న్యూయార్కులో నాట్యోత్సవం

న్యూయార్కు చుట్టుపక్కల ఉండే మిత్రులకి, నడి ఆగస్టులో న్యూయార్కు ప్రాంతాల పర్యటించ దల్చిన మిత్రులకి మహదవకాశం.

ఆగస్టు 13 నించీ 20 దాకా న్యూయార్కు మన్హాటన్‌లో నాట్యోత్సవం జరుగుత్న్నది.

మలేషియాకి చెందిన ప్రముఖ ఒడిస్సీ నాట్యకారుడు రాంలీ ఇబ్రహీం బృందం ఈ ఉత్సవంలో ఒక ప్రత్యేక ఆకర్షణ.

రాంలీగారి ప్రదర్శనలు నేను ఇదివరకు కొన్ని చూశాను. స్వయంగా అద్భుతమైన నాట్యకారుడే గాక, బృందంతో ఇచ్చే ప్రదర్శనలలో అద్భుతమైన ఎఫెక్ట్స్ సృష్టిస్తాడీయన. అంచేత ఏ మాత్రం వీలున్నా ఈయన ప్రదర్శనలు చూడండి.

ఆగస్టు 16 న న్యూయార్కు ప్లాజాలో

ఆగస్టు 20 న Dance New Amsterdam అనే చోట.

మరిన్ని వివరాలు కింది బొమ్మలో.

Comments

కొత్తపాళీ గారూ : నమస్తే!

మొన్న పాలపిట్ట సంచికలో మీరు రాసిన కథలు చదివాను. నేటివిటీ చెడకుండా ఎంతో అందంగా రాసారు. చదివాకా మీ పేరు చూసి, "తోటి బ్లాగర్, నాకు తెలుసు" అని ఇంట్లో చెప్పుకుంటుంటే గమ్మత్తుగా అనిపించింది. అలా ఆశ్చర్యానికి గురి చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకునేందుకు, అలాగే మరిన్ని కథలు రాస్తూ ఉండమని అర్జీ పెట్టుకునేందుకు ఇటు వైపుగా వచ్చాను. :)
మానసగారు, మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.