నేషనల్లెవెలు పాలిటిక్సుని గురించి వో .. .. చించుకుంటే చిరిగేది మన ధ్వనితంత్రులే గానీ పెద్దగా వొరిగేదేంలేదని చిన్నతనంలోనే గ్రహించేశాను కాబట్టి, దేశాధ్యక్షులూ, సెనేటర్లూ, ప్రతినిధులూ చేసే వెధవ పన్లని చూసీ చూణ్ణట్టు పోతూ వుంటా. టీవీ చూడ్డం మానెయ్యడానిక్కూడా ఇదో కారణం.
కానీ ఈ మధ్యన అసలు ఒక్క రెణ్ణిమిషాలు ఏ రేడియో షో విన్నా, ఎక్కడన్నా జాలంలో ఓ రెండు న్యూసు ముక్కలు చదివినా కళ్ళ ముందు ఎర్రని తెరలు, చెవుల్లో హోరు, కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టు (హబ్బే రక్తపోటు కాదులేండి, మీ పుణ్యమాని బీపీ నార్మల్ గానే ఉంది, మొన్నే చెక్ చేయించుకున్నా) ..
జాతీయ రాజకీయ రంగమ్మీద డెమోక్రాట్ల నిర్వాకం చూస్తుంటే చిరాకు మారాకు వేసి తిక్క నసాళానికి అంటుతోంది. ఒక పక్కన పదిహేను మిలియన్ల మంది ఉద్యోగస్తులు జీవనభృతి కోల్పోయి అలోలక్ష్మణా అని ఏడుస్తుంటే, అబ్బే నా పేరు లక్ష్మణుడు కాదు అన్నట్టు .. అసలేం మాట్లాడుతున్నారో ఆలోచిస్తున్నారో కనీసపు ఇంగిత జ్ఞానం లేనట్టుగా కనిపిస్తోంది. 90లలో ఆంధ్ర దేశంలో ఒకపక్కన రైతులు ఎడాపెడా ఆత్మహత్యలు చేసుకుంటూంటే హైదరబాదు హైటెక్కు అందాల్ని విదేశీ వీఐపీలకి చూపిస్తూ మురుసుకున్న టీడీపీ ప్రభుత్వం గుర్తొస్తోంది నాకిప్పుడు ఈ జోకర్లని చూస్తూంటే.
ప్రభుత్వమే అసలు సమస్య అన్నాడు చచ్చి నరకానికి పోయిన రీగన్ మహాశాయుడు. నాలాంటి వెర్రి కుట్టెలం, ఎన్ని అనుభవాలు తగిల్నా, ఇంకా ప్రభుత్వం ఏదో తవ్వి తలకెత్తుతుందనే భ్రమలో పడి కొట్టుకుపోతూంటాం. నిజవే కదా, ఏ విషయంలో మాత్రం - ఈ విషయంలో ఇది చాలా సమర్ధవంతంగా పని చేస్తోంది - అన్నట్టు ఆశాజనకంగా ఉన్నదా ఏ ప్రభుత్వపు తీరైనా? ప్రభుత్వాఫీసంటేనే నిర్లక్ష్యానికీ, అశ్రద్ధకీ, జాప్యానికీ, నాంచివేతకీ నిర్వచనాలు కదా. అట్లాంటప్పుడు దేశ సమస్యలు, ప్రజల సమస్యలు ఇట్లాంటి ప్రభుత్వం చేతిలో పెట్టి నిశ్చింతగా కూచుందామనుకున్న మన దురాశ ఉందే .. టోకున మనల్నందర్నీ మెంటల్ అని సెర్టిఫై చేస్సి పిచ్చాసుపత్రులకి తోలెయ్యొచ్చు.
చూడండి, లేకపోతే తన బుర్ర తిన్నగా ఉన్న ఏ మనిషైనా ఇట్లాంటి పనులు చేస్తాడా?
