వేలం వెర్రి

నిన్న మా స్నేహితురాలొకరు కాల్చేశారు - అర్ధరాత్రి స్థానిక పుస్తకాల కొట్టు దగ్గిర పడిగాపులు పడేందుకు వస్తారా అని అడగటానికి. ఎందుకంటా పడిగాపులూ? హేరీ పాటర్ ఏడో మరియు ఆఖరు పుస్తకం విడుదలకి. నాకంత ఓపిక లేదు తల్లీ - ఐనా నేను అమెజాన్ లో ముందే ఆర్డరిచ్చాను అని చెప్పాను.

పొద్దున లేచి టీ కలుపుకుందామని చూస్తే పాలు నిండుకున్నై. మా ఇంటెనకాల ఉండే సూపర్ మార్కెట్టుకెళ్ళా. అక్కడ ముందరి వరసలోనే ఒక పెద్ద రాశి పోసి ఉన్నై హేరీ పాటర్ ఏడో పుస్తకం ప్రతులు - 40% తగ్గింపు అనే పేద్ద అక్షరాల ప్రకటనతో సహా.

నాకు నవ్వొచ్చింది - ఇంత మాత్రం దానికి అమెజాన్ లో ముందస్తు ఆర్డర్లెందుకూ, పుస్తకాల కొట్టు ముందు అర్ధరాత్రి పడిగాపులు పడటమెందుకూ .. ఇంటి పక్కన సూపరు మార్కెట్లో కొనుక్కునే దానికి?

నాకు అర్థం కాని ఇంకో విషయం - విడుదలతోనే అంత తగ్గింపు ధర ఎందుకు? దానికి ముందసలు ఒక ధర నిర్ణయించడమెందుకు, మళ్ళీ దాన్ని 40% తగ్గించడమెందుకు?

ఏంటో అంతా వేలం వెర్రి!

అద్సరే ఇంతకీ ఈ అమెజాన్ వెధవ నా ప్రతి ఎప్పుడు పంపిస్తాడో!

Comments

రాధిక said…
అవన్నీ అసలు పుస్తకం లోని కధ ఏమయి వుంటుందో అని ఊహిస్తూ రాసిన పుస్తకాలేమోనండి?లేక అసలు పుస్తకం ఇదేనంటూ వచ్చిన నకలు అయినా అయి వుంటుంది.అయినా ఆపుస్తకం మీద మీకు కూడా అంత ఇది వుందా?
కాదు కాదు, అవి నిజం పుస్తకాలే. మీరు చెప్పే fan fiction పుస్తకాలు చాలా కాలంగానే ఇంటార్నెట్టుని చుట్టబెడుతున్నాయి.
అవును నాకు ఆ పుస్తకం మీద కూడా అంత "ఇది" ఉంది. :-)
Anonymous said…
Duh !! harry mania uh ?? ;)

