డెలవేర్ పౌరాణిక నాటకప్రదర్శన విజయవంతం

నాటక ప్రదర్శన చాలా బాగా జరిగింది.

శ్రీకృష్ణ పాత్రలో ఆచార్య శ్రీ సుందరరామకృష్ణగారు ప్రేక్షకుల మనసులు దోచారు అంటే అతిశయోక్తి కాదు. తన రూపాన్ని ఇనుమడింపజేసే ఆహార్యంతో, మృదు గంభీరమైన వాచికంతో, సందర్భోచితమైన చతుర సంభాషణతో శ్రీ సుందరరామకృష్ణగారు ఆ నటనసూత్రధారిని ప్రత్యక్షం చేశారు.

ద్వారకాఘట్టంలో అర్జునునిగా మిత్రులు సరిపల్లి శర్మగారు చాలా బాగా నటించారు. మునుపు అనుభవం లేకపోయినా క్లిష్టమైన పద్యాలను కంఠత పట్టడమే కాక చక్కగా రాగయుక్తంగా ఆలపించి రక్తి కట్టించారు. రాయబార ఘట్టంలో డెలవేర్ వాస్తవ్యులు, పలువు ఔత్సాహికులు వివిధ పాత్రల్ని సమర్ధంవంతంగా పోషించారు. బ్లాగుమిత్రుడు రవి వైజాసత్య తొంభై మైళ్ళు డ్రైవు చేసుకుని వచ్చాడు. నా ఫిలడెల్ఫియా మిత్రులు ఆప్తులు పెద్దవారు అందరూ వచ్చారు. చాలా సంతోషమైంది. మనసు నిండిపోయింది.

ఈ కార్యక్రమాన్ని సంకల్పించిన శ్రీమహాలక్ష్మి దేవస్థాన ట్రస్టీ శ్రీ పాటిబండ శర్మ గారు, సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ బృందము అభినందనీయులు.

ప్రస్తుతానికి ఈ చిరు దృశ్యమాలిక మీకోసం.

Comments

Sanath Sripathi said…
ఫోటోలు చాలా బాగున్నయి...అమెరికా లో ఆహార్యం కూడా లభిస్తుంది అని ఊహించకపోవటం వల్ల ఒకింత ఆశ్చర్యాన్ని కూడా కలిగించాయి.. మీకు మా అభినందనలు..
బాబు said…
సరిగ్గా సరిపోయారు. కిరీటం వెరైటీగా ఉంది. మీసాలు సన్నగా ఉన్నప్పటికీ ,ఆహార్యం చక్కగా ఉంది. అభినందనలు.
ఆహార్యం చాలా చాలా బాగా కుదిరింది సుయోధనుల వారూ :-)
SRRao said…
కొత్త పాళీ గారూ !
చాలా సంతోషం. వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటుంది. ప్రయత్నించండి. మేమందరం కూడా చూస్తాం. అలా చేస్తే తెలియజెయ్యండి.
Sanath, శ్రీకృష్ణుని ఆహార్యం అక్కిరాజు వారు తెచ్చుకున్నారు. మిగిలిన పాత్రల హంగులన్నీ మేము ఇక్కడ తయారు చేసుకున్నాము, దొరికిన వస్తువులతో.

బాబు, నిషిగంధ, రావుగారు, నెనర్లు.
మాకు పెద్ద దూరమేమీ కాదు.అనివార్య కారణాలవల్ల చివరి నిమిషంలో విరమించుకోవాల్సి వచ్చింది. ప్చ్.
అన్నగారూ
కేక....
బాగుంది మీ వేషధారణ.
ఐతే, ఆడియోనో వీడియోనో పెడితే వన్స్‌మోర్ కుట్తుకునేవాళ్ళం.
భలే బాగున్నాయండీ ఫోటోలు! అమెరికాలో అన్నీటినీ సమకూర్చుకుని ఇంత చక్కగా నాటకాన్ని ప్రదర్శించడం చాలా ముచ్చటగా అనిపిస్తోంది. :)
Sanath Sripathi said…
ఔనా... మీ ఆహార్యం మీరే తయారు చేసుకున్నరా??... అద్భుతం.
గద, కిరీటం, మీమెడలో జోధా అక్బర్ జ్యూవెల్లరీ ఆనీ మీరే తయారుచేసుకున్నారంటే మీ ప్రిపరేషన్ అద్భుతం....
జయ said…
చాలాబాగుందండి. మీ కిరీటం, గధ అన్నీ మా వాడి చిన్నప్పటి ఆయుధాల్ని గుర్తుకు తెచ్చాయి. మీసాలు, గడ్డాలు, విగ్గులు కూడా ఉండేవి. వీడియో తప్పకుండా పెట్టండి.
ఉమాశంకర్, రాగలిగి ఉంటే బాగుండేది.