1. ఇవ్వాళ్ళ కాకపోతే ఇంకొన్నాళ్లలో మునిగే కార్ల కంపెనీలని సొంత డబ్బు యాభై బిలియన్ల డాలర్లు పెట్టి కొనుక్కున్నాం .. ఖర్చు పెడుతున్నప్పుడే చెప్పారు మన ప్రతినిధులు .. ఈ డబ్బు తిరిగొస్తుందని ఆశ పెట్టుకోకండీ అని. ఆ మాత్రం నిజాయితీ మిగిలి చచ్చింది.
2. వాలు వీధి బేంకులు గుడ్లు తేలేస్తే ఏం పర్లేదు భాయీ మేమున్నాంగా అని మన ఖజానాలు తెరిచి వాళ్ళకి ఖాళీ చెక్కులిచ్చాం .. దానకర్ణుడి సవిత్తమ్ముళ్ళం కదా. అవును, ఇప్పుడా బేంకులు తమ ఆఫీసర్లకి మనడబ్బుల్ని బోనస్ గా ఇస్తూంటే ఎందుకూ ఏడవడం .. మనమిచ్చిన దానంతో వాడో కొత్త ఫెరారీ కొనుక్కుంటే అంతర్జాతీయ కార్ల వ్యవస్థని నిలబెట్టినట్టు కాదూ? వాడు బహమాస్ లో పదమూడో వెకేషన్ హోం కొనుక్కుంటే గ్లోబల్ రియలెస్టేట్ ని ఉద్ధరించినట్టు కాదూ? మనలాంటి సామాన్య పౌరులం మన సొంత డబ్బుతో ఇటువంటి ఘనకార్యాలు చెయ్యగలుగుతున్నందుకు గర్వించాలి గానీ ఏడుస్తారా ఎవరన్నా?
3. హెల్తు కేరు .. కేరు కేరు మని ఏడ్చి సెనేటు ఫ్లోరు మీద సొమ్మసిల్లి పడిపోయింది. డెమొక్రాట్లు తందనానా అని గంతులేసి మాసచుసెట్ సీటు పోగొట్టుకున్నారుగా? ఆ సొమ్మసిల్లిపోయిన హెల్తు బిల్లుకి సీపీఆర్ సంగతి దేవుడెరుగు, కనీసం పచ్చి మంచి నీళ్ళు పోసే నాథుడు కనబడ్డం లేదు.
చెప్పుకుంటూ పోతే ఇది చాంతాడంత లిస్టవుతుంది, మనమందరం మెంటల్ అని నిర్ధారించేందుకు. అర్రె, బ్రిలియంట్ బిజినెస్సయిడియా .. ఎర్రగడ్డ చుట్టు పట్ల ఓ నాలుగో ప్ఫదో పిచ్చాసుపత్రులు కట్టించేస్తే ఈ అమెరికా పిచ్చోళ్ళని ఔట్‌సోర్సింగులో అక్కడికి తీసుకెళ్ళి .. ఆలసించిన ఆశాభంగం, రండి బాబూ రండి .. భాగస్వాములు కండి ..
ఇప్పుడు మీరంటారు, నాకు తెల్సు .. అవున్సార్ .. ఈటనిట్ని గురించీ మనం చించుకుంటే చిరిగేది మన వోకల్ ఖార్డ్సే గానీ ..
అందుకే .. దానికి ప్రత్యామ్నాయం కూడ చెబుతున్నా. మీరు చెయ్యగలిగిన పనీ ఉంది.
మీరే చెయ్యగలిగిన పని యిది.
ముందస్తుగా మీ సెనేటర్లెవరో, మీ కాంగ్రెస్ ప్రతినిధి ఎవరో తెలుసుకోండి. అటుపైన ఉత్తరం ద్వారా, ఫోను ద్వారా, ఫేక్సు ద్వారా, ఈమెయిలు ద్వారా ఈ కింది అంశాల పైన వాళ్ళకి మీ అభిప్రాయం నొక్కి చెప్పండి.
