ఞాపకం వెచ్చగానే ఉంది.
గాన గంధర్వా! నీ స్మృతికి మరుపెక్కడ! నిన్ను మరవాలంటే ఆ విమలగాంధర్వం మరపుకి రావాలి.
అది ఈ జన్మకి జరిగే పని కాదు.
Comments
మెండుగ రాగాల బాడు మేలౌ గానో
ద్దండా, కీర్తి ప్రచండా
పండిట్ భీంసేను మీకు ప్రాఞ్జలు లివ్వే
pi, నిజం. ఆయన శిష్యులు ఎవరూ ఆయన స్థాయికి తగినట్టు తయారవలేదు.
హనుమంతరావుగారు, అమెరికాలో ఆం.జ్యో. పే సైట్ చేశారు, అందుకని చూడ్డం మానేశాను.
ఆయని పాట నేఱుగా వినే అవకాశం లేకపోయిందీ జన్మకి.
హంసలు మానససరసికి నరిగెడి రీతిన్
మాంసమయదేహము విడిచి
భీంసేనుఁడు నాకమునకు విజయము జేసెన్.
http://www.economist.com/node/18060826?story_id=18060826
ఆయన కీర్తి పతాక ఖండాంతరాల్లోనూ విజయవంతంగా ఎగురుతున్నదని చాటేందుకు ఇంకే నిదర్శనం కావాలి?