రెండూ జీవన యానానికి సంబంధించిన సినిమాలే - రెండిట్లోనే శర్వానందే
ఎట్టకేలకు దేవ కట్టా ప్రస్థానం చూడ్డం తటస్థించింది.
సినిమా చూసినంతసేపూ నా దృష్టిని సడలకుండా పట్టి ఉంచాడు దర్శకుడు. వోలు మొత్తమ్మీద చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్. ముఖ్య పాత్రలు బలంగా, కాంప్లెక్సుగా ఉన్నాయి. సాయికుమార్, శర్వానంద్, చిన్నాగా వేసిన నటుడు చాలా బాగా చేశారు. సహాయ పాత్రల్లో కడప రెడ్డిగా జీవా చర్వితచర్వణ మైపోయాడు. ఇనస్పెక్టర్ గౌడగా వేసినతను, లోకనాథం సహాయకులు బాషా, దుర్గ పాత్రల్లో నటించిన వారిద్దరూ బాగా చేశారు. జయప్రకాష్‌రెడ్డి కామెడీ పరవాలేదు, సినిమాకి అవసరం కాకపోయినా మరీ ఎబ్బెట్టుగా లేదు. ఎబ్బెట్టుగా ఉన్నది శర్వానందుకి బలవంతాన కుదిర్చిన రొమాంటిక్ ట్రాకు. ఇది కీలకమైన సన్నివేశాల్లో కథనంలోని పటుత్వాన్ని సడలించింది. ఆ హీరోయిన్ ఘోరంగా ఉంది. కథకూడా నేరుగా ఒక దారెంబడి సాగిపోకుండా ఎపిసోడ్స్ గా జరగడం ఈ సినిమాకి కొంత లాభించింది. సంగీత దర్శకుడు కొంత కొత్త ప్రయత్నం చేశాడు, ఎలక్షను ఊరేగింపులుగా రూపొందించిన పాటల్లో, కొన్ని కీలకమైన సీన్లలో నేపథ్య సంగీతంలో ఆ ప్రాంతపు వాతావరణం (ఉదా. డప్పులు) తేవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం నించి దిగతీసినవి రెండు - మితిమీరిన ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం, అస్సలు బలంలేని మగ గొంతులు (ఈ రెండూ ఈ సినిమా ఒక్కదానికే పరిమితం కాదు, జెనరల్‌గా తెలుగు సినిమాలకి పట్టి ఉన్న జాడ్యాలే). అన్నిటికంటే ముఖ్యంగా బాగా ఇంప్రెస్ చేసింది దర్శకుని ప్రతిభ. షాట్లని ఫ్రేము చెయ్యడం దగ్గర్నించి, సీన్ కంపొజిషన్, దృశ్యంలోని వర్ణ మిశ్రమం, నటీనటుల అమరిక - ఒక్కొక్క సీనూ చూస్తుంటే, ఆ దృశ్యాన్నించి ఏమి రాబట్టాలి అని స్పష్టమైన అవగాహనతో తీశాడీ దర్శకుడు అనిపించక తప్పదు. అంతే కాదు, సినిమా మొత్తంగా అవలోకించుకుంటే కథకి ముఖ్యమైన ఏ దృశ్యమూ అక్కడ యాదృఛ్ఛికంగా చేరినట్టు కాక, సాలోచనా ఫలితంగా అమరినట్లు స్పష్టమవుతుంది.
ఇదంతా బానే ఉంది కానీ మర్నాడు నిద్ర లేచినాక రకరకాల విషయాలు బుర్రలో పురుగు తొలవడం మొదలైంది. సినిమా మొత్తానికి కీలకం లోకనాథం నాయుడు. విజయవాడ, చుట్టూపక్కలంతా ఆర్ధికంగా రాజకీయంగా బలిమి కలిగి ఉన్నవారు కమ్మవారు. ఇది జగద్విదితం. మరి లోకనాథాన్ని నాయుణ్ణి ఎందుకు చేశారు? చౌదరిని ఎందుకు చెయ్యలేదు? ఇది మొదటి ప్రశ్న. కాకపోతే ఒకటి ఒప్పుకోవాలి - ఇంత రాజకీయంలోనూ కులపరమైన రాజకీయం కనపడదు ఎక్కడా, మొట్టమొదటి పల్లెటూరి ఎలక్షనులో తప్ప. అదీకాక, నాకు తెలిసినంతలో విజయవాడ అర్బన్ నియోజక వార్గాల్లో కమ్మవారెప్పుడూ ఎమ్మెల్లేగా నెగ్గలేదు, పక్కన కంకిపాడులో దేవినేని నెహ్రూ ఏలుతున్నాడుగాని.
