పోయినేడాది పెరటి వ్యవసాయం చిన్న యెత్తున చేసినా పెద్దయెత్తున సక్సెస్ కావడంతో ఈ సారి కార్యక్రమం భారీ అంచనాలతో మొదలు పెట్టాను. జూలై మొదటి వారానికి అసలు మొత్తం నీరు కారిపోయేలా అనిపించింది. ఏమైందో మొత్తానికి గత రెండువారాల్లో మొక్కలన్నీ కొత్త ఊపిరి పోసుకున్నట్టున్నాయి, తోట ననవలాడుతోంది. ఒక గొప్ప నిరాశ - గోంగూర అస్సలు రాలేదు. అవి పోయిన యేటి గింజలు మరి - పాతబడితే ఇక రావేమో?? చిక్కుడూ కూడా సరిగ్గా పెరగలేదు, అవి కొత్తగా ఈ దేశంలో కొన్నవే మరి. ఈ సారి మాతోటకి మెయిన్ ఎట్రాక్షన్ తలకిందుల టొమేటో మొక్కలు. మొక్కలు బాగానే ఉన్నాయ్ - చూద్దాం కాపెలా కాస్తుందో.
జూలై నెల అంతా ఎండలు బాగా కాశాయి - ఇంకా కాస్తున్నాయి.
మిషిగన్‌లో వసంతం సూచన ప్రాయంగా చివురించినప్పటినించీ మళ్ళీ మంచు కురిసేవరకూ రకరకాల పూలు వంతులేసుకుని కనులవిందు, నాసికలకి విందు చేస్తుంటాయి. ప్రస్తుతం లిల్లీల హవా నడుస్తోంది. అందులోనూ టైగర్ లిల్లీలని ఉంటాయి, ఒకలాంటి చెంగావిరంగు రేకలతో - ఎక్కడబడితే అక్కడ రోడ్ల వెంట పూస్తాయి. అవి అలా పక్కనుంటే రోడ్డు కనకాంబరం రంగు జరీతో ఉన్న ముదురునీలం పట్టుచీరలా ఉంటుంది. మా యింటిముందు వేసిన పది లిల్లీ మొక్కల్లో ఎనిమిదింటిని లేళ్ళు, కుందేళ్ళు తినేశాయి. రెండిటిని మాత్రం వెయ్యి కళ్ళతో కాపాడుకొస్తున్నా.
సంగీతం ఒక మోస్తరుగా వింటున్నా. మోహినీభస్మాసుర ట్రూపుతో టూరుకి వెళ్ళలేకపోయా పని వత్తిడి వల్ల. పక్క వూరికి వెళ్తేనైనా కాస్త హాల్లో కూర్చుని చూసే అవకాశం వస్తుందేమోనని ఆశపడ్డా, కుదర్లేదు, ప్చ్. కానీ ఆయా ఊర్లలో ఉన్న మిత్రులందరూ నా పోరు పడలేక వెళ్ళి చూసొచ్చి అద్భుతంగా ఉన్నదని చెబుతున్నారు. ఇంక ఒకే ఒక ప్రదర్శన మిగిలి ఉన్నది ఆగస్టు 13న షికాగోలో - ఆరోరాలోని దేవాలయంలో జరుగుతుంది.
నవల్లు చదివే ఓపిక లేదు, అంత టైము కమిటయ్యే తీరిక లేదు. అందుకని ప్రస్తుతానికి సాహిత్య పత్రికల్లో చిన్న చిన్న కథలు చదువుతున్నా. ఏదేవైనా ఈ అమెరికా పత్రికల్లో కథల తీరుకీ, మన కథల తీరుకీ చాలా తేడా ఉంది. ఇక్కడి కథలన్నీ జీవితమనే చలన చిత్రంలో ఇక స్టిల్ ఫొటో తీసినట్టు ఉంటాయి. సందేశాలూ పాడు ఉండవు. ట్విశ్తులు, ఉద్వేగాలూ కూడా పెద్దగా ఉండవు. SUN అని పత్రిక ఉంది. అందులో కథలు నాకు బాగా నచ్చుతాయి. మీకు దగ్గర్లో పబ్లిక్ లైబ్రరీ ఉంటే అందులో ప్రయత్నించి చూడండి. నచ్చితే చందా కట్టి తెప్పించండి.
తానా సావనీరు కాపీ పంపించారు సంపాదకులు. కంటికింపుగా బావుంది. ఎత్తీ దించీ చేస్తే బైసెప్సుకి మంచి వర్కవుటు కూడా అవుతుంది. ఇంకా లోతుగా చూళ్ళేదు.
ప్రస్తుతానికి ఇదీ ప్రోగ్రెస్.

Comments
:)
చిన్న డౌటు అమెరికా చలిదేశం కదా. ఆ నేలలో మన సైడు పంటలు ఎలా పండాయండీ.
కథల మీద మంచి ఆబ్జెర్వేషన్.
...బాగుందండీ పోలిక.. సావనీరుతో వ్యాయామం కూడా :))
రోడ్డు కనకాంబరం రంగు జరీతో ఉన్న ముదురునీలం పట్టుచీరలా ఉంటుంది.
ఇప్పుడు మా వారికి టెండర్ పెట్టాల్సిందే.. వచ్చేది శ్రావణమాసం, పండగ సీజన్ కూడా సంక్రాంతి వరకు..
కల్పన, మీ ఆస మరీనండీ. జూలైకే పంట రావాలంటే ఎలా? అవి కాయాలే గాని, మీకంటే ఎక్కువా?
మురళి, మీరు లిల్లీల హవా లో శ్లేష పట్టుకుంటారనుకున్నాను.
మందాకిని :)
తృష్ణ. అవునుతల్లీ అవును. ఈ లేళ్ళతో కుందేళ్ళతో బాధ ఇంతింత కాదు. చూడ్డానికి ముద్దుగానే ఉంటాయిగానీ.
జ్యోతి, లిల్లీ ఫొటో పెట్టానుగా. తోట ఫొటోలు అప్పుడే కాదు. సీజన్ చివర్లో.
భలే చెప్పారండి. కొన్ని సినిమాలు కూడా అలాగే వుండి, అప్పుడప్పుడు కొంచెం చిరాకు తెప్పిస్తాయి - ఎలా అర్ధం చేసుకోవాలో, ఎలా ముగించుకోవాలో తెలియక.
@విరిబోణి, తెలుగుని తెలుగులిపిలో రాయమని మనవి.
@వర్మ, :)
శారద
అయితె తానా వాళ్ళ పుస్తకం మీకు బాగా
ఉపయోగపడింది అన్న మాట....హ...హ...
Please see this
http://www.imdb.com/title/tt0478304/
If you have stomach for experimental and weird (not scary or anything, but still weird), you might try it. :)
@మాల, మా పెరట్లో కూడా మట్టి బాగుండదు. కాకపోతే, ఇక్కడ షాపుల్లో ఎరువు కలిపిన మట్టి సంచుల్లో అమ్ముతాడు. అవొక డజను సంచులు తెచ్చి కుమ్మరించేప్పటికి బాగానే పెరుగుతున్నాయి. అసలు ఆక్కూరలు అడివిలాగా పెరుగుతాయే, ఎందుకు పెరగటం లేదబ్బా?
@Sasi - true.