శివానందరూప శివోహం

వేదమూర్తులు శ్రీ చల్లకీరె సోదరులు "పరాత్పరా పరమేశ్వరా" పేరిట పఠించిన నమకచమక పారాయణకు ముందుమాటగా బ్రహ్మశ్రీ కళింగకృష్ణగారు ప్రవచించిన ఆంగ్ల భాష్యానికి నా తెలుగు సేత.

శ్రీరుద్రభగవానునకు నమస్కారములు.

ఆ పరమశివుడు జగద్గురువు శంకరాచార్యులుగా అవతారమెత్తియున్నప్పుడు చేసిన బోధలలో మనలను వేదాధ్యయనము నిత్యకృత్యముగా సలుపమని చెప్పినాడు.
వేదో నిత్యమధీయతాం!

రుద్రాధ్యాయమనే ఈ నమకచమక ప్రశ్నములు వేదంలో కర్మకాండను బోధించే యజుర్వేద భాగాలు. ఈ రుద్రాధ్యాయము దైనందిన పారాయణకు ప్రత్యేకంగా నిర్దేశింపబడినది.

స్వశాఖోపనిషద్గీతా విష్ణోర్నామ సహస్రకం
రుద్రంచ పౌరుషం సూక్తం నిత్యమావర్తయేత్ బుధః

ఈ రుద్రాధ్యాయమును శతరుద్రీయము అని కూడా అంటారు. పరమాత్ముడు ఒక్కడే అయినా వందల వేల రూపాల్లో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. జాబాలోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షిని ఆయన శిష్యులు అడిగారు - ఏ మంత్రాన్ని నిష్ఠతో, అర్ధము తెలిసి నిత్య పారాయణ చేస్తే మానవునికి ముక్తి దొరుకుతుందని ప్రశ్నించినప్పుడు ఆ మహర్షి "శతరుద్రీయేణ!" అని సమాధాన మిచ్చాడు.

ఈ రుద్రాధ్యాయము వేదంలోని కర్మకాండల విభాగానికి సంబంధించినది అయినా, అనేక కర్మవిధులను నిర్దేశించే కల్పము "శతరుద్రీయం జుహోతి!" అని సూచించినప్పటికీ, దీనిని (ఈ రుద్రాధ్యాయాన్ని) విజ్ఞులు ఉపనిషత్తుగా (వేదంలో ఆధ్యాత్మిక తత్త్వబోధ చేసే భాగం) మన్నిస్తున్నారు. వేదాలకి మహాభాష్యాలు రాసిన సాయణాచార్యుడు ఇలా చెబుతున్నాడు.
కర్మప్రకరణే పాశాత్ కర్మాంగత్వ మిహేష్యతే
జ్ఞాన హేతుత్వమప్యస్య సర్వోపనిషదీరితం
ఇలా శతరుద్రీయం ఉపనిషత్ అని నొక్కి చెప్పాడు.
ఎందుకంటే రుద్రాధ్యాయం ఆ పరమేశ్వరుని విశ్వరూపత్వాన్ని సర్వాంతర్యామిత్వాన్ని మరల మరల విశదపరచడమే కాక, "సర్వం ఖల్విదం బ్రహ్మ" (ఇదంతా కూడా బ్రహ్మమే!) అనే ఉపనిషద్వాక్యాన్ని అంతులేని స్వరూప ఉదాహరణలతో నిర్వచిస్తున్నది.

రుద్రాధ్యాయాన్ని అర్ధం తెలిసి నిష్ఠతో, శ్రద్ధతో పారాయణ చేసే వారు తమకు తాము ఆత్మశక్తిని వృద్ధి చేసుకోవడంతో పాటు తాము నివసిస్తున్న సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతారు.
రుద్రాధ్యాయీ వసేత్ యత్ర గ్రామేవా నగరేపివా
నతత్రత్ క్షుత్పిపాసా దుర్భిక్షా వ్యాధియోపచా - అని ఆర్యోక్తి

అంత మహిమాన్వితమైనది ఈ శతరుద్రీయం.
***
శ్రీకాళహస్తి మహత్యం పాత సినిమానుండి కొన్ని దృశ్యాలు

అర్జునుడి కథ
మహేశా పాపవినాశా
పార్వతీదేవి
దండకం
***
ఈ రోజు మహాశివరాత్రి మహా పర్వదినం. వీలుంటే శివాలయానికి వెళ్ళి, చేతనైతే సస్వరంగా నమకచమకాలు పారాయణచేసి పరమశివునికి అభిషేకం చేసుకోండి.
లేదంటే కనీసం ఓం నమశ్శివాయ అనుకోండి.
అందరికీ శివకటాక్షం సిద్ధించుగాక!
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.
తథాస్తు.

Comments

శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
చక్కటి టపా వేసారు.

ధన్యవాదాలు
బ్లాగులందు తెలుగు బ్లాగులు మేలయా అని చెప్పి తెలుగులో రాయకుండా ఇంకేదో బాషలో రాసారేంటి అండి .. :)
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి మహా శివ రాత్రి శుభాకాంక్షలు.
గిరీష్, మీ మేలము అర్ధం కాలేదు. ఈ టపాలో భాష మరీ గీర్వాణంగా ఉందా?
ala kadandi, naku ardam kaledu ani cheppataniki ala rasanu..dont take otherwise..mee tapaa ni comment chese anthatonni kadu nenu.:)
గిరీష్, పర్లేదండి. మీరు చెప్తేనేకదా నాకూ తెలిసేది. అక్కడికీ మొదట రాసిన ప్రతినించి భాషని కొంత సరళంగా తిరగరాశాను. మళ్ళీ చూస్తాను ఇంకా సరళీకరించగలనేమో. కొటేషన్లు సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి వాటిని అలాగే ఉటంకించాను.
SRRao said…
కొత్తపాళీ గారూ !
మంచి టపా. మీకు, మీ కుటుంబానికి మహాశివరాత్రి పర్వదినా శుభాకాంక్షలు.
Vasu said…
"దంతి కోటి సహశ్రేషు, అశ్వమేవ శతకృతౌ;
కోటి కన్యా మహా దానం, ఏక బిల్వం శివార్పణం. "

"చెంబేడు నీళ్ళు పోస్తే ఖుష్
చిటికెడు బూడ్డే పూస్తే బస్ "

మీకు మహా శివరాత్రి శుభాకాంక్షలు

మీ ఆరాధ్య దైవం శివుడనుకుంటా.
rākeśvara said…
మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం