అయోమయం జగన్నాథం

మిమ్మల్ని అనడం లేదండీ, నన్ను నేనే అనుకుంటున్నా.

ఇంట్లో ఆఫీసుగదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నానా, ఏదో ఆలోచన మనసులో మెదుల్తుంది. అలా లేచి లివింగ్ రూములోకి వెళ్ళి అలమారు తెరుస్తాను. ఇంతాచేసి మొదటి ఆలోచన మెదిలి ఒక్క నిమిషం కూడా గడవలేదు. లివింగ్ రూములోకి ఎందుకొచ్చానో, ఆ అలమారు దేనికోసం తెరిచానో గుర్తుకి రాదు. ఇది మీలో చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది.

అసలే నాకు ఏ పని మీదనైనా ఏకాగ్రత తక్కువ అని చెప్పేసి మా ఆవిడ నాకు ADHD ఉన్నదని ఆరోపణ చేస్తూంటుంది. తను మాట్లాడే మాటలు వినడంలో ఈ జాడ్యం అసలు ఉన్నదానికన్నా కాస్త హెచ్చు స్థాయిలో పనిచేస్తుందని ఆవిడ అనుమానం. అఫ్కోర్సు, ఇది ఆవిడ ఆరోపణ కాబట్టీ, మనం మనం జెంటిల్మెన్ కాబట్టి, ఆవిడ ఆరోపణని నేను శాయశక్తులా ప్రతిఘటిస్తూ ఉంటాను. అంటే, మన పరిభాషలో వినిపించుకోనట్టు నటిస్తూ ఉంటాను.

కానీ ఈ జాడ్యం నిజంగానే ఉన్న ఛాయలు ఈ మధ్యన బలంగా కనిపిస్తున్నాయి.

కంప్యూటరు మీద ఏదో పని చేసుకుంటూ ఉన్నాను. అకస్మాత్తుగా గుర్తొస్తుంది, వారం రోజుల క్రితం మెయిలు రాసిన మిత్రుడికి సమాధానం రాయలేదు అని. ఎట్లాగూ సిస్టం ముందే ఉన్నాను గనక, చేస్తున్న పని ఆపి జీమెయిలు ఎకౌంట్లో లాగిన్ అవుతాను. మెయిలు తెరవంగానే కొత్తగా వచ్చిన మెయిల్లో బేంక్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఎదురుగా ఉండగానే చూసేస్తే మళ్ళి మరిచిపోయే ప్రశ్న రాదని పక్క టేబులో బేంక్ స్టేట్మెంట్ తెరిచి ఒకసారి లావాదేవీలన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసేస్తాను. ఎలాగూ బేంక్ ఎకౌంట్లోకి లాగిన్ అయ్యాను కదాని ఆ చేత్తోటే కేబుల్ బిల్లూ, గేస్ బిల్లూ, కరంటు బిల్లూ చెల్లింపులు వరసలో పెడదాం అనుకుంటాను. ఆ పని జరుగుతుండగా ఇటు పక్కన జీటాక్ లో ఆకుపచ్చ లైటు చూసిన మిత్రులెవరో పలకరిస్తారు. .. అలా .. అలా .. మేక తోకకు మేక తోక మేక మేకా తోక మేక ..

పాపం వారం రోజుల్నించీ ఎదురు చూస్తున్న ఆ మిత్రుడు .. అయ్యా అదీ సంగతి

Comments

మీరేం ఫికర్ చేయకండి మాస్టారు.. ఇ(మీ)లాటి వాళ్లు చాలామంది ఉంటారు. నాతో సహా...

ఎవరికో మెయిల్ చేయాలి అన్న విషయం కంప్యూటర్ ముందు ఉన్నప్పుడు కాక రాత్రి పదకొండు గంటలకు తినేటప్పుడు గుర్తొస్తుంది. ఒకోసారి మెయిల్ ఓపెన్ చేసి ఎవరికో ఏదో చెప్తానన్నాను. ఎవరబ్బా? అని గంట సేపు దాన్ని చూస్తూ కూర్చున్నా గుర్తురాదు. సదరు శాల్తీ ఎదురు చూసి చూసి చూసి తిట్టుకుంటూ (తెలీక అడిగితే స్టైల్ కొడుతుందని) మళ్లీ అడుగుతారు. అఫ్పుడు చేస్తున్న పని ఆపి మరీ ఆ పని పూర్తి చేసిన సంఘటనలెన్నో. ఇక ఇంట్లో ఇంతకంటే ఘోరం లెండి. వయసైపోయింది. మతిమరపు మామూలే. అడ్జస్ట్ ఐపోవాలి అని దాటేస్తుంటాను..:))
ఈ పరిస్థితి అందరికీ వచ్చేదే అనుకుంటాను. వయసుకంటే కూడా లెక్కకు మించి పనులు పెట్టుకున్నప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుందేమో
నండీ..ఓ పది రోజుల క్రితం బాగా అలోచించి ఈ విషయం మీద ఓ నిర్ణయం తీసుకున్నాను. ఒక పని పూర్తిగా అయ్యాకే అంటే క్లీన్ అప్ తో సహా రెండో పని మొదలు పెట్టడం. గుర్తొచ్చిన పని అర్జంట్ అయితే మరచి పోకుండా ఓ కాగితంమీడం రాయడం. కంప్యూటర్ మీద ఆ విండో ఈ విండోకి గెంత కుండా కుదురుగా కూర్చోవడం. ఇప్పుడు హాయిగా ఉంది.
:-) మాకూ ఇలాంటివి జరుగుతుంటాయండి.

