సాధారణ భాషలో చిల్లర అనే మాటని నీచోపమానంగా వాడుతుంటాం .. వాడు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, కక్కుర్తి పడి చిల్లర పనులకి ఒప్పుకోకు, నేనంత చిల్లరగా కనిపిస్తున్నానా .. ఇలా. కానీ మన భారతీయ దైనందిన జీవితంలో చిల్లరకి చాలా ప్రాముఖ్యతే ఉంది. ఇలాంటి భావనల్నే చిల్లర శ్రీమహాలక్ష్మి ఇత్యాది నానుడులలో భద్ర పరుచుకున్నాం.
నేను రెండో క్లాసు చదువుతున్నప్పుడు .. అప్పటికింకా ఒకటి, రెండు, మూడు నయాపైసల నాణేలు చెలామణిలో ఉండటం గుర్తుంది. అప్పుడు మా యింటి దగ్గర్నించి బడి దగ్గరకి సిటీబస్సు ఛార్జీ అక్షరాలా ఎనిమిది పైసలు. మా అమ్మ లెక్కబెట్టి ఐదు+మూడు గానీ, ఐదు+రెండు+ఒకటి గానీ చిల్లర డబ్బులు లాగూ జేబులు రెండిట్లోనూ విడివిడిగా ఉంచేది. ఒకసారి చిల్లర లేక ఒకటి పది పైసల నాణెం ఇచ్చింది. బస్సు దిగి ఇంటికొచ్చేలోపల దార్లో ఒక బడ్డి కొట్లో రెండు పైసలకీ రెండు పిప్పరమెంట్లు కొనుక్కుని తినేశా. ఇంటికి రాగానే రెండు పైసల చిల్లరేదిరా అంటే, బస్సు కండక్టరు ఇవ్వలేదు అనేశా. పాపం చాలా నొచ్చుకుంది మా అమ్మ. అదేవిట్రా అలా వొదిలేసుకుంటారూ, చిల్లర జాగ్రత్తగా తెచ్చుకోవద్దూ, మనమేం జమీందార్లం కాదు నాయనా, అని ఇలా చాలా చెప్పుకొచ్చింది. అయ్యో అమ్మ ఇంత బాధ పడిపోతోందే, పోనీ నిజం చెప్పేద్దామా అని కాసేపు అనుకున్నా కూడా. ఇంతట్లో నా బడి బట్టలు విప్పడానికి నన్ను దగ్గిరికి తీసుకుంటే, ఆవిడకి నా నోట్లోంచి పిప్పరమింట్ల వాసన రానే వచ్చింది. అప్పటికే నా షర్టు కాలరు ఆవిడ చేతుల్లో ఉంది. వీపు విమానం మోత మోగిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. వెధవ పిప్పరమెంట్లు ఎందుకంత వాసన వచ్చేట్టు చేస్తారో.
నా పీత కష్టాలు ఇలా ఉండగా మధ్యలో మా తాతయ్యొకడు. ఈయన ఒక చిల్లర కొట్టు నడుపుతుండేవాడు. ఎప్పుడన్నా ఆయన కొట్టు సర్దుతున్నప్పుడు నేను గల్లాపెట్టె దగ్గర కూర్చునేవాణ్ణి. ఆ చుట్టుపక్కల పనీ పాటా చేసుకునే స్త్రీజనం అర్ధనా మరమరాలు పెట్టమనీ, అణాకి బటానీలు పెట్టమనీ వచ్చే వాళ్ళు. నేను చాలా తెలివైన వాణ్ణనీ, నాకు చాలా విషయాలు తెలుసుననీ నాకు అప్పటికే గాఠి నమ్మకంగా ఉండేది. ఈ అర్ధనా అణాల గోలేవిటో అర్ధమయ్యేది కాదు. తరవాత, మా తాతయ్య దగ్గరే నేర్చుకున్నా లెండి అణా అంటే