సుమారు నెలరోజుల క్రితం కథ రాయండి అని పిలిచిన పిలుపు విని మొత్తం పన్నెండు మంది తమ కీబోర్డులకి పని చెప్పారు. చాలా సంతోషం.
ఈ బ్లాగర్లు తమ తమ బ్లాగుల్లోనే కథల్ని ప్రచురించారు.
03/04 మనలో మాట రమ
03/05 నివేదన రమ్య
03/05 ఓనమాల లలిత
03/08 స్నేహమా రాధిక
03/10 సృజన అనుసృజన సోమశంకర్
03/15 వాగ్దేవి లలితాస్రవంతి
03/16 జ్యోతి
వీరు కాక సిరి, శ్వేత, సౌమ్య, రానారె, దంతుర్తి శర్మ గారలు నాకు వ్యక్తిగత వేగు పంపారు. వారి వారి కారణాల వల్ల తమ రచనలు బ్లాగుల్లో పెట్టలేదు. నాకు తెలిసి దంతుర్తి శర్మగారు ఇంకా బ్లాగు మొదలు పెట్ట లేదు, ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వారు బ్లాగృహ ప్రవేశం జరిపిస్తే మరీ బ్లాగు!
ఇప్పటిదాకా కథలు రాయని, రాయాలని అనుకోని వారూ, రాయగల్నో లేదో అని మథన పడినవారూ ధైర్యం చేసి ముందుకు రావడం బహు ముచ్చటగా ఉంది. పనిలో పనిగా రమ్య, సౌమ్య, రానారె, సోమశేఖర్ వంటి వర్ధమాన రచయితలు కూడా ఒక చెయ్యి వెయ్యడం మరీ బావుంది. ఆ దృష్ట్యా కథలు రాయడం పట్ల జనాల ఆసక్తిని కదిలించాలని తలపెట్టిన ఈ ప్రయత్నం సఫల మైనట్లే అనుకుంటున్నాను.
ఇచ్చిన విషయాన్ని కథగా మలచటంలో అందరూ వేర్వేరు దారులు పట్టారు, విచిత్రమైన ఊహలు చేశారు - ఇది కూడా నాకు చాలా సంతోషం కలిగించింది. అందరికీ చక్కటి భాషా, పదునైన అభివ్యక్తీ ఉన్నాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఐతే కథా రచన మీదనూ, కథ రూపం ఎలా ఉండాలనే విషయమ్మీదనూ అవగాహన లేకపోవటం వల్ల ఔత్సాహిక రచయిత కథలు స్కెచ్ ల లాగానే మిగిలాయి, పూర్తి కథలుగా ప్రాణం పోసుకోలేదు. ఒక ఉపమానం చెప్పాలంటే .. పక్కింటి పిన్నిగారు తెల్లకాగితం అనే సినిమా చూసొస్తే, మనం ఆవిణ్ణి ఓహో, సినిమా చూసొచ్చారా? ఏవిటీ కథ? అనడిగితే ఆవిడ సినిమా కథ చెప్పినట్టుగా ఉందన్న మాట.
కథ ఇంకా బాగా ఎలా రాయాలి అని కుతూహలం చూపిన వారికి, సూచనలు కోరిన వారికి వ్యక్తిగతంగా నేను ఇప్పటికే కొన్ని సూచనలు చెప్పాను. థామస్ ఎడిసనో ఎవరో అన్నారు Success is 10% inspiration and 90% perspiration అని. మీరంతా మొదటి అడుగు వేశారు. ఇంస్పిరేషన్ మీలో ఉన్నదని మీకు మీరే నిరూపించుకున్నారు. బ్లాగుల్లో ప్రకటించిన కథలన్నిటికీ వచ్చిన వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నై. ఇక మిగిలింది శ్రమ .. ఈ సాహితీ వ్యవసాయంలో విజయం సాధించాలంటే అది తప్పదు. శిక్షణ కష్టంగానే ఉంటుంది. మాత్ర చేదుగానే ఉంటుంది.
