బీపీ .. గల్ఫ్ తీరవాసులకి టోపీ .. ఒబామా ముక్కోపి .. చూసేవాళ్ళకి తలనెప్పి!
కట్రీనా బీభత్సాన్నించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న న్యూఆర్లీన్స్ ఇంకా గల్ఫ్ తీర వాసులపాలిట ఇంకోశాపం. అంతేకాదు, ఈ ఉపద్రవం లెక్కకు మిక్కిలి జంతు వృక్షజాతులపాలిటి మృత్యుపాశం అయి ఉచ్చు బిగుస్తున్నది. ఎవడు ఎవడికి ఎంత తొందరగా నష్టపరిహారాలు చెల్లిస్తారో పక్కన పెట్టండి, ప్రకృతిమీద ఎంత విధ్వంసం? ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత సముద్రపునీళ్ళని వడబోసినా పూర్వ స్థితి రాగలదా?
ఇదిలా ఉండగా అటు భారత్‌లో భోపాల్ యూనియన్ కార్బైడు మీద తీర్పు. ఎంత హాస్యాస్పదం! ఎంత ఘోరం! ఆ తీర్పు రాసేటప్పుడూ, కోర్టులో చదివేటప్పుడూ ఆ జడ్జీకి కాస్థ సిగ్గైనా వెయ్యలేదా? కానీ అధికార వర్గాలు చూపించే మొండిచేతుల్ని చూడ్డానికి భోపాల్ విషవాయు బాధితులు అలవాటు పడిపోయారు. అంచేత ఈ సరికొత్త అవహేళన బహుశా వాళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టిందని అనుకోను. కానీ ఇన్నేళ్ళల్లోనూ వాళ్ళు తమ పోరాట స్ఫూర్తినీ, నిశ్చయాన్నీ కోల్పోలేదు. ఇప్పుడూ కోల్పోరు. నాకా నమ్మకముంది.
ఏదేమైనా, ఎటువంటి విషయాన్నైనా విని/చదివి తట్టుకునే స్థితప్రజ్ఞత ఉంటేనే వార్తలు తెరవాలి - ఆ స్థితప్రజ్ఞతలేదని ఏమాత్రం సందేహంగా ఉన్నా వార్తలకి దూరంగా ఉండడం మంచిదల్లే కనిపిస్తోంది.
ఈ మధ్యన మా యీంట్లోనూ శాటిలైట్ టీవీ ప్రవేశించింది. క్రమం తప్పకుండా వివెల్ అల్ట్రాప్రో సూపర్ సింగర్ ఫైవ్ చూస్తున్నా - పొందండి టోటల్ గేరంటీ, పోషణా సంరక్షణా మరియూ మాయిఛ్ఛరైజేషన్!!! టింగ్ టింగ్. అక్కడక్కడా చిరాకనిపించినా, వోలుమొత్తం మీద ఈ పాటలపోటీ నాకు నచ్చేసింది. దీన్ని గురించి చెప్పాల్సిన కబుర్లు చాలా ఉన్నై అంచేత, విడిగా ఓ టపారాస్తా. లంగరయ్య సాగర్ గురించి రెండు మాటలు - నెల్లాళ్ళ కిందట చూడ్డం మొదలెట్టినప్పుడు వీడెవడ్రా నాయనా అని దిగాలు పడ్డాను, కానీ రాను రాను పిలగాడు పదును తేరాడు.
మొన్నటి పుస్తకాల బంగీలో చేతికందిన ఒక అపురూపమైన పుస్తకం "మా నాన్నగారు". సీనియర్ సాహితీవేత్త డా. ద్వానా శాస్త్రిగారు కూర్చిన సంకలనం. కీర్తిశేషులైన అరవైరెండుమంది సాహితీ ప్రముఖుల జీవిత విధానాలు అని పేర్కొన్నారు అట్టమీద. తమ తమ తండ్రులని గురించి ఒక కూతురుగాని కొడుకుగానీ క్లుప్తంగా చెప్పుకొచ్చిన 4-6 పేజీల జీవిత విశేషాలు. ఏదో పత్రిక్కి వ్యాసం రాసినట్టు కాక చాలా వ్యక్తిగత దృక్పథంతో ఆత్మీయంగా ఉన్నాయి రచనలన్నీ. తెలుగు సాహిత్యంలో అమ్మకి పద్యంలోనూ వచనంలోనూ చాలానే నీరాజనాలొచ్చినాయి ఇలా తండ్రుల్ని తలుచుకోవడం, అదీ చాలా చక్కగా మంచి అభిరుచితో తీసుకురావడం సంతోషం కలిగిస్తున్నది. ద్వానా శాస్త్రిగారికి అభినందనలు. వెల కొంచెం ఎక్కువే. రూ. 400. ప్రతులు విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలోనూ. లేదా ద్వానాశాస్త్రిగారిని నేరుగా సంప్రదించ వచ్చు - 98492 93376
వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం అందిస్తున్న ప్రత్యేకం మళయాళ రచయిత ఎం టి వాసుదేవన్ నాయర్ తో ఇంటర్వ్యూ.