లోకనాథం కాంప్లెక్సు కేరెక్టరు. అనేక పొరలు, అనేక కోణాలు. సాయికుమార్ బాగా చేశాడు. కానీ సినిమా చివర్లో గతాన్ని గురించిన ఆ చిన్ని సత్యాన్నొక్కదాన్ని ఆవిష్కరించడంతో ఆ సంక్లిష్టత కాస్తా పల్చబడిపోయింది. ఆ చిన్ని గత శకలాన్ని చూపకుండా ఉండాల్సింది. అసలు లోకనాథం మిత్ర తల్లిని పెళ్ళి చేసుకోవల్సిన అవసరం ఏవిటి? కేవలం పెద్దాయన మాటేనా? పెద్దాయన మాత్రం అసలంత అనూహ్యమైన కోరిక ఎలా కోరాడు? ఇది జీర్ణించుకోవడం కొంచెం కష్టం. కానీ మిత్రా చిన్నా ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు కాకపోతే ఇప్పుడు సినిమాలో ఉన్నంత టెన్షను సాధ్యం కాదు. దాని కోసం దీన్ని ఒప్పుకోవాలి. కేశవ చనిపోయే సమయానికి, సినిమాలో చూపినదాన్ని బట్టి మిత్రకి ఆరేళ్ళు, మిత్ర అక్కకి పదేళ్ళు ఉంటాయి సుమారుగా. తరవాత డయలాగుల్ని బట్టి కేశవ మరణాన్నించి ప్రస్తుత కథాసమయానికి పాతికేళ్ళు గడిచినట్టు తెలుస్తుంది. అంటే మిత్ర అక్కకి ముప్పై అయిదేళ్ళు. ఆమెకి సుమారు 18-20 ఏళ్ళ కూతురు ఉండడం అసంభవం. మిత్రకి కనీసం ముప్పై యేళ్ళుండాలి, కానీ పాతికేళ్ళకి మించినట్టు కనబడ్డు (పాత్రధారి శర్వానందుకి నిజంగానే 2009 లో 25 నిండాయిట). అఫ్కోర్సు ఇదంతా ఎగ్స్ ఈకల్స్ పీకింగ్స్ అంటే, నేను కాదన్ను. ఫిర్ భీ .. కభీ కభీ ..
గమ్యం ఇంతకు ముందోసారి చూశాను, బానే ఉందనుకున్నాను, కానీ సరిగ్గా గుర్తు లేదు. అందుకని మళ్ళీ చూశాను. ఈ సారి కొంచెం శ్రద్ధగా చూశాను. అఫ్కోర్సు, దీంట్లోనూ శర్వానందే. కాకపోతే ఈ సినిమాకి హీరో హీరోయిన్లు యాదృఛ్ఛికం. అక్కడ శర్వానందు - కమలిని కాక ఇంకో జంట ఎవరున్నా సినిమా ఇంత ఎఫెక్టివ్ గానూ ఉండేది. మనలో మాట, కమలిని పక్కన శర్వానందుడు కొంచెం వరహీనం అనిపించాడు. సినిమా అన్ని విధాలా చాలా చాలా బావుంది. అల్లరి నరేష్ మంచి నటుడని నాకెప్పణ్ణించోనే అనుమానం. నేనులో ఆ చాయలు బాగానే కనబరిచాడు. ఈ సినిమాతో ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎవరన్నా దర్శక పుణ్యాత్ములు ఈ అబ్బాయికి కాస్త అప్పుడప్పుడూ అయినా ఇటువంటి కథా, ఇటువంటి పాత్రలూ ఇస్తూ ఉంటే బాగుణ్ణు. రావు రమేష్ తెలుగు సినిమాకి లభించిన మరో మంచి నటుడు. ఈయన పది కాలాలపాటు వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నాకు ఆసక్తిగా అనిపించిన విషయం - ఏ విషయాన్నీ ఎబ్బెట్టుగా చూపించడు. ఉదాహరణకి మొదట్లో శర్వానందు కమలినితో నీ చుట్టూ అంతా చెత్తా మురికీ అసయ్యం అంటాడు చాలా సార్లు, కానీ దృశ్యంలో అంత ఇదిగా ఏం చూపడు. అలాగే రెండు ఆన్‌స్క్రీన్ డెలివరీలూ, ఇంకొన్ని బీభత్స దృశ్యాలూ కూడా చాలా లలితంగా తీశాడనే చెప్పాలి - బహుశా అది డైరెక్టరు టెంపరమెంటు కావచ్చు. బ్రహ్మానందం కామెడీ, రికార్డింగ్ డేన్సుల వాళ్ళ ఎపిసోడ్ కూడా కథలో చక్కగా ఇమిడాయి. రిఖార్డింగ్ డేన్సు దగ్గర NTR, ANR, కృష్ణల సూపర్ హిట్ పాటల్ని చూపించడం కొంచెం తమిళ దర్శకుడు బాలాని గుర్తుకి తెచ్చింది. సమయమా అనే పాట చాలా నచ్చింది (పాడింది ఎవరు?). మిగతావన్నీ వోకే. నేపథ్య సంగీతం లేకుండా ఉంటే బాగుండేది. చక్కటి సంయమనంతో శ్రద్ధ పెట్టి తీసిన సినిమా ఎలావుంటుందో గమ్యం నిరూపించింది. దర్శకుడు క్రిష్ కృషికి టోపీ తీసేశ్శా!