Well I only read the azkaban which being been lauded as the best book of the lot , but through out the book I really kinda felt that these books don't give us a glimpse into the consciousness of a child, far from it. They take us instead into the mediocre but very amusing mind of J.K.Rowling.
S said…
"నిన్న మా స్నేహితులొకరు కాల్చేసారు.."
- చదువుతూ ఉంటే "కాల్ చెసారు" అనుకోలేదు. "కాల్చేసారు" అనుకున్నా. :)) hmm పాటర్ మానియా ఒక విధంగా శుభసూచకమే కదా...అయితే, ఇలా ఒక తెలుగు పుస్తకం కోసం జనం ఆత్రంగా ఎదురుచూసేరోజు వస్తుందంటారా?
Anonymous said…
మీకో కొత్త విషయం తెలుసా...ఇక్కడ ముంబయిలోని ఒక మహిళా జర్నలిస్టు....హ్యారీ పోటర్ పుస్తకాలను పొగుడుతా...అంతటితో ఊరుకోక...మన కథల మీద విరుచుకుపడింది. మన కథలన్నీ ఇప్పటి పిల్లలకు పనికిమాలినవట. బలవంతగా నీతిని జొప్పించేందుకు ప్రయత్నిస్తాయట మన కథలు. పిల్లల కథల్లో నీతిని చెప్పక ఇంకేమేమి చెప్పాల్రా దేవుడా అని ఇంకా బుర్ర గోక్కుంటున్నాను...పోట్టర్ పుస్తాకాలు చెదివారు గాన సమాధానం మీగ్గానీ తెలిస్తే కొంచెం చెబుదురు...
S said…
నవీన్ గారు అన్న వ్యాసం నేనూ చదివాను అనుకుంటా నిన్న. పిల్లల కథల్లో నీతి ఒక్కటే ఉండాలి అన్న వాదన ను నేను అంగీకరించను. చక్కని హాస్యం ఉండొచ్చు. లేకుంటే వాళ్ళ ఇమాజినేషన్ ని పరీక్షించే ఫాంటసీ తరహా కథలు రావొచ్చు. పాటర్ వంటివి అలాంటి కోవ. సాహస బాలల కథలు రావొచ్చు. అల్లరి పిల్లల కథలు రావొచ్చు. మన టింకిల్ లో రామూ-షాము త
S said…
నవీన్ గారు అన్న వ్యాసం నేనూ చదివాను అనుకుంటా నిన్న. పిల్లల కథల్లో నీతి ఒక్కటే ఉండాలి అన్న వాదన ను నేను అంగీకరించను. చక్కని హాస్యం ఉండొచ్చు. లేకుంటే వాళ్ళ ఇమాజినేషన్ ని పరీక్షించే ఫాంటసీ తరహా కథలు రావొచ్చు. పాటర్ వంటివి అలాంటి కోవ. సాహస బాలల కథలు రావొచ్చు. అల్లరి పిల్లల కథలు రావొచ్చు. మన బుడుగు, టింకిల్ లో రామూ-షాము తరహా వి. లేకుంటే జంతు పాత్రలతో నీతి చెప్పెలా కాకుండా - కపీష్ వంటివో...కాలియా ది క్రో వంటివో రావొచ్చు.. Entertainers అంటాను నేను వీటిని. Enid blyton తరహా కథలో, సత్యజిత్ రే తరహా ఫెలూదా కథలో .... లేక పిల్లల కోసం సైన్స్ ఫిక్షన్ పాత్ర అయిన ప్రొఫెసర్ షొంకు (మళ్ళీ సత్యజిత్ రే) వంటివో... జానపదాలో... Tom brown's school days, Swami and his friends వంటివో... ఇలా ఎన్ని లేవు?
Anonymous said…
"నీతి ఒక్కటే ఉండాలి" అన్న వాదన ఇక్కడ ఎవరూ చేయడం లేదండి. ఆంగ్ల సాహిత్యానికి ఉన్న పరిధి మనమెవ్వరం ఊహించలేనంత పెద్దది. అక్కడ చెప్పినన్ని కథలు ప్రపంచంలో మరే భాషలోనూ లేవు. ఆ ముంబాయి ఆవిడ..మన నీతి కథలంటేనే నాకు అలర్జీ (తెప?) అన్నట్టు మాట్లాడితే...కాస్తంత ఆలోచనలో పడ్డానంతే. ఇప్పటి భారతదేశపు పిల్లలకు మన పాత నీతి కథలు పనికొస్తాయా లేక ఆ ముంబయి ఆవిడ చెప్పినట్లు మన పిల్లల కథల సిలబస్సును (తెప?) ఈ పాటర్ కథలతో రీప్లేస్ (తెప?) చెయ్యాలా అని అడగడమన్న మాట.
@ క్రిష్ - హేరీపాటర్ పుస్తక పరంపర గురించి మీకిట్లాంటి అభిప్రాయం రావడం దురదృష్టం. ఈ పరంపరలో ఆస్వాదయోగ్యమైన విషయాలేమిటో వేరే టపా రాస్తాను.