పావలాలో నాలుగో వంతు, ఇలా. ఈ గోల ఇలా ఉండగా, ఆ కొట్టు నడిపేందుకు మా తాతయ్యకి ఎక్కడెక్కడి చిల్లరా సరిపోయేది కాదు. చెప్పానుగా, అసలే చిల్లర కొట్టు. ఆ వొచ్చే బేరాలన్నీ ఇలాగే ఉండేవి. అందుకనే ప్రతిరోజూ పొద్దున్నే మాచారం ఆంజనేయస్వామి గుడికెళ్ళి అక్కడ గుడి గుమాస్తా దగ్గర ఒక ఐదు రూపాయల చిల్లర రుమాల్లో మూట గట్టుకుని రావడం నా డెయిలీ డ్యూటిగా ఉండేది. గుడికి ఇదికూడా ఆదాయ మార్గమే - గుమాస్తా రూపాయకి తొంభయ్యైదు పైసలే ఇచ్చేవాడు. ఒకసారి తీరా నేవెళ్ళేప్పటికి గుమాస్తా లేడు. ఎట్లాగురా నాయనా ఇవ్వాళ్టికి చిల్లర అని దిగాలు మొహవేసుకుని బయటికి వస్తుంటే, అక్కడ గుడి గుమ్మంలో ఉండే ఒక కుంటి బిచ్చగాడు చిల్లర కావాలా బాబూ అన్నాడు. హమ్మయ్య అనుకుని ఐదు రూపాయలకి ఇమ్మన్నా. తీరా లెక్కపెట్టుకుంటే రూపాయకి తొంభై పైసలే ఉన్నై. ఇదేంటి, గుడి గుమాస్తా ఐతే తొంభయ్యైదు పైసలిస్తాడుగా అన్నా. మరి నా పొట్ట కూడా నిండాలిగా బాబూ అన్నాడు. సమంజసమే అనిపించింది. మా తాతయ్యకి అనిపించలా. చిల్లర తెచ్చి పెట్టినందుకు ఆయన నాకు రోజూ ఇచ్చే బటానీల జీతం కట్టు ఆ రోజు!
ఉత్తరోత్తరా, మా ఇల్లు అనే ఒక మైక్రో ఎకానమీకి నేను చిల్లారాధిపతిని ఐపోయా. అంటే చిల్లర వ్యవహారాలన్నీ నా చేతిమీదుగానే నడుస్తూ ఉండేవి .. ఏవన్నా చిన్న చిన్న సామానులు కొనడం, పాత న్యూస్ పేపర్లూ, పత్రికలూ అమ్మడం, ఇత్యాది. ఈ బడ్జెటులోనే నా బులి బుల్లి వ్యక్తిగత అవసరాలు కూడా .. ప్రైమరీ స్కూల్లో పిప్పరమెంట్లూ, క్రీము బిస్కెట్లూ నించీ హైస్ స్కూల్లో సైకిలుకి అద్దె, డిటెక్టివు పుస్తకాలకి అద్దె ... అంతవరకూ. ఆ విధంగా మా ఇంటి చిల్లర నా పాలిట శ్రీమహాలక్ష్మే అని చెప్పక తప్పదు.
కాలేజికి హాస్టలుకి వెళ్ళాక మన బడ్జటు మనమే సంభాళించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ 90% లావాదేవీలు ఖాతాల మీదే జరిగేవి కాబట్టి నగదు అవసరం, చిల్లర అవసరం కనబడేది కాదు. అటుపైన ఉద్యోగస్తుడిగా, సంపాదన పరుడిగా ఉన్న రోజుల్లో .. ఆహా నేనుగాగ ఇంత సంపాయించేస్తున్నానని .. చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టేవాణ్ణి. ఆ రోజుల్లో చిల్లర డబ్బు ఏదీ నా చేత ఆడిన దృశ్యం నాకు గుర్తు రావట్లేదు. చిల్లర ఉంచేసుకో అనేది నా ఊతపదంగా ఉండేది.
