తొమ్మిదేళ్ళ కిందటి మధుర జ్ఞాపకం


డిసెంబరు 6, 2009 ఆదివారం

పుస్తకం వెయ్యాల్సిందే అని అఫ్సర్, కల్పన ప్రోద్బలం
సమయం తక్కువ, ఐనా బొమ్మలు వేసేస్తాను అని అన్వర్ భరోసా
డి.టి.పి., ప్రూఫ్ రీడింగ్, కవర్ డిజైన్, ప్రింటింగ్ .. నా పుస్తకం పనిని తమ పనిలాగా నెత్తిన వేసుకుని నెరవేర్చిన నవోదయ రామ్మోహన్ రావు గారు, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర్రావు గారు

ఆ రోజు నా జన్మస్థలం విజయవాడలో
మా అమ్మకీ అప్పకీ సహోద్యోగులు, స్నేహితులైన పెద్దల సమక్షంలో,
పలువురు బ్లాగు సోదర సోదరీమణుల సమక్షంలో,
కుటుంబ సభ్యుల ఆప్యాయతలో,సిద్ధార్ధ విద్యా సంస్థల సంచాలకులు చక్రధరరావు గారు అధ్యక్షత వహించగా
దిప్యుటీ కలక్టర్, తెలుగు భాషాభిమాని రహ్మతుల్లా గారు ముఖ్య అతిధిగా విచ్చేయగా
మా మామగారు, సుబ్బారావుగారి చేతుల మీదుగా

నా కథల పుస్తకం
రంగుటద్దాల కిటికీ 

ఆవిష్కృతమైన ఆ సాయంత్రం ..

పి. సత్యవతి గారు, వంశీకృష్ణ గారు కథల్లో బాగోగులు మాట్లాడారు.

Picture show from Sirakadambam blog of Sri S. Ramachandra Rao garu

A report on the book release function in Telugu, also by Ramachandra Rao garu

Comments

Hima bindu said…
మాకు మధురమైన జ్ఞాపకం ;-)