పదాలకి అర్ధాలు

ఆనవాలు = గుర్తు. చిహ్నము అని ఎవరో చక్కటి మాట చెప్పారు. ఇది నామవాచకం. బయట పెద్ద గన్నేరు చెట్టు ఉంటుంది - అదే వాళ్ళింటికి ఆనవాలు. ఐతే దీన్ని ఎక్కువగా ఆనవాలు పట్టడం అనే క్రియా రూపంలో వాడుతున్నాము. అదికూడా మనిషిని పోల్చడం అనే అర్ధంలో. తమాషాగా, నిఘంటువులో దీని అర్ధం "అడియాలం" అని ఇచ్చారు - ఈపదాన్ని తమిళంలో ఇప్పటికీ ఉపయోగిస్తారు, ఇదే అర్ధంలో.
తెరువు = దారి. ఈ పదంకూడా తమిళంలో ఇదే అర్ధంలో ఇంకా వాడుకలో ఉంది.
కలిమి = సంపద
సమ్మర్దం = తొక్కిడిగా నున్న సమూహం. యుద్ధము అని కూడా అర్ధం ఉన్నదిట. జనసమ్మర్దం అంటే జన సమూహం.
విహ్వలం = విపరీతమైన అలజడి చెంది, తద్వారా అవయవాల నియంత్రణ లేకపోవడం .. to lose control; విహ్వలించు = to be in such a state.

Comments

Sandeep P said…
సమ్మర్దం - ఎప్పుడూ వినలేదండి. సంస్క్ర్తపదమా ఐతే! తెలుగు వంశవృక్షంలో తమిళం ఆ పైనెక్కడొ ఉంది అని చెప్పడానికి ఇంకా కొన్ని పదాలే మిగిలున్నాయి. అడియాలం గురించి మీరు చెప్తే అనిపించింది :)
విహ్వలమనస్సు అంటారు కదండీ, "విహ్వలనాగేంద్రము పాహీ పాహీ అయి కుయ్యాలింప.." అని ఎక్కడో చదువుకున్నట్టు గుర్తు.
తమిళ్ లో తెరువు కాస్తా ‘తెరు’అయ్యి, వీధి అనే అర్థంలోకి మారిందనుకుంటా. ఈ మధ్యనే ఒక మంచి సినిమా వచ్చింది. ‘అంగడి తెరు’అని. చూశారుగా !
మీ కొత్త టపా.. వచ్చి 2 వారాలు దాటుతోంది.. బ్రేక్ తీసుకున్నారా?
chavera said…
బ్రతుకు తెరువు (సినిమా పేరు) బ్రతుకు దారి కంటే బ్రతుకు బ్రతికే విధానం అంటే సరిగ్గా ఉంటుంది.