
మొదట విద్యార్ధిగా ఈ దేశం వచ్చాక, నా జీవితం ఈ దేశంలో వేళ్ళూనుకోవడానికి జాజ్ సంగీతం కూడా ఒక ముఖ్య కారణం అంటే అందులో అతిశయోక్తి యేమీ లేదు.

అసలు మామూలుగానే సంగీతాన్ని గురించి మాటల్లో చెప్పడం చాలా కష్టం.
ప్లేయింగ్ బై హార్ట్ అనే సినిమాలో ఏంజలీనా జోలీ వేసిన పాత్ర అంటుంది - "Talking about love is like dancing about architecture."
సంగీతం గురించి మాట్లాడబూనడం కూడా అటువంటిదే, నా దృష్టిలో . మాటలకందని భావాన్ని వ్యక్తీకరించాల్సిన ఒక మౌలిక అవసరంలోంచి సంగీతం పుడుతుందని నా అనుమానం, ప్రేమలాగే. మన సాంప్రదాయ సంగీతాలు కొద్దిగా మెరుగు ఈ విషయంలో, ఏదో రాగమనీ శ్రుతి అని మాట్లాడొచ్చు. జాజ్ విషయంలో అదీ కుదరదు. ఇహ చెప్పేదేముంది? అం

ఫిలడెల్ఫియా నగరంలో విద్యార్ధిగా ఉండగా నేను పనిచేస్తున్న పరిశోధనశాలకి అనుబంధంగా ఒక మెషీన్ షాపుండేది. అందులో ముగ్గురు మెకానిక్కులు పని చేసేవాళ్ళు. జేకబ్ అనే పెద్దాయన ఎక్కువగా నా పని చేస్తుండేవారు. మిగతా ఇద్దరూ సాయంత్రం నాలిగింటికల్లా పని ముగించుకుని వెళ్ళిపోయేవారు. జేకబ్ ఆరుదాకా పని చేసేవారు. సాయంత్రం పూట, మిగతా వాళ్ళు వెళ్ళిపోయాక మెషీన్ షాపుకెళ్ళి, నా పని ఎంతవరకూ అయిందో చూసుకోవడమే కాక, జేక్ తో పిచ్చా పాటీ మాట్లాదుతుండడం అలవాటైంది నాకు. ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో డ్రైవరుగా మెకానిక్కుగా పని చేశారు. జేక్ తో సంభాషణల్లో అమెరికను సమాజాన్ని గురించీ, జీవన విధానాన్ని గురించీ చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన తన రేడియో మీద ఎప్పుడూ WRTI రేడియో స్టేషన్ని మోగించేవారు. అలా తొలి పరిచయమైంది జాజ్ సంగీతంతో.
నాకంటూ ఒక బుల్లి పరిశోధనగది కేటాయింపు అయినాక నేనూ ఒక బుల్లి రేడియో కొనుక్కుని రోజంతా అదే స్టేషను మోగిస్తుండేవాణ్ణి. అలా కొందరు గాయకుల, వాద్యగాళ్ల పేర్లు పరిచయమయ్యాయి. డ్యూక్ ఎల్లింగ్టన్, కౌంట్ బేసీ, బెన్నీ గుడ్మేన్, లూయీ ఆరంస్ట్రాంగ్ .. ఇలా. ఒకసారి మిత్రులతో కలిసి పుస్తకాల షాపు కెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ నలుగురివీ నాలుగు సీడీలు కొనేశాను నలభై డాలర్లు పెట్టి (ఎప్పుడూ డబ్బు కటకటే ఆ రోజుల్లో). తమాషా ఏంటంటే అప్పటికి నా దగ్గర సీడీప్లేయరన్నా లేదు!
మెల్లగా సంపాదన పెరిగి ఒక మంచి స్టీరియో కొనుక్కుని నాకిష్టమైన వాద్యగాళ్ళ సీడీలు కొనుక్కోవడం మొదలెట్టాను. ఈ క్రమంలో మరికొన్ని పేర్లు పరిచయమయ్యాయి .. మైల్స్ డేవిస్, థెలోనియస్ మంక్, డిజ్జీ గిలెస్పీ, జాన్ కోల్ట్రేన్ .. రేడియో విటూండడం, ఎవరి వాద్యమన్నా నచ్చితే ఆ పేరు గుర్తు పెట్తుకోవడం, అవకాశం దొరికితే వాళ్ళదో సీడీ కొనుక్కోవడం. ఇలా నా సేకరణ పరిధిలో పరిమాణంలో పెరుగుతోంది.
ఉద్యోగస్తుడిగా డిట్రాయిట్ ప