అమెరికా రావడానికి ఒక్కొక్క డాలరూ పదేసి రూపాయలు మా అన్నయ్య కష్టార్జితం ధార పోసి కొనవలసి రావడంనన్ను మేల్కొల్పింది డబ్బు విషయంలో. అదీకాక, అమెరికా వచ్చిన కొత్తల్లో పూర్ ఇండియన్ గ్రాడ్యువేట్ స్టూడెంట్ అవతారంలో కనీసం ఒక ఏడాది పాటు దుర్భర దారిద్ర్యం బాగానే అనుభవించాను. ఫిలడెల్ఫియా నగరంలో నేనున్న అపార్టుమెంటు నించి విశ్వవిద్యాలయాని (వివి)కి సుమారు మైలున్నర దూరం నడిచి వెళ్ళి నడిచి వచ్చే వాణ్ణి. ఆ దారిలో ఒకసెంటు నాణేలు ఎన్నో ఫుట్ పాత్ మీద కనబడుతుండేవి. అప్పూడప్పుడూ నికెళ్ళు (ఐదు సెంట్లు), డైములు (పది సెంట్లు) కూడా. మొదట్లో, ఛీ, మనవేంటీ, వీధిలో నాణేలు ఏరుకోవడం ఏంటీ అనిపించినా, మళ్ళి వెను వెంటనే, ఒక్కొక్క సెంటూ పది పైసలు. అలాంటివి పది కలిస్తే ఒక రూపాయి అనే భావన బలంగా నాటుకుని, ఆ నాణేలు తీసి జేబులో వేసుకోవడం మొదలు పెట్టాను. ఇతర కొనుగోళ్ళ లో కూడా వచ్చిన చిల్లరని భద్రపరచడం మొదలు పెట్టాను. ఇంట్లో ఒక పెద్ద కాఫీ డబ్బా నియోగించాను ఈ నాణేలు వెయ్యడానికి.
పన్నెండేళ్ళ తరవాత, మధ్యలో కొంత చిల్లరని వాడుతూ ఉండగా, ఇలా పోగైన చిల్లరని బేంకులో మారిస్తే నాలుగొందల డాలర్ల పై చిలుకు తేలింది. అందులో ఒక్క సెంటు నాణేలే రెండొందల డాలర్ల దాకా ఉన్నాయి. ఇక్కడ బేంకుల్లో ఆయా నాణేలని నిర్ణీత సంఖ్యల్లో పోగు చేసేందుకు కాగితపు గొట్టాలు ఇస్తారు (ఈ గొట్టాల్ని షాపుల్లో కొనుక్కోవచ్చు కూడాను). అలా నేనే కూర్చుని ఒక సాయంత్రప్పూట ఈ నాణేల్ని ఆ కాగితపు గొట్టాల్లో నింపాను. బేంకుకి తీసుకెళ్ళినప్పుడు, అక్కడి గుమాస్తా ఆశ్చర్య పడింది గానీ, విసుక్కోకుండా, నవ్వుతూ, ఓపిగ్గా ఆ గొట్టాలన్నీ లెక్క పెట్టి నాకు ధరావతు రశీదు ఇచ్చింది.
కొన్నేళ్ళుగా సూపర్ మార్కెట్టుల్లోనూ అలాంటి చోట్ల చిల్లర లెక్కపెట్టే యంత్రాలు వచ్చాయి. కలగాపులగంగా ఉన్న చిల్లర రాశిని ఆ యంత్రపు బేసినులో గుమ్మరిస్తే అదే వాటిని వేరు చేసుకుని, లెక్క పెట్టి, ఇంత రుసుము ముట్టిందని రశీదు ఇస్తుంది. కానీ ఇవి ప్రవేటు కంపెనీల నిర్వహణ కావడం వల్ల, కొంత కమిషను తీసుకుంటాయి అనుకుంటాను. (నాకు మా మాచారం గుడి బయటి కుంటి బిచ్చగాడు గుర్తొస్తున్నాడు .. మరి ఆ కంపెనీ వాళ్ల పొట్ట గడవడం ఎల్లాగా?) ఐనా, నాణేల రాశిని గుట్ట పోసుకుని, ఒక గంట సేపు వాటిని స్పృశిస్తూ, విభజిస్తూ, ఎంచుతూ, గొట్టాల్లో నింపుతూ కాలక్షేపం చెయ్యడంలోని ఆనందం ఆ యంత్రాన్ని ఉపయోగిస్తే ఎట్లా వస్తుంది నాకు?
మొన్నా మధ్యన నేను తరచూ వినే "మార్కెట్ ప్లేస్" అనే రేడియో కార్య్క్రమంలో "చిల్లర శ్రీమహాలక్ష్మి" అని నమ్మే చిల్లర పిచ్చోళ్ళు మరి కొందరున్నారని విని చాలా సంతోషం వేసింది. తీగ తగిల్తే డొంకంతా కదిలింది అన్నట్టు, ఆ వార్త విని ఈ జ్ఞాపకాల తేనెతుట్టె రేగింది.