కథల బాగోగులు తెలిసిన కొందరు మిత్రులకి కొన్ని కథలు చూపించాను. వాళ్ళు పలు విషయాలు చెప్పారు. కొన్ని మాటలు మీకు కటువుగా అనిపించొచ్చు. ఒక్క విషయం గమనించండి. మీరెవరో వాళ్ళకి తెలీదు. ఈ వ్యాఖ్యలేవీ వ్యక్తిగత విమర్శలు కావు. కథ మీదనే వాళ్ళ దృష్టి. కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాల్నిగమనించండి, మీ మీ రచనలకి అన్వయించుకుని చూడండి. దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఇంకా మంచి కథలు రాసే రచయితలుగా ఎదుగుతారని నా ఆకాంక్షా, నమ్మకమూనూ.
"అక్కడక్కడా ఉన్న inconsistencies సరిచేసుకుంటే బాగుండేది. మొదటి పేరాలోనే ఆ అజాగ్రత్త కనిపిస్తుంది. First person narration వల్ల అక్కడక్కడా కొంత అసహజత్వం కనిపించినా, ఇంకోసారి చదువుకుని సరిచేసుకుంటే ఇంకా మంచి కథ అయ్యుండేది."
"అసహజత్వం కనబడుతోంది. నూకల జావలో పచ్చికారం నంజుకుని తినాల్సిన స్థితిలో ఉన్న కుటుంబానికి మధ్యాహ్నం ఉపాహారానికి బఠానీలు, పాలు సమకూర్చుకోగల పరిస్థితి ఉంటుందనిపించదు. పైగా ఒక తెల్ల కాగితం కూడా కొనలేని స్థితిలో ఉన్న కుటుంబంలో! తన దగ్గర ఉన్న తెల్లకాగితాన్ని ఇంకొక కుర్రాడికి దానం చెయ్యటం, దానికిచ్చిన వివరణా కూడా చాలా అసహజంగా ఉన్నాయి. తెల్ల కాగితం తెచ్చుకోనందుకే వీపు పగలేసిన మాష్టారు, చిత్తు పుస్తకమైనా లేకపోతే బళ్ళోనే ఉండనిస్తారా?"
"నేపథ్యం బాగానే ఉంది కానీ, ఎక్సిక్యూషనే బావులేదు. punctuation errors, typo-ల మధ్యలో అసలు కథ విడదీసి చదవడానికి మరాళం కావాలి. భాష చాలా inconsistent గా ఉంది."
బహుమతి విజేతని ప్రకటించడానికీ, కొత్త కథా విషయం ఇవ్వడానికీ నాకింకొంచెం వ్యవధి కావాలి. ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తాను.

Comments
I sent you story today to your emailid. I am surprised to see the list with out my name!
siri
మీరు ఉదహరించిన రెండు సందర్భాలు అవే!
ఆశ్చర్యపరిచిందేమిటంటే, మీరు మళ్ళీ ఒక "కొత్త కథా విషయం" ఇస్తా ననడం. భేష్, భేష్!
"తెల్ల కాగితం" ఒకటే అని అనుకోవడం!?
meeru prati kathaki savivaramgaa lOTupaaTulu ceptE,mEmu sarididdu kunTAmu
naaku telisii evaruu bahumati kOsam raayaru kadaa...
maa raasE teeruni merugu paruchukOvaali anTE mee laanTi peddala soochanalu kaavaali
నాకెదురైన ఇబ్బందులు:
కథ రాసింది బ్లాగ్ కోసం కాబట్టి నిడివి తగ్గించి రాయాల్సి వచ్చింది,దీని వల్ల కథ వివరంగా చెప్పలేక పోయానని పించింది.(ఎన్ని పేజీలు అనేది కూడా మీరు తెలిపితే బాగుండేది).
విషయాన్ని ఇంక రాయకుండా ఉండలేను అనుకున్నప్పుడే రాసేదే అసలైన రచన అని నాకనిపిస్తుంది,కాని ఇది రాయాలి అని రాసాను.
ముఖ్యంగా సిస్టం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది,నేను అసలే చాలా స్లో, మూడు గంటలు కూర్చుని దాదాపు పూర్తిగా టైప్ చేసాక,నెట్ డిస్కనెక్ట్ ఏంటో మరి బ్లాగర్ పనిచేయలేదు అంతా పోయింది. నేను బద్దకంగా వూరికే పేపర్ పై కథాంశం రాసుకుని వివరంగా కీ బోర్డ్ పై డైరెక్ట్ గా రాసాను అంతా గోవింద.. మళ్ళీ ఓనాల్గు గంటలు కూచుని....ముందు రాసుకున్న సంభాషనలకి దీనికీ తేడా అనిపించింది.
