అంతటా ఎన్నికల సంరంభం. డెమోక్రాట్లు బుజాలు తడుముకోవడం. రిపబ్లికన్లు లేని బింకాలు ప్రదర్శించడం. టీపార్టీవారు మీసాలు దువ్వి తొడలు చరచడం, అంతా మహా సందోహంగా ఉంది. కానీ ఎవరు గెలిచీ సాధించేది, ఎప్పుడు జరుగుత్న్నదానికంటే ఇంకా ఊడబొడిచేది ఏమీ కనబడ్డంలేదు. కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు మెజారిటీ సాధిస్తే మాత్రం ఒబామా ప్రతిపాదించే ప్రతీ శాసన ప్రతిపాదనకీ వాళ్ళు అడుగడుగునా అడ్డుతగుల్తారనేది కచ్చితమే. అదేవిటో విచిత్రం - బుష్షు అధ్యక్షుడిగా తన లెజిస్లేటివ్ ఎజెండాని వొద్దుమొర్రో అంటున్న డిమొక్రాటిక్ కాంగ్రెస్ గొంతులో బలవంతంగా కుక్కి మరీ సాధించుకున్నాడు. కానీ డిమొక్రాటిక్ అధ్యక్షులెవరూ రిపబ్లికన్ కాంగ్రెస్‌తో ఇట్లాంటి విజయం సాధించలేకపోయారు. చూడాలి ఏమవుతుందో. కానీ నాకు బొత్తిగా ఆసక్తి పోయింది.
మా ఊరి వాతావరణం పూరిత్గా ఫాల్లోకి పడిపోవాలో లేక ఇంకా కొంచెం సేపు వేసవి కొంగులు పట్టుకుని వేళ్ళాడాలో తేల్చుకోలేకుండా ఉంది. ఒక పూట ఇంచుమించు తొంభఈ డిగ్రీలు తాకుతూ చెమటల కక్కిస్తుంటే మరునాడే గరిష్ఠం అరవై దాటట్లేదు. సాధారణంగా ఫాల్ మొదట్లో ఇట్లాంటి సయ్యాట మామూలే, కాకపోతే అది అక్టోబర్లో జరిగేది, ఈ సారి లేబర్ డే నించే మొదలైపోయింది.
మొదటి చలి దెబ్బకి పెరటి తోటలో కొన్ని మొక్కలు వాడిపోతే ఇంక నా వ్యవసాయం పని సరి అనుకున్నాను. కానీ మళ్ళీ కొన్ని రోజులు వెచ్చగా ఉండడం వల్లనో ఏమో, మొక్కలు కోలుకున్నాయి. టొమేటో, గోంగూర, పచ్చిమిరప దిగుబడిని ఇస్తూనే ఉండగా, తొలిసారిగా దోస, కాకర పాదులు కాపుకాసి అనుగ్రహించాయి. ఊరిస్తున్నాను అనుకోకపోతే, కాకరకాయ వేపుడు మహా రుచిగా ఉన్నది. ఏదేమైనా, రాశిలో కాకున్నా వాసిలో ఈ సంవత్సరం వ్యవసాయం సక్సెస్ అనే అనుకుంటున్నా. వేసిన మొక్కలన్నీ బాగా ఎదగడమే కాక, ఒకటో అరో ఫలసాయాన్ని ఇచ్చాయి. వచ్చే యేటికి ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు ఉత్తేజం కలిగించాయి.
మిషిగన్‌లో గ్రాండ్ రేపిడ్స్ నగరంలో మళ్ళీ ఆర్ట్ ప్రైజ్ నడపబోతున్నారుట. పోయినేడు వెళ్ళనే లేదు. చూడాలి ఈ ఏడాదన్నా కుదురుతుందేమో.
సమాజంలోని ఏ ఒక్క పార్శ్వంలోనైనా మౌలికమైన మార్పు తేవాలంటే అవసరమైనది డబ్బా? లేక కొత్త ఆలోచనా? లేక మార్పు సాధించాలి అనే పట్టుదలా? ఉదాహరణకి ఏదైనా నగరంలో ఉండే పాఠశాల వ్యవస్థని తీసుకోండి. అమెరికాలో పబ్లిక్ పాఠశాల వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉంటూ వచ్చింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు కొన్ని కలిపి ఒక స్కూల్ బోర్డు అధీనంలో నడుస్తుంటాయి. ఉన్నతోద్యోగిగా సూపెరింటెండేంటు గారు దీని నిర్వహణ చూస్తుండగా, పౌరులచే ఎన్నుకోబడిన డైరెక్టర్లు ఈ స్కూల్బోర్డుని పర్యవేక్షిస్తూంటారు. ఆ స్కూల్ బోర్డు పరిధిలో నివసించే పిల్లలందరికీ ఆయా బడులలో ఉచిత విద్య. స్కూల్ బోర్డు బడ్జెట్ ఆ ప్రాంతపు ఇంటిపన్నుల, భూమి పన్నుల ద్వారా భర్తీ అవుతుంది. ఇదంతా బాగానే ఉన్నది గానీ, అనేక కారణాల వల్ల, దేశవ్యాప్తంగా అనేక నగరాల స్కూలు బోర్డులు లోతైన డెఫిసిట్ బడ్జెట్లతో నడుస్తున్నాయి. తద్వారా విద్యార్ధులకి సరైన సదుపాయాల నందించలేక, విద్యార్ధుల్ని కోల్పోతున్నాయి. విద్య నాణ్యత కూడ గణనీయంగా పడిపోతున్నది. ఇదంతా ఒక downward spiral. ఒకసారి ఈ బాటలో పడిందంటే, ఆ స్కూల్ బోర్డు అలా ఇంకా అథోగతికి జారిపోతూనే ఉంటుంది - బయటపడి, పైకి రావడం చాలా కష్టం.
