మొన్నటి మంగళారంతో మాఘమాసం ముగిసింది.
మాఘం సూర్యదేవునికి ప్రీతికరం అంటారు. జనులందరూ సూర్యుణ్ణి అర్చించే రథసప్తమి పర్వదినం (మాఘ శుద్ధ సప్తమి) ఈ మాసంలోనే జరుగుతుంది.
చలికాలం ఎవరికీ పెద్దగా ఇష్టమైన కాలం కాదు. అమెరికాలాంటి చలి దేశాల్లో అయితే ఫ్లూ వంటి అంటువ్యాధులకి పుట్టినిల్లు ఈ చలికాలం. అందుకనే చలి మొదలైన దగ్గర్నించీ ఎప్పుడు మళ్ళీ వాతావరణం వెచ్చబడుతుందా అని చూస్తుంటారు. పాశ్చాత్యులు డిసెంబరు 22 న సాల్స్టిస్ అంటారు. మనం జనవరి 14న మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం అంటాం. భారతీయ సాంప్రదాయాల్లోనే మరి కొందరు రథసప్తమితో చలి అంతరించి సూర్యుడు వసంతాగమనానికి నాంది పలుకుతున్నాడని భావిస్తారు. అందుకనే రథసప్తమి మన సంస్కృతిలో అంత ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఇవన్నీ ఆలోచిస్తుంటే అలా సంధ్యావందనం మీదికి పోయింది మనసు.
ప్రాతఃకాల వందనంలో సూర్యోపస్థానము .. అంటే సూర్యునికి సేవ చేసే మంత్రమిది.
పన్నెండు మంది ఆదిత్యుల్లో మొదటి వాడి పేరు మిత్ర.
ఒక దృష్టితో చూస్తే పొద్దు పొద్దున్నే ఉదయిస్తున్న బాల సూర్యుడే మిత్రుడు. ఎందుకంటే ప్రాతః సంధ్యావందనం ఉదయాత్పూర్వమే చేసుకోవాలని చెప్పారు. ఆ సమయంలో సూర్యుడికి సేవ అంటే మనం ప్రార్ధించేది మిత్రుణ్ణే అని తెలుస్తూనే ఉంది. అందుకని ప్రాతః సూర్యోపస్థాన మంత్రంలో మిత్రుణ్ణి ప్రస్తుతించడం సమంజసంగానే ఉంది.
ఈ మిత్రుడనే వాడు లేలేత సూర్యుడవటమే కాదు. అన్నిరకాల మంచి పనులకీ దోహదకారిగా కూడా ఉంటున్నాడు. అసలు వాడి పేరులోనే ఉంది - మిత్ర. అదే ఆధునిక భాషలో మనం చెప్పుకునే స్నేహం, అంటే పరస్పర అభిమానం కలిగి ఉండటం. మరి యెవరియందు అభిమానం కలిగున్నాడీ మిత్రుడు? ఈ సమస్త భూమండలంలోని చరాచర ప్రాణికోటి యందరి మీదనూ స్నేహం కలిగి ఉన్నాడి మిత్రుడు. ఎవరైనా సరే, తగిన సాధన చేస్తున్నారా అని చూస్తాడుట. అలా చేసే వాళ్ళకి ఆసరాగా ఉంటాడుట. తన తేజస్సు ద్వారా వాళ్ళ సాధనకీ తపస్సుకీ మరింత బలం చేకూరుస్తుంటాడుట.
అటువంటి మిత్రునకు నమస్కారము.

ఓం మిత్రస్య’ చర్షణీ ధృత శ్రవో’ దేవస్య’ సాన సిమ్
| సత్యం చిత్రశ్ర’ వస్తమమ్ ... ...

Comments