నవీన్ మరియు S ..
మీ ఇద్దరి వాదనలూ బానే ఉన్నయ్యి.
నవీన్, నీతి కథలని మీరు వేటిని అంటున్నారు? ఇవి నీతి కథలు, ఇందులోని నీతి ఇది - అన్నట్టు ఉన్న కథలని నేను ఏనాడూ ఇష్టపడలేదు. పిల్లల భావనా శక్తి చాలా గొప్పగా ఉంటుంది. ఆ శక్తిని సవాలు చేసి ఎగదోసే సాహిత్యం రావాలి. అందులో వినోదం పాలు ఎక్కువే అనుకుంటాను. హేరీ పాటర్ని కాసేపు పక్కన పెట్టి - సి.ఎస్. లూయిస్ (నార్నియా కథలు) లూయిస్ కెరొల్ (ఏలిస్ కథలు) రవొల్డ్ డాల్ కథలు - ఇత్యాదులను పరిశీలించండి. ఇవన్నీ కథలో అంతర్లీనంగానే వాళ్ళు చెప్పదల్చుకున్న "నీతి"ని చక్కగా చెప్పేస్తారు. ఇది వరకు చందమామలో వచ్చే సీరియల్ కథలు కొంతవరకూ ఈ లక్షణాల్ని కలిగి ఉండేవి.
Anonymous said…
I will try to be more specific:
అయ్యా నా బాధ ఏమిటంటే కొత్త కథలు వచ్చాయి కదా అని మన పాత కథలను తూచ్ అనడం నాకు కొంత మింగుడు పడలేదు. పంచతంత్రం కథలు నా వ్యక్తిత్వాన్ని ఎంతో ప్రభావితం చేశాయని ఘంటాపదంగా చెప్పగలను. ఉదాహరణకు చిన్నప్పుడు రాత్రి పూట మా ఇంటి వెనుక ఉన్న మునగ చెట్లు, పూల చెట్ల గుండా ఒక్కణ్ణే నడిచి స్నానాల గదికి వెళ్ళాలంటే భలే భయంగా ఉండేది. కానీ ఈ కథ (http://www.panchatantra.org/the-jackal-and-the-drum.html) చదివిన తరువాత నా భయాలన్నీ పటాపంచలయ్యాయి. అప్పట్నుంచి అనవసర శబ్దాలకు భయపడటం మానేశాను. ఇదంతా 10యేళ్ళ వయసులో. మన కథలు వీర శివాజీ (జిజియా భాయి చెప్పిన కథలు), మహాత్మా గాంధీ (సత్య హరిశ్చంద నాటకం) లాంటి వారిని తయారు చేశాయి. ఆ ముంబయి జర్నలిశ్టు ఆరోపించినట్లు ఈ కథల్లో సందేశం అంతర్లీనంగా కాక, "నెత్తిన రుద్దినట్లే" ఉంటుంది.మరి ఇప్పటి పిల్లలకు ఈ కథలన్నీ అనవసరం అంటారా?