Comments
చిల్లర నాణేల పేరు చెప్పి, చిన్నతనపు జ్ఞాపకాలని తట్టి లేపారు.
చిల్లర పేరు చెప్పి, చిన్నతనపు జ్ఞాపకాలని తట్టి లేపారు.
అప్పట్లో అవే వజ్రాలు, రత్నాలు. మరి అవిస్తేనేగా బఠాణీలు, చాక్లెట్లు దొరికేవి.
మీ ఈ టపా నాకు చాలా చాలా నచ్చేసింది.నా జ్ఞాపకాల తుట్టని చిల్లరతో కొట్టి కదిపేరూ :)
మా ఊరి గ్రంధాలయంనుంచి తెచ్చి చదువుదామని ఒకటి కంటే ఎక్కువసార్లే ప్రయత్నించా. కానీ పూర్తిచెయ్యలేకపోయాను. పుస్తకం పేరు అదే అనుకుంటాను. కానీ పుస్తకం పేరులో మాత్రం "చిల్లర" ఉంది అని గుర్తు.
మంచి టపా.
బొల్లోజు బాబా
మంచి వైవిధ్యమైన టపా!
'చిల్లర కొట్టు ' అనగానే ఎన్ని చిన్న చిన్న జ్ఞాపకాలో!! చిన్నప్పుడు సత్తెమ్మామ్మ చిల్లరకొట్టులో జీడీలు, నిమ్మతొనలు, పప్పుచెక్కలు, తాటితాండ్ర లాంటివన్నీ కొనుక్కోవడానికి చిల్లర ఎంత జాగ్రత్తగా దాచుకునేవాళ్ళమో.. అప్పుడప్పుడూ అదే కొట్లోంచి ఏ కరేపాకో, అల్లమో తెమ్మని, తన దగ్గర చిల్లర లేదని మా అమ్మ మనసనేది లేకుండా నా చిల్లరని జాతీయం చేశేశేది! :-)
ఇక్కడ నేనూ చిల్లర అతి జాగ్రత్తగా దాస్తాను.. మొదటిసారి మార్చినప్పుడు వచ్చిన డబ్బుతో పాత ఇంట్లో ఫ్రిజ్ కొన్నాము!
మాచారం అంటే ఎక్కడండి?
రమణి .. ఐతే అటువంటి కాస్తో కూస్తో విలువున్న నాణేలన్నీ మార్కెట్టులోంచి మాయమైపోవడానికి కారణం మీరేనన్నమాట :)
శ్రీవిద్య, నిజం!
చంద్రశేఖర్ .. బహుశా అది చిల్లదేవుళ్ళు అయుండొచ్చు. దాశరధి రంగాచార్య రాసిన నవల.
బాబా .. ధన్యవాదాలు
కత్తి .. ఏం అప్ర్లేదు, టైం మెషీన్ కనిపెట్టే ప్రయత్నాల్లోనే ఉన్నా .. ముందుకీ వెనక్కీ బర్రుబర్రున వెళ్ళొచ్చెయ్యొచ్చు :)
జ్యోతి .. కాకుల్ని దగ్గరికి రాణియ్యకండి.
వికటకవి .. చిల్లరపోగు చెయ్యడం పాపం కాదు సరిగదా, మహా పుణ్యం! :)
ఒక చిన్న సలహా .. మూట మరీ పెద్దది కానివ్వకండి. బాంకుకి తీసుకెళ్ళేప్పుడు నడుం నొప్పి చెయ్యగలదు!
నిషి .. ఈ అమ్మలు ఇంతే గదా .. బొత్తిగా హృదయం లేని వాళ్ళు! LOL @ fridge
రాధిక .. తప్పకుండా రాయండి. మాచారం = మాచవరం, విజయవాడ మహానగరంలో ఏలూర్రోడ్డు వెంబడి ఉన్న ఒక పేట, ప్రసిద్ధమైన దాసాంజనేయస్వామి గుడి ఉంది ఇక్కడ. చారిత్రాత్మకమైన SRR కాలేజి కూడా.
కొత్తపాళీ గారు నిజంగా చాలా బావుంది. టపా
కంపెనీల వాళ్ళది వీరముష్టి అనుకుంటా. అదొక్కటే తేడా.