సాక్షి సంస్థలో విలేఖరిగా పనిచేస్తున్న పూడూరి రాజిరెడ్డి గారు చాలా కాలంగానే చక్కటి బ్లాగు నిర్వహిస్తున్నారు. ఆయన కథ ఒకటి ఆయన బ్లాగులోనే; అక్కడే ఆయన చెప్పిన వారి వూరి ముచ్చట కూడా. ఆయన రాసిన మధుపం గురించి పత్రికావర్గాల్లో మంచి టాక్ వచ్చింది. పుస్తకంలో ఒక సమీక్ష. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments
ప్రకృతి మీద విధ్వంసం విషయంలో, 9/11 దాడి వంటిది ఈ బిపి ప్రమాదం. మధ్యప్రాచ్య దేశాల్లో జరుగుతున్న మారణకాండ వంటిది దైనందిన కార్యక్రమంగా మనం చేస్తున్నది. అంకెల్లో పెద్దగా కనిపించినవే పెద్దవి కాదు కదా:)
పెద్దల రాజకీయ కేళికి మరో నిదర్శనం యూనియన్ కార్బైడు ఉదంతం, రెండు పుష్కరాల తర్వాత అప్పటి సిఇఓ దేశందాటిన వైనం మీద ప్రశ్నలు గుప్పుతున్న ప్రతిపక్షాలు, హేయమైన తీర్పు మీద ప్రశ్నలడగడానికి ఇంకెన్ని పుష్కరాలు పడుతుందో, ప్చ్;
చివరగా "వూరి ముచ్చట్లు" 'వూ' అనే అక్షరం వాడారెందుకు, బహుషా పుస్తకం పేరే అలా ఉంటే చెయ్యగలిగిందేమి లేదు కానీ ఈ మధ్య ఎక్కడ చూసినా 'ఊ'ని 'వూ' మింగేస్తుంటేను ఉండబట్టలేక అడిగేసా.
నా బ్లాగు గురించి పేర్కొన్నందుకు ధన్యవాదాలు.
అయితే, మీరు ఇచ్చిన మూడు లింకులు ఉదాహరణగా ఇచ్చారా? అవే ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
@ రాజిరెడ్డి .. ఆ టపాల్ని ఉదహరించడానిక్కారణం నేను మీ బ్లాగు చదివినప్పుడు ఇవి కొంచెం గట్టిగా మనసుకి హత్తుకున్నాయి
మీరు చూస్తున్నారా సూపర్ సింగర్ 5. నేను తెగ ఫాలో ఐపోతున్నా. సోమ మంగళవారాలు రాత్రి తొమ్మిది దాటేక ఎవ్వరిని ఫోన్ లు చెయ్యవద్దని చెప్పేసేను కూడా. :-)
కిందటీ కామెంటు లో మా అబ్బాయి కాలేజ్ కు వెళ్ళినందుకు అభినందనలు చెప్పేరు. మా అబ్బాయి ఇంకా కాలేజ్ కు వెళ్ళలేదండీ.డిబేట్ కేంప్ కు మీ వూరొచ్చాడూ ఒక మూడు వారాలకు అంతే. మేమిద్దరం వొట్టు పెట్టుకున్నాం.. మిచిగన్, ఇలినాయస్ కు మాత్రం కాలేజ్ కు వెళ్ళొద్దు అని. చీటీకి మాటికి ఆ టోర్నడో వార్నింగ్ లేమీటీ ఆ బేస్మెంట్ లలో దాక్కోనే గోల ఏమిటండి బాబు.
పుండూరి రాజా రెడ్డి గారి మధుపం చదివేరా ఐతే. కొన్ని చోట్ల నవ్వు వచ్చింది, కొన్ని చోట్ల వొళ్ళు మండీంది కూడా.
రాజిరెడ్డిగారి మధుపం ఇంకా చేతికందలేదు.