విచిత్రమైన కాలగమనం

కాల గమనం అతి విచిత్రం కదా!
గడియారంలో క్షణాల ముల్లు కదలికే కాదు, సంజె పొద్దులో పడమటి సముద్రంలోకి ఇంకుతున్న సూర్యుడి చలనం, వేసవి రాత్రి గాలికూడా ఊపిరి బిగబట్టినప్పుడు నిర్మలాకాశంలో నక్షత్ర గమనం, రోజు రోజుకీ పెరుగుతూ తరుగుతూ పదారు కళలు ప్రదర్శించే చంద్రుడి విన్యాసం .. చూసే దృష్టి ఉండాలి గాని మన కళ్ళముందే ఈ విశ్వం భరతనాట్యం ప్రదర్శిస్తూ ఉంటుంది విచిత్ర తాళ గతులతో.
ఈ మాటలు ఎక్కడో చదివినట్టు అనిపిస్తోందా?
ఎక్కడో ఏముంది లేండి, నా బ్లాగులోనే చదివుంటారు. ఎప్పుడో పోయినేడు వసంతాగమనాన్ని చూసి పులకించిన సందర్భంలో రాసుకున్న మాటలివి.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం కాలం ఒకే దిశలో ముందుకు మాత్రఏ సాగే ఋజువర్తని (అంటే తిన్నని మార్గంలో పయనించేది, linear). అది నిజమే. గడచిన క్షణం, నిమిషం, గంట మళ్ళీ రాదు. కావాలంటే పరీక్షకి తయారవుతున్న విద్యార్ధిని అడగండి. తెల్లారితే మరణశిక్ష పొందబోయే ఖైదీని అడగండి.
తమాషా ఏవిటోగానీ మన ఋషులు కాలాన్ని వర్తులంగా (cyclical) ఊహించారు. ఒకలా చూస్తే ఇదీ నిజమే. గడియారం గుండ్రంగా ఉంటుంది. పన్నెండు గంటల తరవాత మళ్ళీ పన్నెండు గంటలు. పగలు తరవాత రాత్రి తరవాత పగలు. ఆది సోమాది ఏడు వారాలు మళ్ళీ పునరావృత్తం (తాడేపల్లి గారూ నెనర్లు!) చంద్రుడి కళల్తో శుక్ల కృష్ణ పక్షాల పిల్లిమొగ్గలు. మన సంవత్సరాలు కూడా అరవయ్యేళ్ళకోసారి తిరిగొచ్చేస్తాయి. సంవత్సరాలే కాదు, యుగాలూ, మహాయుగాలూ కూడా.
ఈ కాలం బాట వెంట ఎన్ని మైలు రాళ్ళు? ఏటేటా మరో ఏడు గడిచిందని గుర్తు చేస్తుండేందుకు .. పుట్టిన రోజులు, పెళ్ళి రోజులు, కాలేజి రీయూనియన్లు . ఇవన్నీ చాలనట్టు, వేరే ఏ సందర్భమూ లేకుండా కేవలం ఏడు దొర్లింది అని అరిచి చెప్పడానికే అన్నట్టుగా ఈ న్యూ యియర్.
కానీ, సంతోషించడానికీ, సెలబ్రేట్ చేసుకోడానికీ పెద్దగా ఏం కనబట్టల్లే. ఏ కోణంలో చూసినా మానవ జాతి ఇంకో మెట్టు కిందకి జారిన సూచనలే కనిపిస్తున్నై. ఈ మాటలు రాస్తుండగా, తిరిగి తలెత్తిన పాలస్తీనియన్ హమాస్ ఇస్రాయెలీ మారణహోమాన్ని చూస్తున్నా ఒక కంటితో.
ఐనా మానవుడు ఆశాజీవి. దురాశ దుఃఖానికి దారితీస్తుందని మన సామెత. నా ఉద్దేశంలో నిరాశ మనల్ని నిర్వీర్యుల్నీ నిర్జీవుల్నే చేస్తుంది.
ఈ విపత్కర సమయంలో నాకందిన సద్గురు బోధ మీతోనూ పంచుకుంటున్నాను.
"సమయం విపత్కరమైనప్పుడు అకౄరంగా ఉండటం (being gentle) అన్నిటికంటే ముఖ్యం."
మిమ్మల్నందరినీ అపారమైన దయ ఆవరించు గాక!

