మాయింటి వినాయకుడు


ఈసారి గోధుమ పిండితో తయారు చేశాను.
అంతకు ముందటేడు బంకమన్నుతో

Comments

అయ్యా , మీ వినాయకుడిని చూపించినందుకు ధన్యవాదాలు ,మరి మీ బ్లాగింటికి వచ్చి దర్శనం చేసుకున్న నాకు ప్రసాదం పెట్టారా , నేను ప్రసాదం భక్తుడనండి.
ప్రతిసంవత్సరం మీరు స్వంతంగా వినాయకుడిని తయారుచేస్తారు. మరి వాటిని నవరాత్రులు పూజించి నిమజ్జనం చేస్తారా?
Anonymous said…
Kottapali garu,

I read your blog last year and came to know that you make the idol with different things every year. With your inspiration I made this year with Play-doh. Thank You very much Sir.
Sree
జయ said…
మీ పిండి వినాయకుడు చాలా బాగున్నాడు. అవన్నీ మీ సమ్మర్ స్పెషల్ పూలా. చాలా బాగున్నాయి.కోరనేషన్స్ లాగున్నాయి. ఎంతబాగున్నాయో.
వ్యాఖ్యానించిన వారందరికీ ధన్యవాదాలు.
భాను, మీరింక తెలుగులో రాయాలి! :)
వాజసనేయ, ఈ ఫొటో పూజ మొదలుకాక ముందు తీసినది. పూజ అయినాక తీసినదాంట్లో ప్రసాదం కూడా ఉంది. మనలో మాట, పాయసం చాలా బాగా కుదిరింది :)
జ్యోతి, నవరాత్రులు ఎక్కడండి, ఏకరాత్రమే.
శ్రీ, సంతోషం.
జయ, ఈ సారి మా యింటో బంతిపూలు తప్ప ఏమీ సరిగ్గా పూయలేదు. అవన్నీ కొనుక్కొచ్చినవే. సాధారణంగా కార్నేషన్‌స్ చాలా బావుంటాయిక్కడ, వెల చవక కూడా.
Vasu said…
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతీ యేడు మీరే తయారు చేస్తారా. అద్భుతం.

ఔను మీరు పాలవెల్లి కట్టరా? లేక అక్కడ దొరకదా ?? వినాయకుడిని భలే అలంకరించారు.
వాసు, పాలవెల్లి దొరకదు కానీ నాలుగు చెక్క ముక్కలు తెచ్చి ఒక చట్రంగా మేకులు కొట్తడం ఒక పెద్ద పని కాదు. కానీ దాన్ని వేలాడ దియ్యడానికి సపోర్టు లేదు. అందుకని విరమించాను.
భావన said…
ఏంటీ మాస్టారు. పాయసం మీరే చేసుకుని తినేసారా. కనీసం ఫొటో కూడా పెట్టలేదు బోసి వినాయకుడిని పెట్టేరు? బాగున్నడు బుజ్జి వినాయకుడూ.
విజయమోహన్, సంతోషం.
భావన, పోనీ ఈసారి పండక్కి మా వూరొచ్చెయ్యండి. ఆ మాట అనాలంటేనేమో మీకసలే టొర్నడోల భయమాయెను! :)
మా ఇంట గణేశుడు
http://picasaweb.google.com/lh/photo/nY8BgjeOy0jMW1ybl4GHufBqiHOkuQ7oZrzdvB6NbPc?feat=directlink

అత్భుతంగా చేసారు అన్నగారు. నేకు ఈ ఏడాది కుదరలేదు. అందుకే లాంగ్ వీకెండ్‌కి షికాగో వచ్చినప్పుడు కొన్నా.