భాస్కర్, చూద్దాం, చేతికందితే. లేపోతే ఓ ఫోను కొట్టు, నా పద్యాలు మాత్రం వినిపిస్తా :)

మధురవాణి, నెనర్లు. అమెరికా తెలుగువాళ్ళని మరీ అంత తక్కువగా అంచనా వెయ్యకండి.

సనత్, ఈ జోధా అక్బర్ రిఫరెన్సు ఏవిటో అర్ధం కాలేదు కానీ నా ఆహార్యం అంతా నేనే తయారు చేశాను. విగ్గు మాత్రం పార్టీసిటీ అనే షాపులో కొన్నాను.

జయగారు, మీ బాబు పుట్టినరోజుకి మీరు రాసిన టపా గుర్తుంది. నిజంగా ఈ నాటకంలో వేషం వెయ్యడం నాకు childhood dream come true. మీకు వీలుంటే నా బ్లాగులో ఒకసారి వెనక్కి వెళ్ళి "మీసము దిద్దరుగా" అనే టపా చూడండి.
ఇందు said…
బాగున్నాయండీ...మీరు,శ్రీకృష్ణులవారు...ఆ అహార్యం లో బాగున్నారు.అక్కడి విషేషాలతో..వీలైనప్పుడు ఇంకొంచెం పెద్ద టపా వేయండీ వీడియోలతొ సహా! మేము ఆ నాటకాలను చూసి ఆనందిస్తాం :)
Anil Atluri said…
వీడియో అనుకున్నాను, బొమ్మలు బాగున్నవి. వీడియో లింకు కి ఏర్పాటు చెయ్యండి, మాస్టారు.
Unknown said…
Narayanaswamy garu, you are great. Excellent. Keep it up.
Malathi said…
అద్ఫుతంగా ఉన్నాయండి. ఒక్కమాటలో పైవ్యాఖ్యలన్నీ ఇక్కడ డిటో... ఎప్పుడో చూడాలి ఈనాటకం మళ్ళీ ... అభినందనలు.
మురళి said…
సుయోధనులవారు చూడ చక్కగా ఉన్నారు.. మీ గొంతు విన్నదే కాబట్టి ఆయా పద్యాలని మీ గొంతులో ఊహించుకుంటూ ఉంటానండీ, మీరు వీడియో పెట్టే వరకూ..
Unknown said…
చాలా బాగున్నాయండీ మీ ఫొటోలు...
నాటకం చూసే భాగ్యం మాకు కూడా కలిగితే బాగుండేది. :(
amma odi said…
బ్రహ్మండంగా ఉన్నాయండి!!! మీ వేషధారణ, ఆహార్యం చాలా బాగున్నాయండి. నగలు, కీరిటం మీరే చేసుకున్నారంటే నమ్మశక్యం కాలేదండి! చాలా బాగున్నారు. మొత్తానికి తెలుగువారి పద్యనాటకాలని అమెరికాలో చూపించారు. :)
ద్వారక ఘట్టం 5,6,7 ఫుటోలు , రాయబారం 12,13 బ్రహ్మాండం! రాయబారం 10 ఫుటోలో ఆ చివర కూర్చున్నాయన ఎవరు? కృష్ణులవారు భస్మం అయిపోయేట్టు చూస్తున్నారు....కౌరవుల వారా?

కనీసం ఆడియో అన్నా పెట్టండి మహప్రభో! ...
Sandeep P said…
చాలా చక్కగా ఉన్నాయండి మీ చిత్రాలు. అమెరికాలో కూడా తెలుగు నాటకాలు వేస్తున్నారు అంటే ప్రవాసాంధ్రుల్లో రసికత పుష్కలంగా ఉందనడానికి నిదర్శనం అదే.మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు.
మీ బహుముఖప్రజ్ఞాశాలిత్వం మఱోసారి వెల్లడైంది. మీరు తెలుగుజాతికే గర్వకారణం. మీ వాలకంలో ఆ నిశితత్వం సహజమా ? లేక పాత్రోచితమా ? మిమ్మల్ని స్వయంగా దర్శించినప్పుడు అది కనిపించలేదే ?
rākeśvara said…
వీడీయో కావలెను. వీడియో కావలెను.
ఆశీర్వదించిన మిత్రులందరికీ సవినయంగా నెనర్లు.