Comments

Purnima said…
Wish you a very happy and prosperous new year ahead!
కొంత అర్థమయ్యింది మరికొంత సిక్సరెళ్ళింది. హేమిటో కొత్తసంవత్సరంలో కొత్తగా చాలా నేర్చుకోవాలని సూచించినట్లుంది మీ టపా...నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఏంటోనండి, వినాశకాలే విపరీత బుద్దీః అన్నట్లు చపడానికే పుట్టారా వీళ్ళు అనిపిస్తుంది. ఏ హక్కుతో ఇలా చంపుతున్నారో క్షణమైనా ఆలొచిస్తే ఇలా జరగదు కదా! కాల చక్రం తిరుగుతుంది నిజమే కాని ఇలాంటి సంఘటనలు మాత్రం మళ్ళీ వద్దు.
సరేలెండి మనం వద్దంటే జరిగేవి జరగక మానవు కదా!
నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవి చెప్పడానికి రేపటి ఉదయం నాదో కాదో తెలియదు కదా? అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను.
నాకు కూడా సంతోషించడానికి అభినందించడానికి ప్రత్యేకంగా అనిపించడం లేదు. కొత్త క్యాలండర్ మార్చడం తప్ప.మరో కొత్త ఉదయం...
అన్ని కష్టాలు తొలగిపోయి, అందరమూ సంతోషంగా ఉండగలిగే మంచి రోజులు త్వరలోనే వస్తాయీ అని ఆశిస్తూ "నూతన సంవత్సర శుభాకాంక్షలు"
Bolloju Baba said…
గురువుగారూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ
బొల్లోజు బాబా
మీకు నా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
మేధ said…
నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ సంవత్సరమంతా శుభం చేకూరాలని కోరుకుంటూ...
మోహన said…
:) రాబోయే ఏడు మీ కోరిక నెరవేరాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Siri said…
కొత్తపాళి గారు, మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి.
ఈ ఏటి నుండైనా శాంతి భద్రతలు విలసిల్లాలని ఆకాంక్షిస్తూ... నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్తపాళీ గారు.
కాలం వర్తులీయం అనేది ఊహ కాదు వాస్తవం. ఆయితే మనకంటే ఎన్నో కోట్లరెట్ల పరిమాణం గల వర్తులం వెంట (ఉదాహరణకి భూమి) నడుస్తూంటే మనకి అది రేఖీయంలా కనిపిస్తుంది. అలానే మన ఆయుహ్‌ప్రమాణం కంటే ఎన్నో వేలరెట్లు పెద్దదైన కాలచక్రంలో మన మనస్సు జీవించేటప్పుడు కూడా మనకి అది రేఖీయంలా కనిపిస్తుంది.

వర్తులీయం అని చెప్పడానికి కారణం analogy. అంటే అలా ఉపమానపూర్వకంగా చెబితే బాగా తొందఱగా అర్థమౌతుందని ! అంతే ! అంతేతప్ప పోయిన కాలం తిరిగొస్తుందని కాదు పూర్వీకుల ఆంతర్యం. తిరిగొచ్చేది కాలం కాదు, కాల లక్షణాలు. దాని గుఱించి ఈ సంవత్సరం నేనొక టపాల పరంపరే రాయాలనుకుంటున్నాను.

వృద్ధుడుగా చనిపోయినవాడు ఏ తల్లి కడుపులోనో చిన్నబిడ్డగా తేల్తాడు. ఒకప్పుడు మహోజ్జ్వలంగా వెలిగిన నాగరికత గుర్తుపట్టలేని విధంగా నశించి జనం అంతా మళ్ళీ మొదటినుంచి నేర్చుకుంటూ బయల్దేఱతారు. అయితే గతించిన మనుషులూ, సంఘటనలూ, కథలూ మాత్రం మళ్ళీ రావు. ఇదే కాలచక్రానికి అర్థం.
Ramani Rao said…
Wish you a very happy and prosperous new year