ఈమాట జూలై సంచిక విడుదలైంది మీరు గమనించారో లేదో.
జూన్ నెలలో ఒక కొత్త ప్రయోగం మొదలు పెట్టాము ఈ మాటలో. మామూలుగా రెణ్ణెల్లకోసారి పత్రిక కొత్త సంచిక విడుదలవుతూ ఉంటుంది. ఇకనించీ సందర్భాన్ని బట్టి అప్పూడప్పుడూ ప్రత్యేక సంచికలు వెలువరించాలని సంపాదక బృందం నిర్ణయించింది. అలా మొదటి ప్రత్యేక సంచిక జూన్ నెలలో విడుదలైంది. సందర్భం, ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ పుట్టినరోజు. మీలో చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు, పందొమ్మిదో శతాబ్దం చివర, ఇరవయ్యో శతాబ్దం మొదట్లో తెలుగు భాష భవిష్యత్తు గురించి చాలా గొడవ జరిగింది. ఆ గొడవకి సంబంధించిన చాలా చారిత్రక వివరాలూ, గొడవలో ఇరువైపులా ప్రత్యక్షంగా పోరాడిన భాషా వీరుల వాదనలూ కొన్ని ఈ ప్రత్యేక సంచికలో అందించారు. తెలుగు భాషని ప్రేమించే వారికి ఈ చరిత్ర కొంచెమైనా తెలుసుకోవలసిన అవసరం ఉంది.
అన్నట్టు, ఇంకో మాట. నా బ్లాగులో కుడిపక్కన కనబడే పట్టీలో ఈమాట నించి యాదృఛ్ఛిక ఎంపికలు ఒక ఐదు శీర్షికలు కనిపిస్తూ ఉంటై. నా కథలు చాలానే ఈమాటలో ప్రచురితమైనా ఇంతవరకూ ఒక్కసారి కూడా ఈ పట్టికలో నాకు నా కథ కనబళ్ళా. అలాంటిది ఇవ్వాళ్ళ కనబడింది. అది యాదృఛ్ఛికం కాబట్టి, ఎక్కువ సేపు అక్కడే ఉండక పోవచ్చు. ఆ కథేవిటో చూడండి మరి. మనలో మాట, ఈ కథ నాకు కథా రచయితగా కొంచెం పేరు తెచ్చి పెట్టింది కూడానూ. ఆ కథ పేజీలో నా పేరు మీద నొక్కితే ఈమాటలో ప్రచురితమైన నా ఇతర రచనలు కూడా కనిపిస్తాయి. కథ నచ్చినా, నచ్చక పోయినా, అక్కడ ఈమాటలో కానీ, ఇక్కడ నా బ్లాగులో గానీ ఒక మాట మీరు చెబితే చాలా సంతోషిస్తాను.

Comments
మీ కథ నాకు చాలా బాగా నచ్చింది.
అదేమైనా ప్రత్యేక అతిథులకి మాత్రమేనా..
అదేవిటో బిడ్డొచ్చిన వేళా .. అన్నట్టు .. నేనీ టపా తెరెకెక్కించిన ఒక ఐదారు గంటల్లో ఈ మాట సైటు సిగ్గేసి మొహం చాటేసింది. ఎంత బుజ్జగించినా తల పైకెత్తడం లేదుట. సారీ!
కామెంటు అని కాదు కానీ మీకథ చదువుతుంటే తోచింది -మనదేశంలో కులాలలయితే, ఇక్కడ జాతివేదనలు. ఇద్దరు తెల్లవాళ్లూ, ఒకకాఫీరంగూ (మనకలరు) ఒకచోట కూడితే, నల్లవాడు పైవాడు. నల్లవాడు అక్కడ లేకపోతే మనరంగువల్ల మనం వేరు. పిల్లలకి ఈతేడాలు వివరించడం బహుకష్టం.
చాలా బాగుంది ఈ కథ. మీ ఇంకో బాతు కథ కూడా నాకు నచ్చింది.
--ప్రసాద్
http://blog.charasala.com
శ్రీ - భారతీయ వేషభాషలమీద కిరణ్ కి గౌరవం రావడానికి వయసూ అనుభవమూ సరిపోవు అని నా అనుమానం.
రమణి - మీ మంచి మాటలకి బదులేమివ్వను? ఎప్పుడన్నా నా రచనల్కి పబ్లిసిస్ట్ అవసరమైతే ఆ పోస్టు మీదే :-)
నిషిగంధ - :)
పూర్ణిమ - మరీ అంత తిరగా బోర్లా గా ఉందంటారా? :)
వేణు శ్రీకాంత్ - శ్రమపడి చదివినందుకు ధన్యవాదాలు. సందేహం లేకుండా జరుగుతోంది, కేవలం సౌత్ లోనే కాదు, అమెరికా అంతటా.
మాలతిగారు - అవును, వర్ణల్లో తరతమ భేదాలు చాలా ఉన్నాయి.
ప్ర మరియు ప్ర - మీకు నచ్చినందుకు సంతోషం. ప్రవీణ్, అది ఒక బాతు కథే, ఇంకో బాతు కథ కాదు :)
ఈమాట లో చదివి అక్కడే కామెంటాను రాత్రి! 'నిగ్గర్ ' అనే మాట ఇంకా అక్కడ వాడుకలో ఉందంటే నాకు ఆశ్చర్యమేసింది.(నాకు అక్కడి పరిస్థితుల గురించి పెద్దగా అవగాహన లేదనుకోండి)'వివక్ష ' ఉందని తెలుసు గాని!
శంకర్ లాంటి తల్లి దండ్రులు ఇప్పటి పరిస్థితుల్లో ఎంత మంది కావాలంటారు? అమెరికాలోనే కాదు, ముఖ్యంగా ఇక్కడ, ఈ ఘనత వహించిన నా పవిత్ర భారత దేశంలో ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన తండ్రి శంకర్!
పిల్లలతో డీల్ చేయడం కత్తి మీద సాము, అది మాత్రం పచ్చి నిజం! స్కూల్లో ఏమి చెప్పారో తెలియదు, నిన్న మా అయిదేళ్ళ రాకుమారి ఇంటికి రాగానే 'గాంధి కీ ఇండియా కి సంబంధం ఏమిటి ' (అచ్చంగా ఇవే మాటలు. నేను మార్చలేదు)అనడిగి ఈ రోజు మధ్యాహ్నం వరకు డేడ్ లైన్ పెట్టి, స్కూలుకి చక్కా పోయింది. పొద్దుటినుంచీ అర్జెంటుగా గాంధి ఆత్మకథ చదువుతున్నా!
మీ కథలన్నీ ఒకే చోట దొరకడం ఆనందమానంద మాయెనే!
నెటిజెన్ - ధన్యవాదాలు