రెండు ఇటీవలి టపాల మీద వ్యాఖ్యానం

ధర్మవడ్డీ కథ గురించి
అబ్రకదబ్ర, కామేశ్వర్రావు ఇద్దరూ రచయిత ఈ కథని అంత సమర్ధవంతంగా నిర్వహించలేదు అనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడింది నాకు.
కానీ నా ఉద్దేశంలో రచయిత అంత మరీ అంత అమాయకుడో తెలివిలేని వాడో కాదు. ఈ కథ శీర్షికనీ, శ్త్రక్చర్‌ని తెలివిగానే ఎన్నుకున్నాడు. ఆయన డబ్బు గురించీ, మొరాలిటీని గురించీ, మారుతున్న సమాజాన్ని గురించీ ఒక ప్రకటన (పోనీ అబ్సర్వేషన్ చెయ్యదల్చుకున్నాడు). కానీ ఆ ప్రకటన ఇదీ అని చెప్పేస్తే అది మనసుకెక్కదు సరికదా, కథకూడా నిలవదు. అందుకే నిజంగా కథ చెబుతున్నది ఎవరు అనేది పాఠకుడికి తిన్నగా అర్ధంకాకుండా మూడు పొరల మాటున ఉంచడం, కొంత అయోమయ పరిస్థితి కలిగించడం.
మీరు జాగ్రత్తగా చూస్తే ఆ కథలో మీరు చదువుతున్న ప్రతి అక్షరమూ ఏదో ఒక పాత్ర మనోభావాలే, లేదా ఒక పాత్రకి కలుగుతున్న ఇంప్రెషన్లే. వాటిల్లో ఈ ఫలానా వాక్యం రచయిత అభిప్రాయమే అని మనం ఇతమిత్థంగా చెప్పేందుకు కుదరదు. ఇదీ రచయిత సాధించిన అదనపు ప్రయోజనం నా దృష్టిలో.
ఊదం గారి విశ్లేషణ ఇంకోంచెం కాంప్లెక్సుగా ఉంది. రచయితా కథకుడూ ఒకరేనా అన్న ప్రశ్న గురించి - అంటే అర్ధం రచయిత వ్యక్తిగత జీవిత విషయాలు మనకి తెలిసి ఉండాలని కాదు. రచయితగా గోపీచందు బాగానే ప్రఖ్యాతుడు కాబట్టి సమాజం పట్ల ఆయన నమ్మకాలు, ఆయన ఆలోచనా ధోరణులు పాఠకులకి తెలిసే అవకాశం బాగానే ఉంది. ఆ దృష్టితో బేరీజు వెయ్యడమే తప్ప అతనికి ఎందరు పిల్లలు, ఆయన వడ్డీ వ్యాపారం చేశాడా లేదా అని కాదు. మిగతా పాయింట్ల మీద మీ విశ్లేషణ నాకు నచ్చింది. మరో చిన్న విషయం. పఠయిత అనే వాడుక చూడ్డం ఇదే మొదలు. చదివేవాళ్ళని పాఠకులని, కొన్ని చోట్ల పఠిత అనీ అనడం చూశాను.
ఈ కథ గురించి నా ఉద్దేశం - గొప్ప కథ కాకపోవచ్చును గానీ ఆసక్తి కరమైన కథ. దీన్ని లోతుగా చూడాలంటే కథారచన కాల నేపథ్యం గుర్తు చేసుకుంటే ఉపయోగిస్తుంది. సమాజంలో పాతుకుని ఉన్న ధర్మవడ్డి అనే వ్యవస్థకి మారుతున్న సమాజంలో కాలం చెల్లుతోంది అనే ఆశతో ప్రతీకాత్మకంగా ఈ కథ గోపీచంద్ రాశారని నేననుకుంటున్నా. సూరయ్య పాత వ్యవస్థకి ప్రతీక. చంద్రయ్య దాన్ని ఎదిరించే కొత్త మార్పుకి ప్రతీక. ప్రజలందరూ చిన్నా పెద్దా సూరయ్యని ఏడిపించడం - సమాజం మార్పువేపుకే మొగ్గుతుంది అనే సూచన. ఇక నేను, నేను గారి మిత్రుడు .. మనమే.
సత్ గారికి .. అయ్యా, మరి బ్లాగంటూ పెట్టుకున్నాక, ఆధునిక సాహిత్యమంటే ఇష్టమైనాక ఇలాంటి టపాలు కూడా వస్తూంటై. ఇది నచ్చకపోతే వొదిలెయ్యండి, త్వరలోనే మీకు నచ్చే టపా ఇంకోటొస్తుందేమో? మనిషి ఆశాజీవి కదా :)

పోలీసు గూండాయిజం గురించి
ఈ టపాకి వచ్చిన స్పందనలు చూశాక .. మనం రాసిందాన్ని చదివేవాళ్ళు ఎంత విభిన్నమైన దృష్టితో చదువుతారు గదా అని మరోసారి స్ఫురణకి వచ్చింది. ఇంచుమించు కామెంటిన అందరూ నేను జర్నలిస్టుల్ని సమర్ధించాననో, పోలీసుల్ని తప్పుపట్టాననో భావించారు.
నేను ఈ రెండూ చెయ్యలేదు. నేను వాడిన రెటొరిక్‌లో అటువంటి భావన కలిగించే వత్తిడి ఉండొచ్చు, కాదనను. నేను చెప్పిందల్లా .. మన సమాజం ఒక పోలీసు పరిపాలనలో ఉన్నదనీ, ఆధునిక అభ్యుదయ సమాజం ఏదీ పోలీసు పాలనలో ఉండకూడదనీ - అంతే.

