తెలుగునేలని తొలకరిజల్లులు తడిపిన శుభసందర్భంలో ఈ మధ్యన పలువురు బ్లాగ్మిత్రులు అక్షరాల జల్లులు కురిపించారు తమతమ బ్లాగుల్లో.
మా దేశంలో, మేం నివాసముండే చోట తొలకరి అంటూ లేదు. ముందు గ్రీష్మతాపం అటుతరవాత వర్షపాతం తాపహరణం మా వూళ్ళొ జాన్తా నై. సంవత్సరం పొడుగునా దానిష్టం వచ్చినప్పుడు కురిసిపోతూ ఉంటుంది.
ఇవ్వాళ్ళ సాయంత్రం ఓ నాలుగుమైళ్ళు నడిచొద్దామని బయల్దేరాను. ఇల్లు ఇంకా ఒక మైలు దూరంలో ఉండగా ముందు గాలి దుమారం మొదలైంది. దాని వెంట మెల్లగా చినుకులు మొదలైనై. చిరుజల్లు కాస్తా జడివానగా ఎదగడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఇల్లు చేరేసమయానికి ఆపాదమస్తకం తడిశాను. తడుస్తూ నడుస్తూ ఉంటే శంకరమంచివారి అమరావతికథల్లో వానకథ గుర్తొచ్చింది. కానీ నా చుట్టూ పంటపొలాలూ లేవు, ఎదురుగా ఆమడదూరంలో కృష్ణానదీ లేదు, వాన చినుకులు కృష్ణలో పడుతుంటే నదివొంటిమీద రేగుతున్న పులకలూ లేవు.
కానీ లోపల్లోపల ఎక్కడో ఉంది కృష్ణ.
ఈ మాత్రం వానలో తడిసి చాలా ఏళ్ళయింది.
మనసులో కృష్ణ పులకరించింది.

Comments
ఇప్పుడు అసలు విషయమేమిటంటే, స్వాతి తిరునాళ్ రాసిన "అలివేణీ ఎందు చెయ్వు.." పాట గురించి మన బ్లాగర్లలో ఎవరి బ్లాగులోనో రెండేళ్ళక్రితం చదివి, ఆ లింకు ద్వారా ఆ పాట(పాడింది: చిత్ర)ను విని తరించాను. డౌన్ లోడ్ చేసుకున్నానుకూడా. ఇవాళ మీ పోస్టులన్నీ చదివిన తర్వాత ఆరోజు స్వాతి తిరునాళ్ పాట గురించి రాసింది మీరే అయిఉంటారనుకుంటున్నాను. అది మీరేనా, కాదా తెలుపగలరు. ఒకవేళ కాకపోతే, ఆ పాట గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలనిఉంది...తెలుపగలరా?
వివిధ కారణాలవల్ల బ్లాగువేపు చూడలేకపోయాను అప్పణ్ణించీ.
@ తేజస్వి, మొదటీ విషయం - దయచేసి గురువుగారని పిలవొద్దు. రెండో విషయం - అలివేణి యెందు సెయ్యుం నా ఆల్‌టైం ఫేవరెట్స్‌లో ఒకటి. చిత్రకి ముందు సుశీల పాడారు ఒక మళయాళ సినిమాలో. అన్నిటికంటే సూపరు స్వర్గీయ కేవీ నారాయణస్వామి గారి వెర్షను. ఎక్కడుందో వెతకాలి. దీన్ని గురించి నేనెక్కడన్నా రాశానేమో గుర్తు లేదు. వీలు చూసుకుని, మళ్ళీ ఓ పదిసార్లు విని రాస్తా త్వరలో. ఇవ్వాళ్తి మీ వ్యాఖ్య మరోసారి నా గుండె మీద అమృతపు జల్లు కురిసి మరో చిలకరింత-పులకరింత కలిగించింది!!! THANK YOU!!!