పిల్లల వ్యక్తిత్వాన్ని, బుద్దిని వికసింపజేసే ప్రతి ఒక్క సాహిత్యాన్ని వారికి పరిచయం చేయవలసిందే. ఐతే నా ప్రశ్న: వ్యక్తిత్వాన్ని, బుద్దిని వికసింపజేయటానికి మన పంచతంత్రం లాంటి కథలు ఎన్నుకొన్న పద్దతి ఈ కాలం పిల్లలకు పని చెయ్యదా?
ఇదే పనికొస్తుంది, ఇదేదీ పనికిరాదు అని నిర్ధారణగా చెప్పలేము అనుకుంటా.
పంచతంత్రాన్ని తక్కువగా అంచనా వెయ్యలేము. నా దృష్టిలో అందులోని "మనసుకి హత్తుకునే" శక్తి గొప్పది.
బహుశా ఆ జర్నలిస్టు గారి గోడు ఏంటంటే - సమకాలీన వాతావరణం ఉన్న కథలు కావాలని అయ్యుండచ్చు - ఈ ఆలోచన కూడా నాకు సబబే అనిపిస్తోంది. నీతి, ఫేంటసీ లతో పాటు పిల్లలు తమకు లాగా ఉండే పాత్రల్ని ఆదరిస్తున్నారని నేను గమనించాను.
Anonymous said…
hmmmm .... నా అభిప్రాయం తప్పై ఉండొచ్చు కానీ ఒక విశయం పై భిన్నాభిప్రాయాలు ఉండడం లో తప్పు లేదు గా , పైగా అది నా అభిప్రాయం కాబట్టి ఇప్పట్లో దాన్ని మార్చుకోదలుచుకోలేదు ;) , నే అది చదివి చాలా రోజులయ్యింది , కాబట్టి అది చాలా రోజుల కిందటి అభిప్రాయం , అయినా మళ్ళీ చదివి కానీ నే నా స్టాండ్ ని సపోర్ట్ చేసుకోలేను ... అపట్టి వరకూ నో కామెంట్స్ !! :)
మీ పోస్టు కోసం విపరీతంగా waiting !!
వీలైనంత త్వరలో బుక్కు(లు) చదివిన తరువాతే కామెంటుకొస్తా :) (నే ఓఠ్ఠి azkaban మాత్రమే చదివా , హారీ సిరీస్ లో మీరు సజెస్ట్ చేసే బుక్కేది ?? azkaban తప్ప , అన్నీ అనకండి ;) )
ఒక వేళ మళ్ళీ చదివినా నా ఓపీనియన్ మారక పోతే రౌలింగ్ అత్తకి వచ్చిన నష్టమేమీ లేదు గా ;)
@ క్రిష్ - మీ అభిప్రాయం మీది - తప్పకుండా ఉండొచ్చు - ఉండకూడదనలేదు, అలా ఉండటం దురదృష్టం అన్నానంతే :-)

