రాయాలి!

రాయాలి రాయాలి

బోలెడు రాయాలి

ఇంకా చాలా చాలా రాసెయ్యాలి

జీవితాన్ని ప్రతిబింబించేట్టు రాయాలి

మనసుల్ని తాకేట్టూ మనుషుల్ని కదిలించేట్టూ రాయాలి

నా వాళ్ళ కథలు రాయాలి నా గొంతు వినిపించ గలగాలి

రాసి నేనూ చదివి మీరూ ఏదో తెలీని ఆనందంలో తలమునకలయ్యేలా రాయాలి

కానీ రాయలేదు .. నెల ఐపోవస్తోంది! ప్చ్!!

Comments

Anonymous said…
calm before the storm, maybe
ఎందుకనీ?

అప్పుడప్పుడు పాజ్ అవసరమేలెండి...వరదలా పడి కొట్టుకుపోకుండా ... మనల్ని మనం సమీక్షించుకునే అవకాశం చిక్కుతుంది.
ఈ నెల ఐపోతే పోనీ అన్నా.
వచ్చే నెల ఉందిగా
నెలంతా నీదేగా
రాసేయాలనుకున్నది కుమ్మేయోచ్చుగా
మేమంతా సదివేయొచ్చుగా
కామెంట్లు రాసేయుచ్చుగా
Thank you all for your confidence in me!
దాన్ని వమ్ము చెయ్యకుండా ఉండేందుకైనా రాస్తాను (ఇప్పటికే చాలామంది నమ్మకాల్ని వమ్ము చేశాను లేండి! :))
నిన్న కస్టమర్ మీటింగ్ ముగించుకుని కార్లో వస్తూ ఉంటే రేడియోలో టాక్ ఆఫ్ ది నేషన్ లో ఇద్దరు చికానో రచయితలు మాట్లాడుతున్నారు. ఈ అమెరికాలో వాళ్ళ వాళ్ళ అనుభవాల చరిత్రల్ని, వాళ్ళ వాళ్ళ నిర్దుష్టమైన గొంతుల్ని వినిపించాల్సిన అవసరం, దానికి వాళ్ళు పడిన కష్టం గురించి మాట్లాడారు. నాకూ మన భారతీయుల, ఆంధ్రుల పరిస్థితి తల్చుకుని చాలా ఆవేశం వచ్చేసింది. అదన్న మాట ప్రేరణ.
మాలతి said…
:)) సరిగ్గా నా వేదన కూడా వాచ్యం చేసారు.
Anonymous said…
"బ్లాగులందు తెలుగు బ్లాగులు మేలయా.." అని వ్రాసుకున్నారు కాని,
ప్రస్తుతం తెలుగు బ్లాగులు బాగా తెగులు పట్టి కంపు కొడుతున్నాయి. ఏమంటారు?
@bonagiri .. అంగీకరించను. కొన్ని డజన్ల బ్లాగులు ఆసక్తి కరమైన విషయాల్ని చక్కటి వ్యక్తీకరణతో వెలువరిస్తున్నాయి.
Anonymous said…
తెలుగు బ్లాగుల మీద మీకున్న నమ్మకం ఎప్పటికీ వమ్ము కాకూడదని కోరుకుంటున్నాను.
@Anon నా నమ్మకందేముందిలేండి. నేను గమనించిన మాటే చెప్పాను. బ్లాగులు నిజంగా సాధారణ ప్రజలకి ఒక గొంతునిచ్చాయి, వారి సృజనకీ అభివ్యక్తికీ తెరతీశాయి. ఈ కొమ్మలు చిగురిస్తున్నంత సేపూ ఆసక్తికరమైన బ్లాగులకీ బ్లాగు టపాలకీ ఏమీ కొదువ ఉండదు. కయ్యాలకి కాలు దువ్వేవాళ్ళూ కంపుచేసేవాళ్ళూ గుప్పెడు మందే. మిగతా మెజారిటీ బ్లాగర్లకి ఈ కయ్యాలతోనూ కంపులతోనూ ఏ సంబంధమూ లేదు. వారి పని వారు చేసుకుపోతుంటారు. వివిధ విషయాల మీద చక్కని రాతల్ని పంచుతూనే ఉంటారు. పాఠకులుగా ఆ సువాసనలని కాక ఈ కంపులనే పట్టించుకుంటాము అనుకుంటే అది మన దౌర్భాగ్యమే గాని బ్లాగులకి, ఆ బ్లాగర్లకి కాదు.
Anwartheartist said…
నేనుకూడా పుట్టినకాన్నుంచి బొమ్మలువేయాలి వేయాలి,వేయాలి అనే అనుకుంటున్నాను, నేలలేంది, సంవత్సరాలు ,,జీవితాలే ఐపొనీకొస్తున్నాయ్
@ Anwar .. welcome to the club!