జీవన సురభి పత్రికలో ఒక కొత్త వ్యాస పరంపర

మాన్యమిత్రులు మణిభూషణ్ గారి సారధ్యంలో హైదరాబాదు నించి కొన్నేళ్ళుగా విజయవంతంగా నడుస్తున్న చక్కటి తెలుగు పత్రిక "జీవన సురభి".

భక్తి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక మాస పత్రిక అని దీని టేగ్ లైను.
దానికి తగినట్లుగానే పండుగలు, మన ఆచారాలు, పురాణ విశేషాలు, సాహిత్య విశేషాలను గురించి చక్కని తెలుగులో, ఆధునిక శైలిలో రచనలు ప్రచురిస్తున్నారు. ఇందులో ఫలాని రత్నాలు కొనండి, లేదా ఫలాని తాయెత్తులు కొనండి వంటి వ్యాపార ప్రకటనల హోరు లేదు.

దసరా ప్రత్యేక సంచికగా అక్టోబరు సంచిక వెలువడింది.
డిజిటల్ ఎడిషను ఇదిగో
http://issuu.com/mediahub/docs/jeevanasurabhioct13


చాలా కాలంగా త్యాగరాజస్వామి కృతులని గురించి కొంచెం వివరంగా నా ఆలోచనలు రాయాలని అనుకుంటూ ఉన్నాను. ఇంతలోనే, నేను నా ఫేసుబుక్కు పేజిలో ప్రతి శుక్రవారం వేసే "శుక్కురారం సంగీతతీర్ధం" శీర్షికని చూసి, మణి భూషణ్ గారు తమ పత్రికకి రాయమని అడిగారు. అలా దసరాల సందర్భంగా అమ్మవారిని తలుచుకుంటూ "వినాయకుని వలెను బ్రోవవే" అనే మధ్యమావతి రాగ కృతితో ఈ వ్యాస పరంపర మొదలు పెట్టాను.

పైన ఇచ్చిన లింకులో నా వ్యాసంతో సహా మొత్తం పత్రికని చూడవచ్చు.

భారతదేశ వాసులు చందా కట్టడం ద్వారా ప్రింటు పత్రికను తెప్పించుకోవచ్చు.
వివరాలకు మణి భూషణ్ గారిని సంప్రదించండి.

Comments

sanath said…
చాలా బాగున్నది నారాయణ స్వామి గారు !!