Black Swan
ఈ సినిమాగురించి బయట బాజా బాకా - లోపల మాత్రం ఊక.
న్యూయార్కు నగరంలో ఒక ప్రసిద్ధ బాలే నాట్య కంపెనీ డైరెక్టరు (విన్సెంట్ కేస్సెల్, ఫ్రెంచ్ తార) తమ సరికొత్త సీజనుకి స్వాన్‌లేక్ నృత్యనాటకాన్ని ప్రదర్శించాలని నిర్ణయించాడు. తెలుగు నాటకాల్లో హరిశ్చంద్రుడూ, పాండవోద్యోగ విజయాలూ ఎలాగో, బాలేకి ఈ స్వాన్‌లేక్ నాటకం అలాగు - అత్యంత ప్రసిద్ధి చెందినదే కాక, ఇప్పటికే కొన్ని వందల కంపెనీలు లక్షల ప్రదర్శనలిచ్చి ఉన్నారు. మళ్ళీ ఇచ్చే ప్రదర్శనలో కొత్తగా చూపించేందుకు ఏంఉన్నది? ఉన్నది - నాటకంలో పరస్పరం విరుద్ధ మనస్తత్వాలతో ఉండే తెల్ల హంస - నల్ల హంస పాత్రలు రెంటినీ ఒకే హీరోయిన్ నర్తించాలనేది ఈ డైరెక్టరుగారి కొత్త ఊహ. ఆ ద్విపాత్రాభినయానికి అతడెంచుకున్న నర్తకి ఇరవయ్యయిదేళ్ళ నీనా అనబడే నేటలీ పోర్ట్‌మన్. ఒక్కటే సమస్య - నీనా మనస్తత్వం తెల్ల హంసలాగా, మంచిమంచిగా మెత్తమెత్తగా భయపడుతూ ఉలికిపడుతూ ముడుచుకుపోతూ ఉంటుంది తప్ప కాలహంసలాగా తెగింపుగా విరగబడుతూ విరుచుకుపడుతూ ఉండదు.
ఇప్పుడు ఈ తెల్లహంసలోనించి ఆ కాలహంసని బయటికి రప్పించడానికి ఆ దర్శకుడేం చేశాడు, ఆ ప్రక్రియలో నీనాలోని అంతర్బహిశ్చేతనలు పరస్పరం ఎలాంటి యుద్ధం చేసుకున్నాయి, ఈ యుద్ధంలో నీనా తల్లి, తోటి కళాకారులు (మిలా కూనిస్ వేడి పెనమ్మీద పెసరట్టులా సురసురమంది) ఎలాంటి పావులయ్యారు .. ఇదీ కథ.
కళల్లో సర్రియలిజపు సూచనలు, చారికలు నాకు చాలా ఇష్టం. కానీ ఈ సినిమాలో, మూలవిషయం ఆసక్తిగా ఉన్నా, రచయితలూ దర్శకుడూ, కథ పైనా ముఖ్యపాత్ర పైనా పట్టు సాధించలేక మొత్తానికి ఒక పదమూడేళ్ళ కుర్రాడి (కుర్రదాని?) మాస్టర్బేటరీ ఫేంటసీలాగా తయారైంది సినిమా. సాధారణంగా మంచిగా మెత్తగా ఉండే ఒకమ్మాయి (అసలు ఆధునిక ప్రపంచంలో, అందులో న్యూయార్కులో బాలే చేస్తున్న ఒక ఇరవయ్యయిదేళ్ళ ఆధునిక యువతి అలా ఎలాగైంది?) తన అంతశ్చేతనలో లోలోపలి పొరల్లో కప్పెట్టేసి ఉన్న వికృత స్వభావాన్ని తన నటనలో ప్రతిఫలించేందుకు బయటికి తియ్యాలంటే - ఏంటంటే - సారీ ముతగ్గా చెబుతున్నా, మరో విధంగా చెప్పే దారిళేదు - మాస్టర్బేట్ చేసుకోవాలని డైరక్టరుగారి సూచన! దానికి తోడు ఏదో డాక్యుమెంటరీ టైపు ఫీల్ రావాలని కాబోలు చాలా సీన్లలో కేమెరా స్థిరంగా ఉండకుండా చేత్తో పట్టుకుని ఉన్నట్టు ఊగుతూ తూలుతూ. మొత్తమ్మీద కళ్ళకి శ్రమ, తలకి నెప్పి. ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో నేటలీ పోర్ట్‌మన్ చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తుండేది. ఈ సినిమాలో ఆమెని పరమ అందవిహీనంగా చూపించడానికి దర్శకుడూ ఛాయాగ్రాహకుడూ బాగా ప్రయత్నం చేశారు. బహుశా నీనాలోని వికృతస్వరూపాన్ని బయటకి తియ్యడంలో ఇదికూడా ఒక ప్రక్రియ కావచ్చు.