మాగంటి, పదోఫుటోలో కొరకొర చూస్తున్నది దుశ్శాసనుడు, పాత్రధారి శ్రీ సుబ్రహ్మణ్యంగారు. రాయబార ఘట్టంలో సభలో ఉండేది మరి కౌరవులేగదా! :)

తాడేపల్లి గారు, అతిశయోక్తికంటే ఎక్కువైన మాట సెలవిచ్చారు. నిశితత్వం పాత్రోచితమే.

విడియో మనచేతిలో లేదు. చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందినప్పుడు తప్పక తెలియచేస్తాను.
ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగటానికి - ఎంత కృషి చేసారో కదా,
ఎంత పట్టుదల ఉంటే అయ్యే పని అండి-
టోపీలు తీశాం.. ..


ఆర్యా! ఆనందమయగన
పర్యంకంకాదిచిత్రపంక్తిన్, కానీ
క్రౌర్యముగాంచనుసుంతయు
దుర్యోధను ముఖమునందు తోయజ నేత్రా!! :)

భవదీయుడు
ఊకదంపుడు
కొత్తపాళీ గారూ
ఫొటోలు చాలా బాగున్నయి. మీరు రారాజు పాత్రకు బాగా సరిపోయారు. మాకు దగ్గఱలో అయితే నాటక ఘట్టాలన్నీ ప్రత్యక్షంగా చూసుండే వాళ్ళము. విడియో వీలయొతే పెట్టండి. మీకు మీ బృందానికి అభినందనలు.
mmkodihalli said…
అద్భుతంగా ఉందండీ! మీలోని కళాకారునికి నా జోహార్లు!
భాను said…
అబినందనలు
గతంలో ఒకసారి ప్రస్తావించారు. ఇపుడు చేసి చూపించారు. అద్భుతం!
రవి said…
దుర్యోధనుని కిరీటం, కవచం, గద చాలా బావున్నాయండి. కనీసం ఓ పద్యమైనా రికార్డు చేసి వినిపించి ఉంటే బావుండేది.
తృష్ణ said…
ఫోటోస్ చాలా బాగున్నాయండీ..పాత్రకు సరిపోయారు అనిపించింది.
Nrahamthulla said…
బాగుంది నారాయణస్వామి గారూ.ఏ.వి.సుబ్బారావుగారి పద్యాలంటే నాకు చాలా ఇష్టం.అభిమాన ధనుడైన సుయోధన సార్వభౌముడి వేషానికి మీరు చక్కగా సరిపోయారు.
Unknown said…
సర్,

నిజంగా మీరు అవి అన్ని స్వంతంగ తయారు చేసుకున్నారా? చాలా ఆశ్చర్యంగ ఉంది సర్. కుదిరితె తప్పకుండ విడియొ పెట్టండి, ఫొటోలు చాలా బాగున్నాయి
నమస్కారములు.
చాలా బాగుంది. ఈ నాటక ప్రదర్సనలు టి.వి.9 లొ చూపించి నప్పుడు అనుకున్నాను. మీరుంటారేమొ అని.కాక పోతె ఉన్నాగాని గుర్తు పట్ట లెం కదా ? మీ దృస్య మాలిక లొ గదాధరుడు మీరే నా ? అన్ని చిత్రాలు చాలా బాగున్నాయి.సుందర రామకృష్న గారు ఘంట సాలను మించిన మధుర గళం.
Kalpana Rentala said…
కొత్తపాళీ,

నమ్మలేకపోతున్నాను. ఆహార్యం మీరే తయారు చేసుకున్నారని చెపుతుంటే..మిగతా వాళ్ళ డిమాండ్ నే నాది కూడా..ఫోటోలు కాదు, ఆడియో, వీడియొ పెట్టాలి.ఆడియో పెట్టాలి .ఆడియో పెట్టాలి.
కొత్తపాళీ గారు,
అభినందనలు
@ కల్పన, నాటకం విడియో సంగతి అలాగుంచండి, నేను ఆభరణాల్ని తయారు చేసుకోవడం విడియో తీసి ఉండాల్సిందేమో మిమ్మల్ని నమ్మించాలంటే :)

@ రాజేశ్వరి గారు, నెనర్లు. TV9లో వచ్చినది ఇది అయుండకపోవచ్చును. ఈ ప్రదర్శనకి అంత పబ్లిసిటీ జరగలేదు. ప్రస్తుతం అనేక నగరాల్లో తెలుగువారి దీపావళి సాంస్కృతికోత్సవాలు జరుగుతున్నాయి, ఆ బాపతు ఏదైనా అయుండవచ్చు.