మొదటివారు WDET రేడియో స్టేషన్లో రాత్రిపూట నాలుగ్గంటల పాటు జాజ్ సంగీతం వినిపించే ఎడ్ లవ్. ఈయన్ని రేడియో జాకీ, కార్యక్రమ సమర్పకుడు ఇలాంటి మాటలు అనడం శ్రీకృష్ణుణ్ణి పట్టుకుని వేణువూదేవాడు, రథం తోలేవాడు అన్నట్టుగా ఉంటుంది. సుమారు 1960 నించీ జాజ్ పరిణామాన్ని అతి దగ్గరగానూ, అతి లోతుగానూ


రెండో మనిషి, కలుసుకున్న కొద్ది నిమిషాల్లోనే నాకు అత్యంత ఆప్తమిత్రుడైపోయిన తోటి జాజ్ శ్రోత, ఓమొవాలే. ఓమొవాలే ట్రినిడాడ్ వాస్తవ్యుడు. మిషిగన్ వివిలో ఆంత్రొపాలజీలో పరిశోధన చేస్తుండేవాడు. ఇప్పుడు ఇండియానా వివిలో ఆచార్యుడు. గొప్ప జాజ్ వినాలంటే రేడియో మీదనే ఆధారపడనవసరం లేదు. అలాగని, వందలకి వందలు సీడీలు కొనక్కర్లేదు అని నాకు హితబోధ చేసి, వివిలో ఉన్న జాజ్ లైబ్రరీ, ఇంకా స్థానిక పబ్లిక్ లైబ్రరీల్లో ఉన్న జాజ్ సంగీతపు నిధుల ద్వారాలు తెరిచాడు. అంతేకాక కనీసం నెలకోసారైనా ఇద్దరం ఒక సాయంత్రమంతా కలిసి కూర్చుని, మాకిష్టమైన సంగీతం వింటూ చర్చించుకుంటూ గడిపేవాళ్ళం. జాజ్ మీద బ్రెజిల్ బోస్సనోవా, ఆఫ్రో క్యూబన్ బీట్స్ వంటి అంతర్జాతీయ సంగీత రీతుల ప్రభావం ఎలా పరిణమించిందో సోదాహరణంగా నాకు పరిచయం చేశాడు. ఈతని సాహచర్యంలో జాజ్ ని కేవలం మనసుతోనే కాకుండా కొంచెం బుర్ర పెట్టి కూడా వినడం నేర్చుకున్నా.
ఇదివరలో గొప్ప గొప్ప సంగీత తారలు కూడా న్యూయార్కు, ఫిలడెల్ఫియా, డిట్రాయిట్, షికాగో వంటి నగరాల్లో నైట్‌క్లబ్బుల్లోతమతమ బృందాలతో ప్రదర్శనలిస్తూండేవారు. కానీ ఖర్చులు పెరిగిపోయి, ఆ రోజులు పోయా

చెవుల్నీ, బుర్రనీ, మనసునీ ఆయుత్త పరుస్తున్నా, జాజ్ ప్రవాహంలో మునిగి తేలేందుకు.
ఈ వరుసలో ఇదివరకటి టపా .. రేడియో.
Comments