తెలుగు పుస్తకానికి ఒక కొత్త పేజీ - కినిగె


సుమారు రెండు మూడు సంవత్సరాలుగా అమెరికాలో ఈ-పుస్తక దర్పణాల (e-book readers)గురించి బాగా చర్చ జరుగుతూ వస్తున్నది. మామూలుగానే పుస్తకాల అమ్మకాలు బాగా తగ్గిపోతున్నాయి. పబ్లిషరు కంపెనీలు ఏవీ లాభాల బాటలో నడవడం లేదు. ఒక పక్కన ముద్రణ ఖర్చులు పెరుగుతూండగా, పైపెచ్చు కాగితం కోసం చెట్లు ధ్వంసం చెయ్యడం పట్ల వ్యతిరేకత - వెరసి, పుస్తకాల ముద్రణా వ్యాపారాలు మునుపెన్నడూ లేనంత క్షోభకి గురవుతూ ఉన్న స్థితిలో, ఈ ఈ-పుస్తక దర్పణాలు పుస్తకాల వ్యాపార స్వరూపాన్నే మార్చివేస్తున్నాయి.

తెలుగునాట ముద్రణ సంస్థలు, పంపిణీ సంస్థలు అన్నీ కూడా ఉన్నంతలో ఒక కుటుంబం బతికేందుకు కావల్సిన ఆదాయాన్ని ఇవ్వగలిగినాయే తప్పించి ఒక ఇండస్ట్రీగా ఈ రంగం అభివృద్ధి చెందలేదని నవోదయ పబ్లిషర్సు అధినేత రామ్మోహనరావుగారు ఒక ముఖాముఖిలో చెప్పారు. పుస్తకాలు కొనడవా? బార్బేరియస్! అనే జాతి మనది. ఇదిలా ఉండగా, పుస్తక ప్రియులకైనా - కొన్న పుస్తకాలు చెదలు పట్టి పోతుండడమూ, మనపిల్లలకి సరిగ్గా తెలుగు చదవడమే రాదే, ఇంక ఈ పుస్తకాల్ని ఎవరు పట్టించుకుంటారు అనే ఆందోళన - అయినా మనసాగలేక ఏదో ఒక పుస్తకం కొంటూనే ఉంటాం.

ఇలాంటి ఆందోళనలన్నిటికీ ఒకే సమాధానంగా తెలుగు పుస్తక పంపిణీ స్వరూపాన్ని మార్చివేస్తూ పుస్తకప్రియులని అలరించేందుకు ముస్తాబై ఉన్నది కినిగె. ఈ పుస్తకాల గూడు కంటికింపైన పుటల అమరికతో, కంప్యూటారుకి కొత్త అయిన వారు కూడా సులభంగా వాడుకోగలిగేట్టు ఉన్నది. ధరలు కూడా చాలా సరసంగా ఉన్నాయి.

పాఠకులకి సదుపాయాలు:
ఈ-పుస్తకాన్ని కొనుక్కోవచ్చు, లేదా 30 రోజులకి అద్దెకి తీసుకోవచ్చు.
బేంక్ ఖాతా, ఆన్‌లైన్ ఖాతా (పేపాల్ వంటివి), లేదా క్రెడిట్ కార్డు ద్వారా మీ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
మీ కోసమే కాదు, కంప్యూటరు లేదా హస్తభూషణాలు (అదే, PDA) ఎక్కువగా వాడే మీ బంధుమిత్రులకి బహుమతిగా ఇవ్వచ్చు.
ఆర్డరు చేసి పుస్తకం పోస్టులో రావడం కోసం వేచి ఉండక్కర్లేదు. మరుక్షణమే పుస్తకం అందుబాటులో ఉంటుంది.
అప్పుడే నలభైకి పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

పుస్తకాలు కొనుక్కోవడమే కాక మీరింకా ఏం చెయ్యొచ్చు?
మీరే గనక రచయిత అయితే మీ పుస్తకాన్ని కినిగె. ద్వారా పంపిణీ చెయ్యొచ్చు.
మీ బంధుమిత్రుల్లో గనక రచయితలు ఉంటే వారికి ఈ కొత్త అవకాశాన్ని పరిచయం చెయ్యొచ్చు.
మీకు నచ్చిన పుస్తకాలని కినిగె. సిఫారసు చెయ్యొచ్చు.

Comments

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు
Vasu said…
కినిగే అంటే అర్థం ఏదన్న ఉందా ??

ఇంకా కొన్ని పాపులర్ పుస్తాకాలు కొన్ని పెడితే బావుండేదేమో మొదటి విడతలో

అంతర్జాలం లో ఫ్రీ గా అందుబాటులో ఉన్న ఒకటి రెండు ఇక్కడ ఎందుకు ఫ్రీ గా పెట్టలేదు. (అ ఆ ఇ ఈ ) లేక నేను పొరబడ్డానా
oremuna said…
Vasu,

కినిగె పేరు గురించి

We are trying hard to improve our catalog.

We are the only legal digital content providers to అ ఆ ఇ ఈ And other Malladi Venkata Krishna Murthy books. The content u came across must be pirated/illegal.
ఈ లైబ్రరీ బాగుందండి . మంచి పుస్తకాలు వున్నాయి .