మధ్యాహ్న భోజనం పూర్తయ్యి ఒకింత భుక్తాయాసంతో కన్నులరమూత పడుతున్న సమయంలో వేకువకీ సుషుప్తికీ మధ్య తెలివి ఊగిసలాడుతున్న స్థితిలో వీచికలుగా ఏవేవో పాత ముచ్చట్లు తోచాయి.
అలా గుర్తొచ్చాడు ప్రవీణ్.
గబుక్కున మెలకువొచ్చింది. వెదికితే దొరికింది అతని బ్లాగు. ఎక్కడికీ పోలేదు అక్కడే భద్రంగా ఉంది. పెళ్ళి చేసుకుని బ్లాగురాయడం మానేసినవారిలో ప్రవీణు కూడ ఒకరు. ఆ రోజుల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ కి సంబంధించిన సాంకేతిక విషయాలమీద సరళమైన తెలుగులో మంచి టపాలు రాస్తుండేవాడు.
ఇంచుమించుగా వొంటిచేత్తో ప్రవీణ్ సాధించిన ఘనకార్యం మరోటి ఉంది.
అదే తొలి తెలుగు బ్లాగు పుస్తకం.
ప్రవీణ్ మళ్ళీ తెలుగులో రాస్తుంటే బాగుణ్ణు.

Comments
చాలా బాగుందండీ ఆ బ్లాగ్పుస్తకం, మీ జగమంతకుటుంబం నాది విమర్శ, వేటూరి జగణాల అలైపొంగెరా ప్రశంస..,తోటరాముడూ..దినకర్..బినీతా..,రానారె తాతగారి అమితోపాఖ్యానం నాకు తెలుగులో బ్లాగులున్నాయని ఆంధ్రజ్యోతి ఆదివారం ద్వారా తెలిసినదగ్గర నుంచీ ఎక్కువగా చదివిన టపాలు.
ఈ పుస్తకం లోనే మొదట పరిచయమైన..నుడికారం టపా(రానారేది) లాంటివి చాలా నచ్చాయి.
చల్లకొచ్చి ముంత దాచేదేముంది కానీ ఇలాంటి పుస్తకాలు ఇంకేమైనా ఉన్నాయా?
--సూరంపూడి పవన్ సంతోష్
నాకు తెలిసి ఇంకో మూడూ వచ్చాయి - ఒకటి మధురభావాల సుమమాల రమణిగారు తన బ్లాగు టపాలన్నీ ఒకటిగా ప్రచురించారు.
ఇంకోటి ఏడాది రెండేళ్ళ కిందట కొందరు మిత్రులు నా బ్లాగులో తమకి నచ్చిన టపాలు కొన్నిటిని సేకరించి నాకు బహుకరించారు.
ముచ్చటగా మూడోది మొన్నటి జనవరి ఒకటికి మధురవాణిగారు తన నెచ్చెలితోకలిసి కొత్తసంవత్సరం అనే అంశం మీద అనేకబ్లాగర్ల టపాలు, రచనలు కవితలు చేర్చి ప్రచురించారు.
ఇంకా ఏమైనా ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయేమో పైన కామెంటిన జ్యోతిగారికి తెలుస్తుంది.
అసలు ఏడాదికోసారి, డిసెంబర్లో జరిగే తెలుగుబ్లాగర్ల దినోత్సవం సందర్భంగా - Best of Telugu Blogs Annual - ప్రచురిస్తే బావుంటుంది. ఔత్సాహికులెవరన్నా ముందుకొచ్చి నడుం బిగిస్తే బాగుంటుంది.