పంక్చువేషన్స్ వాడగానే అక్షరమాల డిసేబుల్ ఐపోతోంది,లేటవుతే అంతాపోయి మళ్ళీ నాల్గు గంటలు కూర్చునే ఓపికలేక ఎడిటింగ్ చేయలేదు. పబ్లిష్ చేసాక మళ్ళీ మళ్ళీ మార్చటం కరెక్ట్ కాదేమోనని అలాగే ఉంచాల్సి వచ్చింది. నేను ఇంకొన్ని రోజులు టైం తీసుకుని రాయాల్సింది. కొన్ని ప్రయాణాలు,శుభకార్యాలు ఉండటం వల్ల హడావిడి గా ఇచ్చేసాను.
i do not really know how to start a telugu blog though i have an english blog that i seldom update. so any help on creating one blog and post there? that would be handy because sometimes i get rejections from eemaata and such and the rejections can be put on my own blog. who can stop me? He he.. Regards
Sarma Danturthi
సిరి - మీ కథ అందింది. అందినట్లు టపా సరిదిద్దాను.
ప్రవీణ్ - ఇలా ఇంకొన్ని విడతలు పూర్తయ్యాక అలాంటి లిస్టు పెడతాను. దురదృష్ట వశాత్తూ కథ రాయడానికి రెసిపీ ఏమీ లేదు. కొంత అనుభవం పొందితే కానీ నేనేమన్నా సూత్రాలు చెప్పినా అర్ధం కాదు.
నెటిజెన్ - మీ వ్యాఖ్య నాకు పూర్తిగా అర్ధం కాలేదు. కొత్త కథా విషయం ఇస్తానంటే ఆశ్చర్య మెందుకు? వ్యంగ్యం ఏమన్నా ఉందా? తల బొప్పి కట్టింది చాల్లేదా అంటున్నారా? అన్నట్టు మీరు చెప్పినట్టు కాయితం జీవితానికి ప్రతీక అన్నట్టు ఎవరూ రాయలేదు గానీ సౌమ్య గారి కథ, రాధిక గారి కధా కొద్దిగా ఆ ఆలోచనని స్పృశించాయి.
సత్యసాయి గారు, మీ వంటి వారిని కూడా రాస్తే బాగుణ్ణే అనిపించిందంటే .. నిజంగా సఫలమైనట్టే. ముందొక డ్రాఫ్టు రాస్తే దానిపైన ఎలా పెంచాలని చర్చించొచ్చు.
వింజమూరి వారు సోదాహరణంగా వివరించమంటున్న ఐడియా బానే ఉంది. ఐతే ఒకటే ఇతివృత్తం మీద పన్నెండు కథలు చదివాక దాన్ని గురించి నేనిప్పుడు సొంత ఆలోచన చేసే స్థితిలో లేను. మీ వంటి అనుభవజ్నులు ఉదాహరణకి పూనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు.
లలితాస్రవంతి - మీరు చెప్పినటువంటి పబ్లిక్ చర్చ అందరికీ ఇష్టం కాకపోవచ్చు. టపాలో చెప్పినట్టు పాఠం చెప్పటమంటే కొన్ని సార్లు కటువుగా ఉండాల్సొస్తుంది. మీర్రాసిన దాని గురించి మీతో మాట్లాడమంటే నేను సిద్ధం. మెయిల్లో మాట్లాడుకోవచ్చు.
రమ్య - మీరు కథ రాయడనికి పడిన పాట్ల గురించి ఒక కథ రాయొచ్చన్న మాట. నా మట్టుకి నేను ఇప్పటికీ మొదటి డ్రాఫ్టు కాయితం మీద చేత్తో రాస్తాను. ఆలోచనలు సాగడానికి నాకు అదొక మార్గం. అందరికీ అదే పని చెయ్యాలని లేదు. నెట్ కనెక్షను పోవచ్చు, లేదా కరంటు పోవచ్చు అనే భయముంటే ముందు ఏ notepad లోనో word doc లోనో టైపు చేసుకోడం మంచిది. బరహా, అక్షరమాల వంటి వాటితో ఏ అప్లికేషనులో అయినా తెలుగులో టైపు చేసుకోవచ్చు కదా. అక్షరమాల - పంక్చువేషను మార్కుల ఇబ్బంది గురించి మీరు చెప్పింది అక్షరాలా కరక్టే. నేను సుమారు అరగంట కోసారి వెనక్కి వెళ్ళి అవసరమైన కామాలు, కొటేషన్లూ పొదుగుతూ ఉంటాను.
http://wiki.etelugu.org/Start_a_Blog
Thanks for the update.