Comments

Sanath Sripathi said…
కొత్తపాళీ గారూ, నేను కాకుండా ఇంకో సనత్ ఉన్నారేమో తెలీదు కానీ. మీ ధర్మవడ్డీ కథ గురించి నేను కామెంటలేదు.. ఎవరో సత్ అన్నాయన చెసారు. అది నేను కాదు సుమీ....

నేను sripathi.sanath తో కానీ http://raata-geeta.blogspot.com/ తో కానీ కామెంటుతా...

అపార్ధాలు కాకూడదని నివృత్తి చేస్తున్నా. ..
సనత్ గారు, క్షమించాలి .. న అదనంగా పడినట్టుంది సవరిస్తా.
Anonymous said…
ఇదంతా చదివాక, నాకు కధ ఎందుకు నచ్చలేదు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు తోచినవి ఇవీ.
కధ ప్రారంభంలో సూరయ్య పాత్ర మీద జాలి కలిగింది(నేను గారి మిత్రుడు వెంట పడి మరీ కలిగించాడు). నడిచినకొద్దీ విలనయ్యాడు. చంద్రయ్య పాత్ర లో హీరోయిజం కనిపించక పోగా విలనీ అనిపించింది. మొత్తం మీద అయోమయాన్ని మిగిల్చింది.. దీనికి కారణం రచయిత పాండిత్యమా, నా చదవటం చేత కాని తనమా? పోలీసు గూండాయిజం లోని రచయిత భావం పాఠకులు (ఇంచుమించు అందరూ) వేరే రకంగా అర్ధం చేసుకున్నారంటే తప్పెవరిది? ఎలా చెప్పినప్పటికీనూ, ఎలాంటి టెక్నిక్కులు ఉపయోగించినప్పటికీనూ మన తిలక్ అన్నట్టు “పాఠకుడికి నీ ఆకారం అందాలి. హత్తుకోవాలి”.
ఎదేమైనా, “కధనెలా చదవాలి?” చదివేదాక కధ చదవటం వెనుక ఇంత కధ ఉంటుందని తెలియదు. ఇంతకు ముందు ఎలా పడితే అలా , స్వేచ్చగా, ఎడాపెడా చదివేసేవాడిని. ఇక పై రచయిత పూర్వాపరాలు తెలుసుకుని భయం భయంగా, బిక్కుబిక్కుమంటూనే.......
అంతా తర్కించుకున్నాక ఇలా అనిపించింది “ ఒక్కోసారి జ్ఞానం కంటే ఆజ్ఞానం ఎక్కువ ఆనందాన్నిస్తుంది.”

కొత్తపాళీ గారూ, ఇష్టపడి మరీ తలకెత్తుకున్నాక ఆ మాత్రం మోయలేనా..! కానివ్వండి...:)
@sat .. good point re. the writer's responsibility to convey the meaning effectively to the reader. రచయిత అన్నవాడు రాసిందేదో రాసేసి, తరవాత పాఠకులు వేరేరకంగా అర్ధం చేసుకుంటే, హబ్బే నేను రాసింది ఇదికాదూ ఇంకోంటి అని ముస్సద్దీ పేచీ పెట్టి లాభం లేదు. నిజమే.

నేను కథనెలా చదవాలి టపా రాయడం వెనకాల ఉద్దేశం అదే. మనం కాల్పనిక సాహిత్యం అనగానే దాన్ని మనసుతో చదివే ప్రయత్నం చేస్తాం. అది అవసరమే కూడా. కానీ సాహిత్యం వల్ల మానసికోద్రేకాన్ని మించిన ప్రయోజనం ఉండాలీ అనుకుంటే దానికి కొద్దిగా మెదడు కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. అన్ని రచనలకీ రచయిత పుట్టుపూర్వోత్తరాల నించీ తెలియనక్కర్లేదు కానీ ఒక రచన ఇలాగ ఎందుకుందీ అని కొద్దిగానైనా లోతుగా తవ్వి చూసే నిశిత దృష్టి అలవాటు చేసుకోవడం పాఠకులకి మేలు చేస్తుందనే నేననుకుంటున్నాను. తద్వారా ఒక రచన చదవడంలో వచ్చే తృప్తి పెరుగుతుందని నా స్వానుభవమే.
పఠయిత తప్పు అనుకుంటానండి, నాకూ నిఘంటువులో కనబడలేదు, ఐతే ఇది నాది కాదు, ఒకటి రెండు పుస్తకాలలో చూసినట్టు గుర్తు, ఈ సారి ఏ పుస్తకంలోనైనా కనబడితే చెబుతాను.
ఇవేళ తెనాలి లో ఓ పిచ్చివాడు(?) తారస పడ్డాడు, కూరగాయల మార్కెట్టు వద్ద, "మా అన్నయకి ఇవ్వద్దు, ఆయన ఇల్లు కట్టుకున్నాడు నాకే ఇవ్వు," అంటూ అందరి దగ్గరా అడుక్కుంటూ...
ఈ కధ గుర్తొచ్చింది