సరికొత్త సర్వే .. మీ అమూల్యాభిప్రాయం తెలుపండి
తమిళ నటుడు నాజర్ కొత్తపాళీకి ఏమవుతాడు?
అ) అన్న
ఆ) తమ్ముడు
ఇ) రెండువేళ్ళు విడిచిన మేనత్త మరిది భార్య తోటికోడలి అత్తగారికి అన్నయ్య
ఈ) ఏమీకాడు
ఉ) ఈ టపా రాసిన వాళ్ళకి పన్లేదు, ఈ సర్వేలో పాల్గొంటున్న వాళ్ళకి అంతకన్నా పన్లేదు.

మీ సమాధానాన్ని టైప్ చేసి, నాజర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కొపా అని టైప్ చేసి 2045 కి ఎస్సెమ్మెస్ చెయ్యండి.

షరతులు:
అమూల్యాభిప్రాయాలు మాత్రమే పంపవలెను. ఉత్తుత్తి అభిప్రాయాలు స్వీకరించబడవు.
పై ఫొటోల్లో ఎవరెవరో తెలియని వారు ఈ సర్వేలో పాల్గొనేందుకు అనర్హులు.

Comments

ఉ) ఈ టపా రాసిన వాళ్ళకి పన్లేదు, ఈ సర్వేలో పాల్గొంటున్న వాళ్ళకి అంతకన్నా పన్లేదు.

నాజర్

కొపా

2045

సమాదానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మిగతావాళ్లు జాగ్రత్త పడతారని. వస్తా.చాలా పని ఉంది..
నేనింకా విజయకాంత్ బంధువనుకున్న ఇన్ని రోజులూను ... మాకు పని లేదంటారా ?
శరత్ said…
ఇంతకుముందటి నా కామెంట్ పొరపాటు. నా సమాధానం ఇ.
ప్ర. తమిళ నటుడు నాజర్ కొత్తపాళీకి ఏమవుతాడు?
జ. డూప్.
rākeśvara said…
మీకే గనుక మీసం వుంటే, అచ్చు ఆ ఎఱ్ఱ చొక్కాలో వున్నతను, నాజరు,లా వుండేవారు?
ఎ) ఎత్తి కుదేస్తే రెండౌతాడు..

ఓ పది రూపాయలు పంపించండి మా మొబైలో బాలెన్స్ లేదు
జయ said…
నా సమాధానం 'ఉ ' 2045. నాకు మాత్రం చాలానే పని ఉందండి. నేను కూడా వెల్తున్నా.
క్విజ్ సంగతి ఏమో గానీ నాకు మాత్రం మీ ఫోటోలొ నాజర్ ఫీచర్స్ చాలానే కనిపించాయండీ..
Vasu said…


కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఏం లేదా??
SRRao said…
కొత్త పాళీ గారూ !
ఫర్వాలేదు. నాజర్ ముఖ్య పాత్రలో తక్కువ బడ్జెట్ లో సినిమా లాగించెయ్యవచ్చు. ఏమంటారు ?
Anonymous said…
జ) ఈ.
(ఏమైనా జ్యోతిగారికి ధ్యర్యమెక్కువ . మనసులో ఉన్నది ఉన్నట్టూ చెప్పేయగలరు.)
మురళి said…
నాజర్ వే రెండు ఫోటోలు పెట్టారు.. కొపా ఫోటో కూడా పెట్టి ఉంటే పని లేకుండా తీరిగ్గా ఉన్నప్పుడు ఆలోచించే ప్రయత్నం చేసే వాడిని మరి...
SRRao .. ఐతే ప్రొడ్యూసర్ని వెతుక్కోవడమే తరువాయి అంటారు? మా డిట్రాయిట్ వాళ్ళకి సినిమాలు తీసిన అనుభవం చాలానే ఉంది గానీ అవేవీ ఫలించిన దాఖలాలు లేవు (వెన్నెల, జెండా, చంద్రహాసం ..)

లలిత .. అది మట్టుకి నిజం నిజం

అందరికీ .. అసలుకి, నాజర్ మీసంతో ఉన్న ఫొటో కోసం (ఉదా. మార్నింగ్ రాగా, మీ శ్రేయోభిలాషి) వెతికాను కానీ నాకు సరిగ్గా వెదకడం రాక అటువంటి ఫొటో దొరకలేదు. నేను మీసం లేకుండా ఉన్న సందర్భాలు ఒకట్రెండున్నాయి గానీ ఆ సమయంలో ఫొటోలు లేవు. ఐనా, సర్వే అన్నాక ఆ మాత్రం ఇమేజినేషన్ లేకపోతే యెల్లాగు?
నా సమాధానం ఐతే ఉ లో మొదటిసగం .
భావన said…
నా వోట్ మాలా గారికే అంటే వు లో సగం.. ఏ సగమో మీరే వూహించుకోవాలి అది మీకు క్విజ్.. :-)
మాకు పని ఉంది అని చెప్పటానికి అందరూ ఎంత కంగారు పడి పోతున్నారు..
మైత్రేయి .. అలా ఐతే catch22 కదా! మాకు పని ఉంది అని చెప్పేందుకు ఆగినా వారికి పని లేనట్టే లెక్క :)
రేపో మాపో రిటైర్ అవబోయే పెద్దాయన అనుకున్నాను మీ గురించి...
@బుజ్జి .. ఇప్పుడు కాదని నమ్మకం ఏంటి?
తృష్ణ said…
ఈ.......
నాకు పని ఉందో లేదో..మరి..
ఊదం said…
తమిళ నటుడు నాజర్ కొత్తపాళీకి ఏమవుతాడు?
ఆయన అదృష్టం బావుండి మీరు వెలియునికి చేస్తున్నారు గానీ, లేకపోతే డూపయ్యేవాడు
అని చాన్నాళ్ల క్రితం ఈ (http://poddu.net/?p=447) పుట లో మీ పక్క పోజు చూసినప్పుడు అనుకున్నాను
ఆప్షన్ ఇవ్వలేదు కాని చొరవ తీసుకుని నేనే చెపుతున్నా... నా జవాబు పైవన్నీ.. ;)
కొత్తపాళీ నాజర్ గారూ ! మీ కొత్త సినిమా ఎప్పుడు?
(మాఅందరికి ట్రీట్ సంగతి , సినిమా టిక్కెట్ల సంగతి కాస్త గుర్తుంచుకోండి మరి....)
Aswin Budaraju said…
ఫ్లాష్ ఫ్లాష్ బ్లాగర్లకు, కొత్తపాళీ గారంటే ఎవరో కాదు నాజరే