రానారె అంత చక్కగా కథలు రాస్తాడు కదా ఈ విషయం మీద ఎందుకు రాయకూడదూ అని అడగాలనిపించింది. అయితే రాసాడన్న మాట.ఏం, వీరంతా దాచుకోవడం ఎందుకూ?
రమ గారు తన కథ ప్రచురించాకే నా ఆలోచనకి ఒక రూపం వచ్చింది. ఈ మధ్యే నేర్చుకున్నాను ఒక స్నేహితురాలి స్నేహితురాలి ... ద్వారా. Group Energy అట. అందరూ పాల్గొంటే అదో రకమైన ఉత్సాహం వస్తుంది, జంకే వారు కూడా కాస్త ప్రయత్నిస్తారు.
స్కెచ్ లాగా ఉంది అంటే నా కథే(నేను రాసింది కథేనా?)నేమో అనిపిస్తోంది:-)
గురువు గారు సూచనలుంటే నాకు నేరుగా e-mail పంపగలరు.
ఇంకో విన్నపం. నేను ఉద్దేశపూర్వకంగా తెలుగు4కిడ్స్ ను ఓనమాలు బ్లాగునుంచి విడ దీశాను. నా కథ పిల్లల కోసం తెలుగు అనే ఉద్దేశంతో తెరిచిన బ్లాగులో ప్రచురింపబడిందని గమనించగలరు.
ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడమేమనగా :) ...
జరుగుతున్నది కబడ్డీ పోటీ కాగా, కుస్తీ బాగా సాధనచేసి వచ్చాడట ఒకడు. బరిలో దిగడం ఆలస్యం ఔట్ అయిపోయాడు. అలా నా కథ కూడా మెడ పట్టి బయటకు నెట్టబడింది. మన సచివాలయం ఎదురుగా ఆర్భాటంగా పైకెగసిన ఫ్లైఓవరును తలపింపజేసే నా కథను సమయం చూసుకొని సక్రమంగా సరయిన చోట దించాలి.
నేను ఎక్కువ ఉత్సాహం గా బ్లాగను కాబట్టి చాలానే
miss అయ్యాను :)
మా అందరికీ మీరు పెద్దదిక్కు లాంటివారు
మీరు తప్పొప్పులు చెప్తే ఎవరూ టమాటాలు వెయ్యరండీ
మొదటిసారి కథ రాయాలంటే ముందు ధైర్యం కావాలి .అది నాకు ఆఖరు తేది వరకు రాలేదు. చాలా నెలల క్రింద రావుగారు ఇలాగే హోమ్ వర్క్ ఇచ్చేవారు. తర్వాత చావా కిరణ్, నేను బ్లాగు విషయం అని ఇచ్చాము. మీ ఈ విధానం సఫలం కావాలని అనుకుంటున్నాను. ఒకరిద్దరైనా మంచి రచయితలు/రచయిత్రులు పైకి రాగలరని నా ఆశ.
రమ్య గారు, కొత్తపాళీగారు,
స్పీడ్ టైపింగ్, ఒత్తుల సమస్య లేకుండ ఉండాలంటే అక్షరమాల కంటే బరహ బెస్ట్ అండీ.
సాధారణంగా ఒక ప్రక్రియతో ముగిసిపోతుంటాయి కాబట్టి.
ఎంత మాత్రము వ్యంగం లేదు. ఆ అభిప్రాయం కలుగజేసినందుకు క్షమించండి.
ఈ కధా రచనలూ - "తెల్ల కాగితం"తో ఐపోతాయేమో అని అనుకోవడం వలన -అంతే మరే కారణం లేదు.
ఇక బహుమతి ఏమిటి అన్న కుతూహలం మిగిలింది.
ధన్యవాదములు. మీ mail id నాకు ఎక్కడా లభ్యమవ్వలేదు. దయచేసి అది కూడా కొత్త అంశంతో పాటు ఇవ్వగలరు. వేయి కళ్ళతో మరో అంశం గురించి ఎదురుచూస్తూ జాహ్నవి