Comments
ఒక సన్నివేశం, ఎమ్మెల్యే టిక్కెటు నిరాకరించిన తరువాత కార్లో ప్రయాణిసున్నప్పుడు మానేజరు(ధర్మం) అనుకుంట, "జనాలు కూడా అట్టడుగున స్వార్దపరులండీ" అంటాడు దానికి బదులుగా లోకి "స్వార్దమే మనిషి అసలు లక్షణం, నిస్వార్దం దానిని కాచే కవచం" అంటాడు. ఇక్కడే ఉల్లిగడ్డ ఒక పొర విప్పుకుంటుంది.
లోకి అవసరానికి తగ్గట్టుగ నడుచుకునే వాడని చెప్పడానికి వాడుకున్నాడు.
ఆసక్తి కరమైన విషయాలు చెప్పారు. ఈరోయిన్ను మిత్రాని మావయ్యా అని పిలిచినట్టు గుర్తు - ఏమోమరి. ఎట్లాగా ఇంకొన్నాళ్ళు పోయాక మళ్ళి చూస్తాను, అప్పుడు వెరిఫై చేస్తాను. లోకి అవసరానికి తగ్గట్టే కాదు, ఎదురుగాఉన్న అవకాశాన్ని తనకి అనుకూలంగా మార్చుకో గలిగిన సమర్ధుడు అనడంలో నాకేమాత్రం సందేహం లేదు. నేనంటున్నదల్లా కథనంలో దర్శకుడి నిర్ణయం - ఎంత వరకూ స్పష్టంగా చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే దాన్ని గురించి. ఆ గత శకలం ఇదీ అని స్పష్టంగా చూపించడం కాకుండా, ఒక సూచనగా వొదిలేస్తే, ఆ కాంప్లెక్సిటీ ఇంకా రంజుగా ఉంటుందని నా ఉద్దేశం.
ప్రస్థానంలో ఎగ్స్ ఈకల్స్ విషయానికి వస్తే నటీనటుల వయసు పాయింట్ కరెక్టేకానీ మిత్ర తన అసలువయసుకన్నా ఐదేళ్ళు తక్కువగా కనిపించేంత ఆరోగ్యవంతుడని సరిపెట్టుకోవచ్చు. ఇక హీరోయిన్(మిత్రలవర్) మిత్ర అక్కకూతురు కాదండీ మీరు గమనించారోలేదో తను మిత్రని బావ అంటుంది. ఆ అమ్మాయి మిత్ర బావకి చెల్లెలు అని చూపించాడు. మిత్ర అక్కాబావా చనిపోయిన సీన్ లో ఆ అమ్మాయి అన్నయ్యా అని ఏడవడం మీరు గమనించవచ్చు.
గమ్యంలో ’సమయమా’ పాటపాడింది సుజాత.
మీరనేది నేనొప్పుకుంటా, మామిడి రసం తీసి తాగడం కంటే పండులాగానే తింటే ఇంకా బాగుంటుందంటారు అంతే కదా!
కన్నగాడు - జోకు వచ్చే వారం కబుర్లలో రాస్తాను.
ఇందు, అక్కడే నేను విభేదిస్తున్నది. అతను సున్నితంగా తియ్యడంలో, రొమాంటిసైజ్ చెయ్యలేదు - కానీ అలాగని ఉన్న బీభత్సాన్ని కూడా పూర్తిగా చూపలేదు. చూపినా అది సినిమాకి అచ్చిరాదు అనుకోండి.
మురళి, టోపీ పెట్టేస్కుందాం అంటారా? అసలే మా వూళ్ళో చలికాలం వచ్చేసింది! :)
రెండోదాని గురించి మీరు చెప్పినవే ఒప్పేసుకుంటాం. అల్లరి నరేష్ గురించి నాక్కూడా సేమ్ ఇంప్రెషన్. ఇక ఈ సినిమా హీరో ఫేస్ నాకస్సలు నచ్చదు. "సమయమా" పాట పాడినది సునీత. సంగీతం సమకూర్చింది నాన్నగారి చిరకాల మిత్రులు ఈ.ఎస్.మూర్తి. నాన్న గురించి రాసిన కథలో రాసానీయన గురించి. కవి తిలక్ గారి మేనల్లుడీయన.
"గమ్యం" స్థాయిలో లేకపోయినా "వేదం" పర్వాలేదనిపించిందండి నాకు. A different & promising director అని నమ్మాలని అనిపించింది.
cinema chusina next day kuda miru dani gurinche alochistunnaru ante ardam cheskondi adi elanti movie o..