గాన గంధర్వా! నమస్తే!



ఎంత విచిత్రం?
సరిగ్గా ఇవ్వాళ్ళే త్యాగరాజస్వామి వారి ఆరాధన తిథి.
ఇప్పుడే ఈయన స్వర్గారోహణం.

అక్కడ త్యాగరాజస్వామితో కలిసి జుగల్బందీ చేస్తాడు కావును!

మొన్నటికి మొన్న వినాయకచవితి పండక్కీ, పండరిపూర్ యాత్రా సందర్భంగానూ పుణే నగర వీధుల్లో అనుకోకుండ ఈయన పాట ఎదురుపడితే నిశ్చేష్టుడినై, బయటికి వెళ్ళిన పని మరిచిపోయి ఆ సంగీతంలో తలమునకలై పోయిన అనుభవం ఇంకా పచ్చిగానే ఉంది. హేమంతపు రాత్రుల్లో తన గురువుగార్ని తల్చుకుంటూ మహామహుల్ని పుణేకి రప్పించి రాత్రింబవళ్ళు కచేరీలతో హోరెత్తించిన సవాయ్ గంధర్వ ఉత్సవ జ్ఞాపకం వెచ్చగానే ఉంది.

గాన గంధర్వా! నీ స్మృతికి మరుపెక్కడ! నిన్ను మరవాలంటే ఆ విమలగాంధర్వం మరపుకి రావాలి.

అది ఈ జన్మకి జరిగే పని కాదు.

Comments

Sanath Sripathi said…
దండిగ ఆలాపనలున్,
మెండుగ రాగాల బాడు మేలౌ గానో
ద్దండా, కీర్తి ప్రచండా
పండిట్ భీంసేను మీకు ప్రాఞ్జలు లివ్వే
pi said…
It is a huge loss to the music world.
ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో శ్రీ రామచంద్ర గుహ ఈ గానగంధర్వ ని గురించి చాలా చక్కటి నివాళి అందించారు.వీలయితే చూడండి!
సనత్, గానోద్దండా! భలే భలే!

pi, నిజం. ఆయన శిష్యులు ఎవరూ ఆయన స్థాయికి తగినట్టు తయారవలేదు.

హనుమంతరావుగారు, అమెరికాలో ఆం.జ్యో. పే సైట్ చేశారు, అందుకని చూడ్డం మానేశాను.
rākeśvara said…
చాలా నాళ్ళు ఈ పాట నా సుభోదయం పాటగా నిలచింది.
ఆయని పాట నేఱుగా వినే అవకాశం లేకపోయిందీ జన్మకి.
Sanath Sripathi said…
కొత్తపాళీ గారూ, నెనర్లు.
Sandeep P said…
భీంసేన్ జోషీ గారు మనకు లేకపోవడం మన దురదృష్టం. ఆయనకు దైవసాన్నిధ్యం ప్రాప్తించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
రాఘవ said…
సంసార మసారంబని
హంసలు మానససరసికి నరిగెడి రీతిన్
మాంసమయదేహము విడిచి
భీంసేనుఁడు నాకమునకు విజయము జేసెన్.
The Economist పత్రిక పూర్తి పేజీ అక్షరనివాళి ప్రచురించింది భీంసేన్ జోషీ గారికి.
http://www.economist.com/node/18060826?story_id=18060826

ఆయన కీర్తి పతాక ఖండాంతరాల్లోనూ విజయవంతంగా ఎగురుతున్నదని చాటేందుకు ఇంకే నిదర్శనం కావాలి?