అమెరికా తెలుగు బ్లాగర్లకి ఓ కొత్త పిలుపు

ఆదివారం జూలై నాలుగు
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం

ఇక్కడ ప్రవాసం ఉంటున్న వ్యక్తిగా ఈ సందర్భంలో ఈ జూలై 4 న మీ మనోభావాలేవిటి?

జస్ట్ ఇంకో సెలవరోజు సమ్మర్లో?

ఈ ప్రపంచవ్యాప్త కల్లోల పరిస్థితుల్లో ఈ లోకానికి అమెరికా తప్ప దిక్కులేదు! America has to show the way.

బీపీ డౌన్ డౌన్! కార్పొరేట్ గ్రీడ్ డౌన్ డౌన్!

హబ్బ, ఏంది నీ సొద, కాసేపు వర్ళ్డ్ కప్ చూస్కోనీ!

పర్యావరణ చమురుతో పూడుకుపోతే నాకేం? బీపీ షేరు 60 శాతం తగ్గింది. కొనేస్కోడానికి ఇంతకంటె మంచి ఛాన్సు దొరకదు, కొను కొను కొను!

ఈ దేశం ఎక్కడికి పోతోంది? రెండు దేశాల్లో తమది కాని యుద్ధం చేస్తున్న వేలాది సైనికులు. క్షతగాత్రులై తిరిగొస్తున్న సైనికులకి కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం! ఎన్నెన్నో ఆశలు చూపించి ఎన్నికైన అధ్యక్షుడు ఇప్పుడన్ని రుగ్మతలకీ తన తీపి మాటలే చక్కెర మాత్రలుగా వేస్తున్నాడు!

ఈ దేశం నాకేమిచ్చింది?

అమెరికా!! డాలర్ల గుడ్లు పెట్టే నా బంగారు బాతు!!

ఈ దేశం ఎక్కడికి పోతోంది? తనతో బాటు ప్రపంచాన్ని ఏ లోతుల్లోకి ముంచేస్తోంది?పైన చెప్పిన భావాల్లో ఏవైనా మీ ఆలోచనలకి దగ్గరగా వస్తాయా? యూ డోంట్ కేరా? అస్సలు టోటల్లీ డిఫరెంటా? ఏంటీ మీ ఆలోచన?? ఇప్పుడు, ఇప్పుడే, ఈ క్షణాన!
దయచేసి మీ మీ బ్లాగుల్లో పంచుకోండి.
(నా ఆలోచనలు జూలై 4న ఇక్కడే!)

Comments

Anil Dasari said…
అమెరికాకి సమస్యలు కొత్త కాదు, ప్రపంచానికి అమెరికాతో సమస్యలూ కొత్త కాదు. వందేళ్లకి పైగా సాగుతున్న తంతే ఇంది. మనం ప్రస్తుతంలో ఉన్నాం కాబట్టి మనకి ఇవి ఇంతకు ముందు వాటికన్నా పెద్ద సమస్యల్లా కనిపిస్తున్నాయంతే. టేకిటీజీ.