వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను

కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చిరస్మరణీయమైన కథ మార్గదర్శి .. నా గొంతులో

ఈ కథని ఇదివరకు ఈ బ్లాగులోనే శ్రవ్యమాలికగా ప్రచురించాను.
http://kottapali.blogspot.com/2009/09/blog-post_25.html
కానీ అది పని చెయ్యడం లేదని మిత్రులు పప్పు శ్రీనివాసరావుగారు హెచ్చరించడంతో, పరిశీలిస్తే ఈస్నిప్సు వారు శ్రవ్యమాలిక పరికరాన్ని ఉపసంహరించినట్టు కనబడుతున్నది. అందుకని వేర్వేరు శ్రవ్యకాలకి లంకెలు ఇక్కడ ఇస్తున్నాను.


Sreepada Subrahmanya Sastri - Margadarsi 01 - eSnips
Margadarsi 02 - eSnips
Margadarsi 03 - eSnips
Margadarsi 04 - eSnips
Margadarsi 05 - eSnips
Margadarsi 06 - eSnips
Margadarsi 07 - eSnips
Margadarsi 08 - eSnips
Margadarsi 09 - eSnips
Margadarsi 10 - eSnips
Margadarsi 11 - eSnips

Comments

శ్రీపాద వారి 'మార్గదర్శి' కథ చాలా అద్భుతంగా వుంది! ఈ కథను నేను చిన్నప్పుడే చదివివుంటే నా జీవితమే మారి పోయి వుండేదేమో అనిపించింది! ఇంత చక్కటి కథను మీ గాత్రంతో పరిచయం చేసిన మీకు నా కృతఙ్ఞతలు. దీనిని మీరెంతో చక్కగా, నాటకీయంగా చదివారు. శ్రీపాదవారే (లేదా ఈ కథలోని చేబోలు శంబుశాస్త్రి గారే) పడక కుర్చీలో వెనక్కు వాలి తీరిగ్గా తన అనుభవాలను చెబుతున్నట్లుగా అనిపించింది. ప్రతి సన్నివేశమూ చక్కగా కళ్ళముందు కదిలింది. మీరు ఇలాగే ఇంకా కొన్ని ఆడియో కథలు అందించాలని ఆశిస్తున్నాను. ఈ ఆడియో ఫైళ్ళను నేను ఫైరుఫాక్సు లో డౌన్లోడ్ హేల్పెర్ ద్వారా eSnips site నుండి (mp3 files గా) డౌన్లోడ్ చేసి నా mp3 player లో పెట్టుకొని సమయం కుదిరినప్పుడల్లా విన్నాను, మళ్ళీ వింటున్నాను. ఇందులో జీవితానికి పనికి వచ్చే quotations కోకొల్లలు! నాకు ఈ కథ ఎంత నచ్చిందో వ్రాయాలంటే అది వ్యాఖ్య బదులు టపా అయ్యేలా వుంది. అంచేత ఇంతటితో ముగిస్తూ, మీకు మరొకసారి నా కృతఙ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను.
Kottapali said…
సత్యం గారు, ధన్యుణ్ణి. ఈ రికార్డింగు చేసి మూడేళ్ళు కావస్తున్నది. ఇంకొన్ని చక్కటి కథలు చెయ్యాలనే సంకల్పం. త్వరలోనే అందిస్తాను.
కొత్తపాళీ గారు, కధ అద్భుతంగా ఉంది...! మీరు చదివిన తీరు నా చిన్ననాడు విజయవాడ ఆకాశవాణిలో రేడియో శ్రవ్య నాటికలను విన్న క్షణాలను మరపుకు తెచ్చింది...! మీ ప్రయత్నం అభినందనీయం, రానున్నకాలంలో ఇలాంటి మరిన్ని కధలకు ఆడియో రూపం అందించగలరని ఆశిస్తున్నాము.
Kottapali said…
రాజేష్, నచ్చినందుకు సంతోషం. బైదవే, మరపు అంటే మరిచిపోవడం, జ్ఞాపకానికి వ్యతిరేకార్ధం :)
కొత్తపాళీ గారు, ఏదో ఆలోచిస్తూ వ్రాశాను. దానిని గుర్తించి చెప్పినందుకు కృతఙ్ఞతలు. :)