అసలు మూలవిషయమ్మీద స్పష్టత ఉన్నప్పుడు సర్రియల్ కథనంలో ఉండే పొరలూ, అస్పష్టతా బాగా రాణిస్తాయి. అంతేగాని కేవలం అస్పష్టత దానికదే ఒక విలువకాదు. మనిషిలో దాగి ఉండి, సాధారణంగా పైకి కనిపించని ఒక డార్క్ సైడ్‌ని గురించి కనీసం పంతొమ్మిదో శతాబ్దం నించీ పాశ్చాత్య రాచయితలు ఆసక్తులై ఉన్నారు, వివిధ ప్రక్రియల్లో దీన్ని శోధించారు. సినిమాల్లోనూ, ఈ ఇంటర్నల్ డార్క్ సైడ్‌కీ, లైంగికతకీ - అందులోనూ మామూలుగా బయటా సమాజంలా గుడీ టూషూస్ లాగా ఉంటూ ఉండే స్త్రీపాత్రల విషయంలో - ఈ సబ్జక్టుని అనేక పద్ధతుల్లో పరిశీలించారు. ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి ఈ విషయమ్మీద, దర్శకుడూ అరనోఫ్‌స్కీ, ఇంకా రచయితలూ ఈ బ్లాక్ స్వాన్ ద్వారా కొత్తగా చెప్పినదేమీ లేదు. అసలు ఆ సబ్జక్టు గురించి లోతైన అవగాహన సంగతి పక్కన పెట్టండి, కనీస అవగాహన కూడా వీళ్ళకి ఉన్నట్టు కనబడదు. పూర్వకాలపు కేథొలిక్ మతగురువులు పిల్లకాయల్ని భయపెడుతూండే వారట - మాస్టర్బేట్ చేసుకుంటే లోపల ఉన్న సైతాన్ బయటికొస్తాడని - ఆ స్థాయిలో ఉంది వీళ్ళ వ్యవహారం. దర్శకుడు ఆరనోఫ్‌స్కీ ఈ మధ్యనే రెస్లర్ అనే కుస్తీ సినిమా తీశాడు. బాలే అంటే కుస్తీకి అప్పగారు అనుకున్నట్టు ఉన్నాడు, అదే పద్ధతులు దీంటోనూ ఉపయోగించాడు. నప్పలేదని వేరే చెప్పనక్కర్లేదు. పోగా సినిమా గురించి మొదలెట్టినప్పణ్ణించీ బాలే బాలే అని మొత్తుకుంటున్నాను కాబట్టి ఈ సినిమాలో చాలా బాలే ఉందనుకునేరు. కె. విశ్వనాథ్ సినిమా శంకరాభరణంలో శాస్త్రీయ సంగీతం ఎంత ఉన్నదో ఈ సినిమాలో బాలే అంత ఉన్నది - అంటే ఏమీ లేదు. లేకపోయినందువల్ల పెద్ద నష్టం లేదు. విశ్వనాథ్‌కి తన పాత్రలూ, వాళ్ళ ఆవేశాలూ, లోటుపాట్లూ క్షుణ్ణంగా తెలుసు. అందుకే శంకరాభరణం అంత రక్తి కట్టింది. ఆరనోఫ్‌స్కీకి తన ప్రధానపాత్రల గురించి దాదాపుగా ఏమీ తెలియదు.
ఈ సినిమాలో ఆస్వాదించదగినవి రెండు - నిరంకుశుడైన బాలే దర్శకుడిగా విన్సెంట్ కాస్సెల్, కనురెప్ప వాల్పులో సెక్సు కురిపించగల రసాధిదేవతగా మిలా కూనిస్.

Comments
అందవిహీనంగా - ఇదేదో కొత్త ప్రయోగం లా ఉంది.
నాకు మా బావ గాడు చిన్నప్పుడు అనే మాట గుర్తొచ్చింది. "నా అందత్వం .." అనేవాడు అందాన్నే కొంచం గంభీరంగా చెప్పాలని.
" కె. విశ్వనాథ్ సినిమా శంకరాభరణంలో శాస్త్రీయ సంగీతం ఎంత ఉన్నదో ఈ సినిమాలో బాలే అంత ఉన్నది - అంటే ఏమీ లేదు"
అదేంటండీ అలా తేల్చేసారు. ఇది వరకూ ఇంచు మించు ఇలాగే ఏదో అన్నారు. ఇంకొంచం వివరించరూ సోదాహరణంగా.
అది స్వచ్చమైన శాస్త్రీయ సంగీతమో కాదో తెలియదు కానీ బ్రహ్మాండమైన సంగీతం. పామర జన రంజకం. నా లాటి వారికి (సినీ సంగీతానికి శాస్త్రీయానికి మధ్య కొట్టుమిట్టాడే వాళ్ళకి) మహా ప్రసాదం.
Another thing about Sankarabharanam, songs were not classical, but the background score was.
శంకరాభరణం గురించి వివరించడానికేమీ లేదు, అందులో శంకరశాస్త్రిగారు పాడినట్టుగా చూపించినది శాస్త్రీయ సంగీతం కాదు - ఈ సంగతి కర్నాటక సంగీతం కొద్దిగా తెలిసినవారెవరైనా చెబుతారు. బావుందా లేదా అనేది పూర్తిగా వేరే విషయం.
budugOy .. మీరు వేరేదన్నా తెరపేరు పెట్టాల్సార్, ఇలా పిలవాలంటే ఏంటోగా ఉంది.
కాల = black
pi .. ok. I do get the point, which BTW is not such a great point in the first place. control versus loose - I am sure any body who's been on stage or who's in competitive sport understand it at a visceral level. It is never completely either - striking the right balance is necessary. My main complaint with the movie is the director's proposed solution to the problem - and also the film-making method too. Re. Black swan, I was too busy being irritated with the director that I did not notice the background score :)
Re. Sankarabharanam background score - you're right. Some nice classical songs were used very appropriately.
budugoy గారు : "అందత్వం" బాగుంది. :)