ఈ ఇబ్బందులు ముఖ్యంగా పెద్దపెద్ద నగరాల పరిధిలో ఉన్న స్కూల్ బోర్డులని ఎక్కువగా వేధిస్తున్నాయి. దానికితోడు నగర మధ్యభాగాల్ని పీడిస్తున్న అధిక నిరుద్యోగం, వ్యాపించిన పేదరికం, పడిపోతున్న ఇంటి ఖరీదు - ఇవన్నీ కూడా ఈ అథోగతికి దోహదం చేస్తున్నై. ఐతే ఈ ట్రెండ్‌ని మార్చలేమా? విద్య నాణ్యత పెంచలేమా? చెయ్యొచ్చు. చేసి చూపించిన ఉదాహరణలు లేకపోలేదు. ఇట్లాంటి మార్పుని సాధించడంలో న్యూ ఆర్లీన్స్ స్కూల్ బోర్డు ఆకర్షణీయమైన ఉదాహరణగా నిలిచింది. ఐతే, దాని ప్రగతి శ్రద్ధగా గమనించిన కొందరు "వాళ్ళు ఛార్టర్ స్కూళ్ళని మరీ ఎక్కువగా ప్రోత్సహించారు" అని విమర్శిస్తున్నారు. ఛార్టర్ స్కూళ్ళ ప్రసక్తి తీసుకురాంగానే చర్చ కాస్తా పాలిటిక్సు బారిన పడిపోతుంది. అందుకని మనం దాని జోలికి పోవద్దు ఇప్పుడే. ఒక స్కూల్ బోర్డు పరిధిలో తగు మోతాదులో ఛార్టర్ స్కూళ్ళు ఉంటే మంచిదే, కానీ మొత్తం పబ్లిక్ స్కూళ్ళన్నిటినీ మూసెయ్యలేం కదా! ఉన్న పబ్లిక్ స్కూళ్ళని ఎలా మెరుగుపరచడం అన్నది అసలు ఛాలెంజ్.
నువార్క్ స్కూల్ బోర్డుకి వంద మిలియన్ల డాలర్లు, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇచ్చాడుట, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడూ, సీయీవో, ఇరవయ్యారేళ్ళ మార్క్ జుక్కర్‌బర్గ్. డబ్బు మేలైన విద్యని పుట్టిస్తుందా? చూద్దాం!
ఇతనెవరో, మోటర్‌సైకిళ్ళంటే బాగా మోజల్లే ఉంది. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments
చదువు ఎలాగ నేర్పినా పిల్లలకి కనీసం శుభ్రత ఆవశ్యకత అర్థం అయ్యేలా చేయటం లో అందరూ విఫలమయ్యారనిపించింది. ఒకరిద్దరు మాత్రం శుభ్రం గా తల కి నూనె రాసి దువ్వుకుని కనిపించారు. మొదటి సారి ఉత్సాహం గా ఒక అరగంట ముందు చేరాను. టీచర్ చక్కని చీర కట్టుకుని అందం గా తయారయి ఒక రేడియో పెట్టుకుని వింటూ పత్రికలు తిరగేస్తున్నారు. ఏమాత్రం సిగ్గు లేకపోగా.. నేను టేకోవర్ చేసేటప్పుడు రేడియో వాల్యూం తగ్గిస్తే.. 'నూ.. లెట్ ఇట్ బీ హై' అంది. చాలా బాధ వేసింది. ఏమి చేయగలను? నేనైతే అక్కడున్నంత కాలం స్నానం చేయమని, నూనె రాసుకుని తల దువ్వుకొమ్మనీ.. అందరం కలిసి క్లాస్ రూం కార్పెట్ శుభ్రం చేసాం.
మరీ కామెంట్ పెద్దదయినట్టుంది.. :-)
ఇంటి తోటనీ బడినీ ఒక పోస్టులో రాయడం బావుంది. రెండూ ఒకలాంటివేగా!!
అక్కడి స్కూళ్ళ గురించీ, విధానాల గురించీ చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
krishna priya garu miru cheppindi india lo paristhitha, america lona?(sorry andi)
@కృష్ణప్రియ...మీరు చెప్పిన విషయాలు వింటే బాధేసింది. ఇక్కడ పబ్లిక్ స్కూల్ల గురించి ఇంకా చాలా మంచి విశేషాలున్నాయి.
