ఈ శనివారమే

ఏవిటి విషయం?
మోహినీ భస్మాసుర - కూచిపూడి నృత్యనాటకం జరుగుతోంది. దీన్ని డిట్రాయిట్ తెలుగు సమితివారు (DTA) సమర్పిస్తున్నారు.

ఎవరెవరు వేస్తున్నారేవిటి?
కూచిపూడి నాట్యాచార్యులు, శ్రీ హరి రామమూర్తిగారు భస్మాసురునిగా నటిస్తున్నారు.
మోహిని ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్సు.
ఇంకా భారత్ నించీ, అమెరికాలో వివిధ నగరాలనించి ఇరవైమంది నర్తకీనర్తకులు ఈ ప్రదర్శనలో వివిధ పాత్రలు పోషించనున్నారు.

మోహినీ భస్మాసుర చాలాసార్లు చూశామండీ, దీని గొప్ప ఏవిటట?
ఇది పూర్తిగా కొత్త సృష్టి.
సాహిత్యం, సంగీతం, నాట్యం - మూడు మూర్తులా పాత కథకి కొత్తరూపాన్ని తెచ్చాయి. పైగా, హరి రామమూర్తిగారు వెంపటి చిన్నసత్యం మాస్టరుగారి అగ్రశ్రేణి శిష్యులలో అగ్రగణ్యులు. ఆయనే మొత్తం నాటకానికి నాట్యరచన చేశారు. పైగా స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.
ఒక్ఖ మాటలో చెప్పాలంటే - ఈనాటి కూచిపూడి రంగస్థలం అందిస్తున్న ఉత్తమోత్తమైన నాట్యప్రదర్శన ఇది.

అబ్బ, మీరు మరీ నోరూరించేస్తున్నారండి. ఎక్కడా, ఏరోజు, ఎన్నింటికి, ఈ వివరాలు కూడా చప్పున చెప్పండి మరి!

ఈ శనివారం, జూన్ 25 తారీకున.
సాయంత్రం 4 గంటల నుంచీ

Southfield-Lathrup High School
19301 W 12 Mile Rd
Lathrup Village, MI 48076-2557

మరిన్ని వివరాలు DTA Websiteలో

Mohini Bhasmasura
Grand Kuchipudi Dance Ballet
Starring world renowned master, Sri Hari Ramamurthy as Bhasmasura
Featuring more then 20 talented dancers from India and the USA.
Southfield-Lathrup High School
19301 W 12 Mile Rd
Lathrup Village, MI 48076-2557

Click Here For DETAILS

Comments

బాగు బాగు. మరి మీరు కూడా ఇందులో పాల్గొంటున్నారా అది చెప్పండి. ఒకవేళ అవును ఐతే కార్యక్రమం తర్వాత విశేషాలు, వీడియోలు గట్లా పంచుకోవాలని ఘాట్టిగా కోరుకుంటున్నాము.. (ము అంటే మరికొందరు బ్లాగర్లను కూడా కలిపేసాలెండి)
శ్రీ said…
తప్పకుండా వస్తాం.
జ్యోతి, పాల్గొనడం అంటే చాలా అర్ధాలున్నాయి. నేను నాట్యం చెయ్యడం లేదు :(
శ్రీ, వస్తాము అంటే సరిపోదు. మీ భుజస్కంధాలమీద చాలా బాధ్యత్లు మోపుతున్నాను! :)
శ్రీ said…
తప్పకుండా, మా వంతు కృషి మేము చేస్తాం.
మురళి said…
మోహిని మీరేనేమో అని అనుమానిస్తూ వ్యాఖ్య రాయబోతుండగా మీరేమో 'నేను నాట్యం చేయడం లేదు' అనేశారు... వారాంతం అంతా బిజీ బిజీ అన్నమాట!!
మురళిగారు, పాండవోద్యోగం పడకసీను చూశాకు కూడా మీరిలాంటి జోకులెయ్యడం బాలేదు :) మా డిట్రాయిట్ జనాలు బతికుండాలా అక్కర్లేదా?
ఇందు said…
తప్పకుండా వస్తాం :) మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసా!! :) ఇక వారివారి ఇష్టాలను బట్టి అన్నమాట! :)
Anonymous said…
కొత్తపాళీ గారూ,

ఈ నాట్య బృందం వారు, బే ఏరియాలో కూడా ఈ నాట్య ప్రదర్శన చేసే ప్లాను వుందా? మీకా వివరాలు తెలిస్తే, నాకు తెలియజేస్తే, తప్పకుండా ఈ ప్రదర్శనకి వెళతాను. చాలా కాలం కిందట, వెంపటి చినసత్యం గారి బృంద ప్రదర్శన ఒకటి జరిగింది. చాలా బాగుంది.

ప్రసాద్‌
@ ప్రసాద్. ప్రస్తుతానికి బే ఏరియా ప్లాను లేదండి. ఏమన్నా మారితే తెలియజేస్తాను. ఇతర నగరాల వివరాలు కూడా త్వరలో తెలియజేస్తాను.