తర్వాతేమో
తను మాట్లాడే మాటలు వినడంలో ఈ జాడ్యం అసలు ఉన్నదానికన్నా కాస్త హెచ్చు స్థాయిలో పనిచేస్తుందని ఆవిడ అనుమానం
ఇలాంటి కంప్లయింట్స్ కూడా మాకూ అలవాటేనండి ;-)
Anonymous said…
మీ టపా టైటిల్‌కీ ఇప్పుడు ఆడుతున్న ఒక సూపర్‌హిట్ సినిమాకీ ఏమైనా సంబంధం ఉందేమోనని నా డౌటు.
Anonymous said…
This is quite common.
ఇది అందరికీ మామూలే . ఇంకా నయం . అలవాట్లో పొరపాటుగా ఒకరి మెయిల్ ఇంకొకరికి ఇస్తూ ఉంటాను . మరీ ఘోరం కదా ?
ఇంతకీ నేనెందుకు వచ్చినట్టు ఇక్కడికి. కొంచెం గుర్తు చేస్తారా ?
అందరూ ఇది మాములే అంటున్నారు కాబట్టి ఇహ నేను నాకేమైనా అయ్యిందేమో నని దిగులు పడక్కరలేదన్నమాట :)
y.v.ramana said…
ఓస్! ఇంతేనా!
ఈ స్టేజ్ నేనెప్పుడో దాటేశాను.
ఈ స్థితిని 'అయోమయం జగన్నాధం' అనరాదు.
ఇది చిన్న చిన్న విషయాలని పట్టించుకోని 'మేధావి' స్థాయి!
Sai said…
భలే.. చెప్పారు..నేను చాలా సార్లు అంతే.. అందుకే ఈ మధ్య గజనీ బుక్ ఒకటి ఎప్పుడూ పాకెట్ లో ఉంచుకుంటున్నాను.. చెయ్యవలసిన పనులన్నీ ఎప్పటికప్పుడు రాసుకుంటూ, వాటిని పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నా...
మీకింకా నయం తర్వాత అయిన మరిచిపోయిన విషయాలు జ్ఞాపకం వస్తాయి.. నాకు అసలు అది కూడా రాదు...
మీ టపా బావుందండీ! నేను కూడా ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అయితే ఈ మధ్య కాలంలో Mindul living (living in the present moment) అనే టెక్నిక్ ను అలవరచు కొన్నాను. ఇది చాలా ఉపయోగకరంగా వుంది. Life is good and beautiful, once again!!
Zilebi said…
కొత్త పాళీ గారు,

ఇది చాలా భయంకరమైన వ్యాధి. మీరు వెంటనే ఎవరినైనా మాంచి డాటేరు ని కలిసి దీనికి వైద్యం చేసుకోండి. లేకుంటే ఈ వ్యాధి ముదిరి అయ్యో, మాయం జగన్నాధం గారు అయి పోయేదాకా వస్తుంది ! చాలా సీరియస్ గా చెబుతున్నాను సుమా

చీర్స్
జిలేబి.
శ్రీ said…
నేను కూడా మరిచిపోతూనే ఉన్నాను, కాకపోతే కాసేపటికి గుర్తు వచ్చేస్తున్నాయి. నేను మొదటి స్టేజీలో ఉన్నానేమో!
రసజ్ఞ said…
నాకు ఇది చదువుతుంటే ఇంటర్లో చదువుకున్న forgetting అనే పాఠం గుర్తుకొస్తోంది!
Kottapali said…
జ్యోతి, ఇది కేవలం మతిమరుపు విషయం కాదు. స్వల్పవ్యవధిలో జర్రిగే తమాషా అన్న మాట.

జ్యోతిర్మయి, మీ పద్ధతి బాగుంది.

భాస్కర్, కుటుంబరావులందరికీ జరిగే సత్కారాలే కదా ఇవి. :)
Kottapali said…
బోనగిరి, అమ్మో, ఉచ్చస్థితిలో ఉన్న డైరెక్టరునీ సినిమానీ మాట్లాడ్డానికి నేనెంతవాణ్ణీ? :)

కష్టేఫలే శర్మగారు, రాజేశ్వరిగారు, అంతేనంటారా? ఐతే వోకే.

బులుసుగారు, రోలొచ్చి మద్దెలతో మొరబెట్టుకున్నట్టుగా ఉంది వ్యవహారం.
Kottapali said…
మాలా, అందరూ బానే ధైర్యం చెబుతున్నారండీ. So it should be alrite.

yaramana, బాబ్బాబు, అలా మేధావి అని ప్రకటించే టీషర్టుల్లాంటివేమన్నా ఉన్నాయా?

సాయి .. హ హ హ. గజినీ బుక్కు, లిస్టులు నేను కూడ పాటిస్తానండీ పెద్ద విషయాలకి. నా బాధ అల్లా ఇలా స్వల్పవ్యవధిలో జరిగిపోయే చిన్న చిన్న విషయాల్లోనే.
Kottapali said…
సత్యం గారూ, యూ ఆర్ ద బాస్!

జిలేబి, డాక్టరు ఫోన్నెంబరు కోసం మీ వ్యాఖ్య వచ్చిన దగ్గర్నుండీ వెతుకుతున్నాను!

శ్రీ, మరికాస్త ముదరనివ్వండి. :)

రసజ్ఞ, గుర్తొచ్చింది అన్న మాట వాడారు అంటే మీరీ టపామీద కామెంటడానికి అనర్హులు! :)
Anonymous said…
"ఉచ్చస్థితి"

PERFECT.... KEKA....
Chandu S said…
కొత్తపాళీ గారు , చాలా బాగుంది.

సగం పని చేసి వేరే పని లోకి దూకే వేషాలు నాకు మాత్రమే తెలుసునని నిన్నటి వరకు విర్రవీగానే!