కృష్ణప్రియ .. మీ స్వఛ్ఛంద సేవ బాగుంది. ఈ విషయంలో నా అనుభవం కొంచెం వేరుగా ఉంది. ఒక తెలంగాణా పల్లెటూరి ఉన్నత పాఠశాలలో కొన్నాళ్ళు పాఠం చెప్పాను. పదోతరగతి పిల్లలు చక్కగా శుభ్రంగా ఉన్నారు. మీ అనుభవాన్ని కాదనడం లేదు. ప్రాథమిక వసతుల విషయంలో ప్రభుత్వ పాఠశాలల దీనావస్థ మనకి తెలియనిది కాదు.
Weekend Politician .. నచ్చినందుకు సంతోషం
spoorthi .. దయచేసి వ్యాఖ్య తెలుగులో రాయండి. తెలుగులో రాసేందుకు బోలెడు సాధనాలున్నాయి. ఉదాహరణకి, లేఖిని చూడండి. నా వ్యవసాయం నచ్చినందుకు సంతోషం. మీ పేరు మీద నొక్కితే బ్లాగుకి దారి తీయలేదు. మీకు బ్లాగు ఉంటే తెలియజెయ్యండి. లేనియెడల వెంటనే ఒకటి మొదలు పెట్టండి.
Kalpana .. భానుకి చెప్పిన సమాధానమే మీక్కూడాను. ఈ సంవత్సరానికి ఇక వ్యవసాయం ముగిసినట్లే. వచ్చే వేసవిలో మీరెప్పుడు వస్తానన్నా మా యింటి ద్వారాలు తెరిచే ఉంటాయి.
మీ కాకరకాయ వేపుడు తినలేకపోయినందుకు చింతిస్తున్నాం, ఒకవేళ మీ దగ్గరికి వస్తే, కల్పనా గారి లాగ ఫ్రిజ్ లో పెట్టేసి ఫ్రై బాగుందన్నం కదాని మూడు రోజులు అదే పెడతార కొంప దీసి, అమ్మో మీ అమెరిక రాము లెండి.
చివరగా- కొత్తపుట బావుంది. ఏమో నేనూ మారుస్తానేమో. దీన్నే పెట్టేసుకున్నా నేను నిమిత్తమాత్రుణ్ణి. అంతా విష్ణుమాయ.
మీరాశేమిటో చెబితే మామిత్రుల్లో ఆరాశివాళ్ళకి ఈఏడు వ్యవసాయం చెయ్యమంటా :)
చైతన్య, వ్యవసాయం రాశిలో లేదు, హస్తవాసిలో ఉంది :)
బుష్షు డెమెక్రాటిక్ కాంగ్రేసుతో అన్నిపనులు కానించుకున్నాడని ఆశ్చర్యపడటం ఎందుకు? రెండు యుద్ధాలు పక్కనపెడితే భూషయ్య పెద్ద కంజర్వేటివేమీ కాదు, ఆయన వెలగబెట్టిన విషయాల్లో ప్రిస్కిప్షన్ డ్రగ్ ప్రోగ్రామ్, నో చైల్డ్ లెఫ్ట్ బిహైండ్ లాంటివాటికి ఒబామా కూడా జబ్బలుచరుచుకుంటూ ఓటెయ్యగలడు. ఒక్క సోషల్ సెక్యూరిటీ ప్రైవెటీకరణ తప్ప వామపక్షీయులకు అభ్యంతరకరమైనవేవీ ప్రతిపాదించలేదు (అది కూడా క్లింటన్ కాలపు నాటి బిల్లు తిరగతోడినదే; అయినా సాధించలేదు..ప్చ్) - టాక్సు కట్స్ రిపబ్లికన్ కాంగ్రేసున్నప్పుడు ఆమోదించినవే. నిజానికి భూషయ్యకు క్రెడిటొస్తుందని కుళ్ళుకోకుండా ఇంకాస్త సహకరించి ఉంటే తరతరాల నుంచి వామపక్షాలు కలగంటున్న ఇమ్మిగ్రేషన్ రిఫార్ము, ఆమ్నెస్టీ వంటివి చాలా చేసిపెట్టేవాడు.
భూషయ్యతో పోల్చుకుంటే ఒబామా రెండేళ్లలో చాలానే సాధించాడు కానీ అవన్నీ ఎంతకాలం నిలుస్తాయో చెప్పలేం
ఐతే పబ్లిక్ స్కూళ్ళన్నిటినీ మూసెయ్యాలంటావ్? :)
ప్రెసిడెంట్ల లెజిస్లేటివ్ ఎజెండాల గురించి నువ్వు చెప్పింది రైటే. నిజంగా ప్రజాజీవితాన్ని ప్రభావితం చేస్తున్న విషయాల మీద డె - రి తేడా పెద్దగా లేదు, ముఖ్యంగా ప్రెసిడెంట్ల ఎజెండాల్లో.
@ మురళి .. నెనర్లు
http://vennelalu.blogspot.com