పోస్టు రాయాలని చాలా కాలంగానే అనుకుంటున్నా. ఏడో పుస్తకం విడుదలకి ముందుగా ఆరో పుస్తకాన్ని ఒకసారి తిరిగి పఠిస్తున్నా. అది పూర్తి కాకుండానే ఏడోది వచ్చేసింది. అన్నట్టు అమెజాన్ వాడు వాగ్దానం చేసినట్టు, శనివారమే ఇల్లు చేరింది పుస్తకం. ఇప్పుడు మరి ఏడోది చదివెయ్యాలనే ఉబలాటం .. 759 పేజీలంటే మాటలా! :-)
సిరీస్ మొత్తమ్మీద -
మొదటిది - పుస్తకం చాలా బావుంది. సినిమా చెత్త.
రెండోది - పుస్తకం పర్లేదు. సినిమా పర్లేదు.
మూడు (అజకబాన్) - పుస్తకం బావుంది. సినిమా చాలా బావుంది.
నాలుగు - పుస్తకం బోరు. సినిమా చెత్త.
ఐదు - పుస్తకం బావుంది. సినిమా పర్లేదు.
ఆరు - పుస్తకం బావుంది.
ఏడు - పుస్తకం చాలా బావుంది ట!
Anonymous said…
పంచతంత్రాన్ని తక్కువ అంచనా వెయ్యలేము అని మాబాగా సెలవిచ్చారు. నిజమే...చిన్నప్పుడు ఆ కథలను పదే పదే ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు. ఇప్పటికి కూడా వీలు చిక్కినప్పుడంతా ఆ కథలు చదువుతూంటా. మిత్రభేధంలో దమనకుడు కరటకుడుకి మధ్య సంవాదంలోని ప్రతి ఒక్క మాటా మనిషి జీవితంలో పాఠంలా తోస్తుంది నాకు. దాని నుంచి ఎన్నెన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చో. మూర్ఖులతో సంవాదం కూడదని, కలిమి కలకాలం ఉండదని..కష్టకాలాన్ని ముందే ఊహించి జాగ్రత్త పడాలని (Adaptation), మాటవరుసకి బాసలు చెయ్యరాదని, మొహమాటం కూడదని, స్నేహితులలో దుష్టులను గుర్తించాలని, తెలివి ఉంటే ఏ కార్యాన్నైనా సాధింపవచ్చునని, అతివినయం ధూర్త లక్షణమని (ఆషాడభూతి కథ), స్నేహం వలన లాభాలు (మితభేధం) ఇలా ఎన్నో మంచి విషయాలు జంతువుల పాత్రల ద్వారా చెప్పడం పిలలకి భలే నచ్చుతుంది. ఇప్పుడు మార్కెట్ లో దొరకే పంచతంత్రం పుస్తకాలు ఎంత మాత్రం బాగాలేవు. TTD Publications వాళ్ళు సంస్కృతంలో ఉన్న పంచతంత్రాన్ని అలాగే తెనుగులోకి అనువదించి..బాపూ బొమ్మలతో ముద్రించారు. ఆహా ..నా సామిరంగా...పంచతంత్రం పుస్తకం అంటే అది.
త్రివిక్రమా - పేపరు వాళ్ళు పుస్తకాల గురించి సాధారణంగా రాసే నీరసమైన విశ్లేషణే అది. మన గుంపులు బ్లాగుల్లోనే దానికంటే ఉత్తేజకరమైన చర్చలు జరుగుతై.

నవీనూ - తితిదే వారి ముద్రణ ఇంకా దొరుకుతోందా? పాటర్ పరంపరలో కూడా పిల్లలు (ఆ మాట కొస్తే పెద్దలు కూడా) నేర్చుకోదగిన సూక్తులు బానే ఉన్నై - వాటిని గురించి మరో టపాలో.

S - పుస్తకాలు కొనడం, చదవడం పెరిగినది పాటర్ కోసమేనట, ఆ అభివృద్ధి ఇతరత్రా వ్యాపించలేదని ఒక శోధన సమాచారం.
Anonymous said…
నా బాధ ఏమని చెప్పమంటారు ....ఆ పుస్తకం మా బంధువులది. అది పోయిందంట. అప్పట్నుంచి..అంటె 10 సంవత్సరాల నుండి దాని కోసం వీలైనప్పుడంతా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఫలితం లేదు. ఆ పుస్తకం ఇస్తానంటే..దాని ఖరీదుకు పది ఇరవై రెట్లు ఎక్కువ ఖరీదు చెల్లించడానికైనా నేను సిద్దమే...కానీ ఏదా పుస్తకం :(
S said…
Hmm... అసలు నేను ఇప్పటి దాకా ఇంకా పాటర్ పుస్తకాలు చదవలేదు... ఇష్టం లేదనేమీ కాదు.... ఏదో...చదవలేదు...అంతే... ఆ మధ్య రెండు సినిమాలు చూసాను పాటర్ వి. ఒకటి బానే అనిపించింది...ఇంకోటి బోరు కొట్టింది. అయినా, ఆ పుస్తకాలు చదివిన వారు అందరూ కూడా సినిమాలు చూసి పెదవి విరుస్తున్నారు.... ఓ సారి ఆ పుస్తకాలు చదవాలి అనిపిస్తోంది కానీ...సైజు చూసి భయమేస్తోంది.
Kurmanath said…
dear friend,
thanks for your comments on my short story. Incidentally, i'm going to read that out in a meeting this evening organised to remember the people I mentioned towards the end of the story.
kurmanath