ఆంగ్లహారం

ఈ టపాకి శీర్షిక రాస్తుంటే భరతశాస్త్రంలో అసంయుక్త హస్తవినియోగం శ్లోకశకలం గుర్తొచ్చింది - సర్లెండి, ఆదిలోనే హంసపాదు. అసలు కథ మొదలెట్టకముందే పిట్టకథ అంటే జనాలు తంతారు గనక అసలు కథకొచ్చేద్దాం, ఈ మధ్యన హారం వారు కొన్ని మార్పులు, మరింత భారీగా చేర్పులు చేసేశారు వారి సంకలినికి. ముఖ్యమైన చేర్పేవిటయ్యా అంటే, నేరుగా ముఖపత్రంలోనే దేశీయ ఆంగ్లబ్లాగుల సంకలినిని ప్రదర్శిస్తున్నారు. దాంతో కొన్ని ఇబ్బందులెదురవుతున్నాయి. ఒకటి, తెలుగు బ్లాగ్లోకంలో ఏం జరుగుతున్నదో చూద్దామని బయల్దేరిన నా లక్ష్యాన్ని నేరుగా చేరుకోలేకపోవడం. సరే - కొద్దిగా ఆలస్యమైనా పరవాలేదు. అంతకన్న దారుణమైన ఇబ్బంది ఇంకోటున్నది. ఎదురుగా పేజీ ప్రత్యక్షమైతే చదవగలిగిన నాలుగు ముక్కలూ చదవకుండ వొదిలిపెట్టముగదా. ప్రత్యక్షమైన పేజీని కనులు స్కాన్ చేసే నాలుగు క్షణాల్లోనే ఏదో ఒక ఆంగ్లటపా శీర్షిక ఆ కళ్ళని ఆకర్షిస్తున్నది. ఆ లంకెని నొక్కడం - అరె, వీళ్ళెవరో భలే రాశారే అనుకోవడం, బుక్ మార్కు చేసుకోవడం. తెలుగు బ్లాగుల్లోకి వెళ్ళాలనే ఆలోచన గోవిందా గోవింద. అయ్యా, అదీ సంగతి. హారం వేపు వెళ్తే మాత్రం తస్మాత్ జాగ్రత. (మనలోమాట, ఆంగ్లంలో రాస్తున్న జనాభా మా పసందుగా రాస్తున్నారుకూడా!) ఈ తప్పటడుగుల్లో (పక్కటడుగుల్లో??) నేను కనుగొన్న కొన్ని ముత్యాలు (ఆణివో కాదో మీరే చెప్పాలి) http://eternalwanderingsoul.com/ http://sujathasathya.blogspot.com/ http://karvediat.blogspot.com/ http://kranjani.wordpress.com/2011/07/30/ http://whataworldagain.wordpress.com http://www.sandeepweb.com/ http://dearpseudodiary.blogspot.com/ http://debolinasbooks.blogspot.com/

Comments

ఏమైనా తెలుగుకే మా ఓటు .అందుకే నేను నా బ్లాగులో తెలుగు హారాన్ని లింక్ ఇచ్చి పెట్టాను. ఆంగ్లం వెళ్ళాలనుకున్నప్పుడే వెళ్ళవచ్చని......:-)
Anonymous said…
ఆంగ్లహారం(అగ్రహారం లాగా) అనే మాంచి పేరుతో మీ దగ్గరకి లాక్కొచ్చి, అక్కడ కొన్ని లంకెలిచ్చి, అటు పంపిచ్చి, అటుపై చదివించి
ఆపై మరో లంకె చదివించి.. నేను తేరుకుని మీ టపాకి వ్యాఖ్యానించే సరికి తెలియకుండానే అరగంటయ్యేలా చేశారు.
కానీ కొత్త బ్లాగులు భలే పరిచయం చేశారండీ.
Unknown said…
అసంయుక్త హస్త వినియోగం శ్లోక శకలాన్ని అందించకుండానే పోస్టును ముగించేసారే. గురువు గారూ, మీ వల్ల స్ఫూర్తిని పొంది భరతనాట్యాచార్యుల్ని వెదకి పట్టుకొని సామర్లకోటలో భరతనాట్యం నేర్చుకుంటున్న మా బోంట్లకు అసంతృప్తిగా ఉండదా ?
తృష్ణ said…
లింక్స్ అన్నీ అన్నీ చూసేసాం..:)) eternalwanderingsoul బ్లాగ్ చాలాబాగుందండీ. ఫోటోస్ సూపర్ అసలు. చాలా థాంక్స్.
నేనూ ఆ మధ్యన కొన్ని ఆంగ్ల బ్లాగ్ లింక్స్ సేవ్ చేసాను. ఎక్కడ దాచానో గుర్తురావట్లే...:((
@నరసింహగారు .. అమ్మబాబోయ్, టపాని ఇంత నిశితంగా చదివే పాఠకులున్నారంటే మహదాశ్చర్యానందాలు ముప్పిరి గొలుపుతున్నాయి. చాలా సంతోషం మాస్టారూ. ఇక సామర్లకోటలో నాట్యాభ్యాసం అన్నారు, దాంతో గుండె తదోం తోం తక తిల్లానా చేసేసింది. మరి మీ నాట్యాభ్యాసం విశేషాలు ఎక్కడన్నా రాస్తున్నారా లేదా??
ఇక శ్లోకశకలం - సరిగ్గా గుర్తు లేదు - పతాకహస్త వినియోగంలో "..హార అంగరాగకే" అని వస్తుంది.

@తృష్ణ .. చదవడమంటే ఆసక్తి ఉన్న వారికి ఈ హారం నిజంగా వ్యసనమే :)
Anonymous said…
బాపట్ల తో అనుబంధం వున్నా వారు ఎవరైనా నాకు ఆత్మీయులే. ప్రస్తుతం పూనా లో వున్నా అప్పుడప్పుడూ వెళుతూనే వుంటాను.మీరు పరిచయం చేసిన బ్లాగులని చదవాలి. నిజమే.హారం చదవడం వ్యసనము అయ్యింది నాక్కూడా.