అ. ఆరోగ్య బీమా వ్యవస్థ మార్పులు (Healthcare Reforms)
ఆ. ద్రవ్య వ్యవస్థ మార్పులు (Finance and monetary policy reforms)
ఇ. వలసవిధాన మార్పులు (Immigration reforms)
ఈ. పర్యావరణ విధాన మార్పులు (Environmental policy reforms)
ప్రతిరాష్ట్రానికీ ఇద్దరు సెనేటర్లుంటారు. మనం ఇద్దరికీ రాయొచ్చు. వీళ్ళల్లో ఎవరెవరైతే ఈ సంవత్సరం నవంబర్లో తిరిగి ఎన్నికలకి నిలబడుతున్నారో, వాళ్ళ విషయంలో ఇది మరీ ముఖ్యం. ఈ పని చెయ్యడానికి మీరు అమెరికా పౌరులు కానవసరం లేదు. ఆ ఎన్నికల జిల్లాలో నివాసముండి, పన్నులు కడుతుండి ఉంటే చాలు. నేనెందుకు చెయ్యాలి, ఏదో నాలుగు (లక్షలు? కోట్లు??) డాలర్లు చేసుకుని వెళ్ళిపోయే వాణ్ణి అనుకుంటారా? కనీసం రెండు కారణాలు.
1. మేమూ మీలాగే వెళ్ళిపోదామనుకునే వచ్చాము. వచ్చి ఇరవయ్యేళ్ళయింది. మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోతారని గేరంటీ ఏమీ లేదు.
2. ఒకేళ మీరెళ్ళిపోయినా, మీలో చాలామంది పిల్లలు ఈ దేశ పౌరులు. మనం రాజకీయంగా ఇప్పుడు చేసే పనులు రేపు వాళ్ళ భవిష్యత్తు మీద తీవ్రమైన ముద్ర వేస్తాయని గుర్తుంచుకోండి. మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి చదువులు చెప్పించడం, బుద్ధులు చెప్పడం, ఆస్తులు సంపాయించి పెట్టడం .. ఇవన్నీ చెయ్యడంలేదా? ఇది దానికి ఇంకో ముందడుగు.
ఇవన్నీ కాద్సార్ .. లోకానికి ఒక మంచి పని చేస్తున్నాం అనే ఫీలింగ్ చాలదా? మీరు కోట్ల రూపాయలు దానమివ్వడం కంటే ఈ పని చెయ్యడం సులభమే కాదు, ఇంకా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది కూడా.
అమెరికా రాజకీయ వేదిక మీద మీ గొంతు వినిపించండి!!!

Comments
ఔను ఏంటి మా స్టేట్ సి ఈ ఓ ( చంద్రబాబు) ని ఏదో అంటున్నారు . మా జెనరేషన్ ఐ టి వోళ్లకి లైఫ్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ఇప్పుడైతే పొలిటికల్ గ్లామరు తగ్గి(గ్రామరు మర్చిపోయి) ఇలా అయిపోయాడు కానీ :)
వాసు .. రాష్ట్రానికి ఇద్దరే సెనేటర్లు. మీరు యాభై అన్నది ప్రతినిధుల గురించి. మీ ప్రాంత ప్రతినిధి ఎవరో తెలుసుకునే లంకె నేను టపాలోనే ఇచ్చాను, చూడండి. మీ జిప్ కోడు ఇస్తే మీ ప్రతినిధి ఎవరో చెప్పడమే కాక ఏకంగా వారి జాలగూటికే తీసుకెళ్తుంది. రాజకీయాలు తెలియనక్కర్లేదు. కానీ ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యాంశాల గురించి పట్టించుకోవాలని నా గోడు.
ఎంతసేపు రెండవ తరగతి వాళ్ళలా బతక్కండీ ప్లీజ్.
ఆ ప్రవాసీ (అదేదో చప్రాసీలా) అన్న పదాన్ని వీలైనంత త్వరగా విదుల్చుకుంటే మనందరికీ (అనగా అమెరికా తెలుగు జాతీయులకు) మంచిది.