"Truth is stranger than fiction" అన్నారెవరో ! కానీ "Truth is more interesting than fiction" అని నాకు అనిపిస్తోంది. ఇటువంటివే మఱికొన్ని జ్ఞాపకాలు వ్రాయగలరు.
ఆ తర్వాత నాణేల సేకరణలో భాగంగా దాచుకున్నవే ఎక్కూవ :-)
Context తీసేసి చదివితే మిమ్మల్నో చిల్లరోడనుకునే ప్రమాదముంది :)
బోఫా (Bank of America) వాళ్లు పోయినేడాది నుండీ మన్లాంటోళ్ల కోసం Keep the Change అనే కార్యక్రమం మొదలు పెట్టారు. మీద బ్యాంకే అయితే ఓసారి అదేంటో కనుక్కోండి.
ఎక్కడో టచ్ చేసారు..
ఇక ఈ రాత్రి...నాకు 'చిల్లర ' రాత్రి.
తట్టి లేపారు... మస్తిష్కంలో ఎక్కడో నిద్దరోతున్న జ్ఞాపకాలని....
--Vamsi
నాకు చిన్నప్పుడు నాణేల సేకరణ హాబీ. (numismatism). మా అమ్మ కూడా పాపం నా కోసం కొత్త నాణేలు వస్తే తీసి పెట్టేది. ఆ సేకరణ ఆ తర్వాత ఇంకో అబ్బాయి కి hand over చేసేను.
పూనా లో ఉన్నప్పుడు మొదటి మూడు వారాలకు ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేసి, చివరి వారం, రూములో పడున్న పాత news papers అమ్మేసి వడా పావ్ తో గడిపిన రోజులూ గుర్తొచ్చాయి.
"వెధవ పిప్పరమింట్లు..." ఈ ముక్క ఓ చిన్న పిల్లాడు చెబుతున్నట్టు ఊహించుకున్నా కాసేపు...:-)
"అణాకొక బెడకొక" స్టాంపు అని పత్తేదారి నవల ఒకటి ఆరుద్ర వ్రాసారు.
మీరు దారిలో కనబడిన pennies జేబులో వేసుకున్నారంటే, నా గత జ్ఞాపకం గుర్తొచ్చింది.
హైదరాబాదు నుంచి మా వూరి కి వెళ్ళడానికి ఒకసారి exact గా ఏభై పైసలు తక్కువ పడ్డాయి(అసలు కారణం కొంచెం వరకూ నా వళ్ళు బలుపు లెండి, నా లెక్కలు తప్పు..పాపం మా పేరెంట్స్ ది కాదు).
ఊరి కాని ఊళ్ళో, ఎవ్వరూ తెలీక ఏం చేయాలో పాలుపోక, ఒక రెండు గంటలు బస్ స్టాండ్ లోనే కూర్చొని, చివరకి సిగ్గొదిలేసి, పచ్చిగా ఒకరి దగ్గరి కెళ్ళి అడిగా. టికట్టు ఖర్చులకి ఒక ఏభై పైసలు కావాలని..
పాపమాయన నన్ను ఎగాదిగా చూసి, ఏ ప్రశ్నలు వేయకుండా ఇచ్చేశాడు.
అన్నట్టీ ఫుట్‌పాతుల మీద చిల్లర దొరకడమేంటీ? నాకర్థం కాలేదు. అమెరికా వాళ్ళు డబ్బుల దగ్గర చాలా జాగ్ర్తత్తగా ఉంటారని విన్నానే! అలా పారేసుకుంటారా?
ఏ మిత్రుడితో కలసి హోటల్ కి వెళ్లినా, బిల్లు ( మీ భాష లో చెక్కనుకుంటా) 62 లేక 73 ఐతే ..
మొత్తం నీవే ఇస్తే బావుండదు , ఆ మూడు రూపాలినేసిస్తా పై చిల్లర నీవిచ్చేయరా అంటూ ఉంటాను.
భలే గుర్తు చేసారు. అది "చిల్లరదేవుళ్ళు"నే. చిన్నపుస్తకమే అయినా చదవలేకపోయా.
కొత్తపాళీ గారు, మీ చిల్లర శ్రీ మహాలక్ష్మికి ఏమైనా దక్షిణ సమర్పించుకోవాలా ఏమిటి కొంపదీసి :)