తెలుగు బ్లాగులు - సాహిత్యం అనే విషయం మీద ఏడవ అమెరికా తెలుగు సాహిత్య సదస్సు (ఇండియనాపొలిస్)లో నా ప్రసంగం.
ఓపిగ్గా విడియో తీసిన మిత్రుడు కాలాస్త్రి శ్రీకి ధన్యవాదాలు.
మరోసారి అంతర్జాతీయ తెలుగు సాహిత్య వేదికమీద బ్లాగుల ప్రస్తావనకి చోటిచ్చిన వంగూరి చిట్టెన్రాజుగారికి ధన్యవాదాలు.
Comments
అన్నట్లు మీ కథల్ని చదువుతున్నాము. చాలా బాగున్నాయి.. ముఖ్యంగా "వీరిగాడి వలస"..
ఒంటరి సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొనే ఇటువంటి సమస్యల్ని చాలా మంది వ్రాస్తున్నారు.. మీరు చెప్పిన విధానం, తీసుకున్న విషయం బాగున్నాయి.
మంథా భానుమతి.
బ్లాగుల గురించి చాల బాగ వివరించారు. మా లాంటి కొత్తగా బ్లాగులు రాయబొయెవారికి మంచి స్ఫూర్తి నిచ్చారు, ఉత్సాహాన్ని నింపారు.
అనిల్, రాయాలండీ. అవును, అప్పటికే ఆ చర్చకి అధ్యక్షులు పక్కనించి సైగలు చేస్తున్నారు టైము దాటిందని. :)
భానుమతి గారు, నా బ్లాగుకి వచ్చి చూసి, వ్యాఖ్యానించినందుకు మిగుల ధన్యవాదాలు. మీరు కూడా బ్లాగడం మొదలుపెట్టాలని మనవి.
స్పూర్తి, సంతోషం.
కృష్ణప్రియగారు, నా బ్లాగులో మీ వ్యాఖ్యకి సమాధానం ఇచ్చినప్పుడల్లా మీ పేరుని కూనీ చేస్తున్నానని ఇప్పూడే గమనించాను. సారీ. ఇక మీదట జాగ్రత్త వహిస్తాను. మీ మిత్రబృందంలో మీరు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం.
బాగుంది!
చిన్న సైజు అబ్జర్వేషన్స్ -
అ) "అనేక సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల బ్లాగు అనే ప్రక్రియ అందరికీ అందుబాటులోకి వచ్చింది." ఈ పాయింటు ఇంటరెస్టింగుగా ఉంది, కానీ అలా సగంలో వదిలేసారేమిటబ్బా అనుకున్నా. శ్యామల గారి దగ్గరికి, వారి చెల్లెలు గారి దగ్గరికి వచ్చాకా పూర్తిగా పూర్తి పాఠం అర్థమయ్యింది.
ఆ) "సామెత చెబితే కులాన్ని దూషించాడు" అని అన్న ఆయనెవరో తెలీదు కానీ, మాటలు కొద్దిగా ముద్దగా రావటంతో ట్యూబులైటు వెలగటానికి ఒక్క సెకను టైము ఎక్కువ పట్టింది.
ఇ) నిట్ పికింగ్ కాదు కానీ - అన్నమయ్య బ్లాగు "వాడి" పేరు గుర్తుందా? - ఈ ప్రశ్న "వాడి" కెలా అనిపించిందా అని నాకనిపించింది.
ఈ) నవీన జానపద సాహిత్యం అన్న విషయంతో/కామెంటుతో బోల్డు తిప్పలున్నాయి నాకు కానీ, మీరు ఆ వాక్యాన్ని భాషణంలో కలిపేసి చెప్పిన విధానం బాగుంది.
కాలాస్త్రి కి కూడోస్! మీకూ కూడోస్!
అన్నమయ్య బ్లాగు శ్రవణ్‌తో నాకు ఆ చనువు ఉన్నదనే అనుకుంటున్నాను. కానీ ఒక బహిరంగ వేదిక మీద ఎవరినైనా మన్నించి మాట్లాడడమే మంచిది, ఒప్పుకున్నాను.
సామెతని గురించి పక్కనించి కామెంటు చేసింది అక్కిరాజు సుందరరామకృష్ణగారు.
నవీన జానపద వాజ్మయం అంటే మీకెందుకు తిప్పలో రాయండి మరి!