@భావన గారికి టోర్నెడోల భయమా? మధ్య ప్రాచ్యంలో ఉంటారా ఏంటి మాలాగా...మా ఊరు కేన్సాసులో సమచ్చరానికి ౧౦౦కు పైనే వస్తాయట టోర్నెడోలు..
భావన said…
మాకేమి టోర్నడో లు రావు భాస్కర్ గారు. మేము ఎంచక్క గా న్యూ ఇంగ్లాడ్ ఏరియా లో వుంటాము. మా అబ్బాయి ని ఈ సవత్సరం సమ్మర్ కేంప్ కు పంపితే యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్.... నా బిడ్డ భయపడి పోయాడు. రోజు అలారం లు మోగటమే, బేస్మెంట్ లో కుదయ్యటమేనట...అమ్మో బతికుంటే స్నో మేన్ చేసుకుంటూ ఏదో ఇక్కడే వుంటాము కాని ఆ మధ్య రాష్ట్రాలు రామని నేను నా కొడుకు ఆంజనేయ సామి గుడీకెళ్ళి ఆకు పూజ చేయించుకుని దండం పెట్టుకున్నాం. అది చెపితే కొత్తపాళి గారికి నవ్వులాట గా వుంది. :-(
we3ours3 said…
మీరు ప్రతీ ఏడు ఒకో పద్దతి లో గణపతి ని చేసే విషయం మీ బ్లాగ్ చూసే వరకు తెలియదండి. సంతోషం చాలా బాగుంది... మీ ప్రయత్నం.
మాకూ ఐడియాలివ్వండి .. వచ్చే ఏటి కోసం !
శుభరాత్రి.
Sandeep said…
మంచి ప్రయత్నం చేశారండి కొత్తపాళిగారు!
ఇందు said…
కొత్త పాలి గారు బాగున్నడండీ మీ వినాయకుడు....భలే చెసారే!!! ఈసారి నేను ప్రయత్నిస్తా!! అప్పుడు ఎంచక్కా మనం చేసిన వినాయకునికే మనం పూజ చేయొచ్చు... :)
భావన, ఏదో మీ దయవల్ల మీ ఆంజనేయస్వామి మీరు చేసిన ఆకుపూజ బలంతో మా మధ్యరాష్ట్రాల్ని కూడా ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు! :)

we3ours3, సంతోషం. మీ బ్లాగుకి దారి కనబళ్ళేదు మీ ఐడీ నించి.

సందీప్, సంతోషం.

ఇందు, ఇక్కడ ఇండియన్ షాపుల్లో వినాయకుడి విగ్రహానికి మరీ ఆకాశాన్నంటే రేట్లు చెబుతుంటే వొళ్ళుమండి నేనే తయారు చెయ్యడం మొదలెట్టాను రెండేళ్ళకిందట. మొదటిసారి మట్టితోనూ, రెండోసారి పసుపు ముద్దతోనూ చేశాను. అవి కొంచెం abstractగా వచ్చాయి.ఈ సారి చేసినదే కొంచెం జాగ్రత్తగా చేశాను, రెండు గంటలు పట్టింది.
తృష్ణ said…
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్...బాగుందండీ విగ్రహం. తయారీ మంచి శ్రమని కలిగించి ఉంటుంది. గోధుమపిండి బాగా సాఫ్ట్ గా ఉంటుండి కదా. మలచటం సులువు కాదు.
గొడుగు కానీ, పాలవెల్లి గాని తయారు చెయ్యలేదాండీ మరి? ఇంకా అందంగా ఉండేది కదా.
మొత్తానికి కారణం ఏదైతేనేం...స్వహస్తాలతో గణపతిని చేసి పూజించారు ధన్యులు. బొమ్మ కూడా చక్కగా వచ్చిందండీ!
మీ పిండివినాయకుడు బాగున్నాండండి .
ఆరేళ్ళ క్రితం మేము , మా అబ్బాయి దగ్గరకు , బాయిసే వచ్చినప్పుడు ఇలాగే ( అంటే ఇంత అందముగా కాదు ) పిండి తో వినాయకుని చేసాను . మీ వినాయకుని చూడగానే నాకు , అప్పటి వినాయకచవితి గుర్తొచ్చింది .
మట్టితో వినాయకుడిని చెయ్యడంనేర్చుకోవాలని చిన్నప్పట్నుంచి తీరనికోరిక :(
మురళి said…
బాగున్నాడండీ మీ వినాయకుడు, ముద్దుగా..
సవ్వడి, తృష్ణ, పరిమళం, మాల, చైతన్య, మురళి - నెనర్లు.