వూకదంపుడు .. నా ఫుటోలు మీతో పద్యం రాయించాయంటే పర్లేదన్నమాట! ఐతే క్రౌర్యం కనబడ్డం లేదంటారా? దుర్యోధనుడిలో, కనీసం ఈ రెండుఘట్టాల్లో కనబడేది క్రౌర్యం కాదు. మనం విడిగా మాట్లాడుదాం మీకు ఆసక్తి ఉంటే.

మూర్తిగారు, మురళీమోహన్, భాను, ప్రసాద్, రవి, తృష్ణ, రహంతుల్లాగారు, స్ఫూర్తి, కృష్ణప్రియ .. నెనర్లు
ముప్పైఆరు కామెంట్లు వచ్చేదాకా ఇటైపు రాకపోవడం తప్పేనండీ గురువుగారు. మీగెటప్ సూపర్. ఇక వీడియోకోసం ఎదురుచూస్తూ ఉంటా. రియల్లీ గ్రేట్ సర్
KumarN said…
అమెరికా లో వివిధ తెలుగు సంఘాల సంబరాల్లో జరిగే నాసిరకపు కార్యక్రమాలు (ముఖ్యంగా చిన్న పిల్లల సినిమా డాన్సులు) చూసి చూసి విసిగి పోయిన నాకు, ఈ ఫోటోలు చూస్తూంటే ఖశ్చితంగా నేను మంచి ప్రొగ్రాం మిస్ అయ్యాననే అనుకుంటున్నాను.

గత వారమంతా బాల్టిమోర్ లోనే ఉన్నా. ఒక్క రోజు ముందొచ్చినా డెలావేర్ కొచ్చేవాణ్ణి. మా ఫ్రెండు ని వెళ్ళమంటే తనూ రాలేదు, చివర్లో చైనా కు వెళ్ళాల్సి వొచ్చి.

డైలాగులు వినకుడా ఇలా ఫోటోలు మాత్రమే చూడాల్సి రావటం..దారుణమయిన టీజింగ్!! :-)
:)

నేను చప్పినా చెప్పకపోయినా అందరూ చెప్పేశారుగా. గుర్తుంచుకుని లింకు పంపినందుకు ధన్యవాదాలు
sunita said…
అభినందనలు!!
మీ బ్లాగ్ లో కామెంట్ ఎట్టడం నాకు చాల గర్వంగా వుంది సార్. అభినందనలు
చైతన్య, మహేష్, గీతాచార్య, సునీత, నెనర్లు.

అశోక్ గారు, అంత ఏమి లేదు. మిగతాబ్లాగులలో లాగానే నా బ్లాగులోను హాయిగా కామెంటవచ్చు.
ఆలస్యంగానైనా సావకాశంగా అన్ని ఫొటోలు చూసాను. కానినండీ మీలో ఇంకాస్త దర్పం చూడాల్సిందే మీరు అచ్చంగా మా ఊహల్లో ధుర్యోధనుడు అనుకోవాలంటే :) నేను 9, 11, 14 ఫొటోల్లో పడి పడి శకుని మావకోసం చూసాను. అసలు కథ కాస్త మరిచాను కనుకా ఆయన ఉండడేమో ఈ ఘట్టాల్లో, అవునా? ఇపుడు మా నాన్నగారిని అడిగి మొట్టికాయలు వేయించుకునేకన్నా మీతో సన్నచీవాట్లు మేలని అడిగేసాను. అందరి ఆహార్యం, అసలా దృశ్యాల నిండుదనం అద్వితీయం. అమోఘం. అభినందనలు.
ఉషగారు, మీరు చాన్నాళ్ళ తరవాతయినా ఇటొచ్చి కనబడ్డం సంతోషం. ఫొటోలో పెద్దగా తెలీకపోవచ్చు గానీ స్టేజిమీద దర్పం బాగున్నదనే చూసినవారు అభిప్రాయ పడ్డారు. శకుని - కరక్టే సుమా! మరి ఒరిజినల్ రాయబారం సీనులో శకునికి పాత్ర ఉన్నదో లేదో తెలీదు.