అమెరికా తెలుగు బ్లాగర్లకి ..

భయపడకండి, నేను మళ్ళీ మీ రక్తపోటు పెంచే, మిమ్మల్ని కంగారు పెట్టే సందేశం ఏవీ ఇవ్వబోవట్లేదు.

కొంతకాలంగా నా ఆలోచనల్లో సుళ్ళు తిరుగుతున్న ఒక బుల్లి సమస్యని మీ ముందు పెట్టి మీ అభిప్రాయం ఏంటొ కనుక్కుందామని ఈ ప్రయత్నం.

మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు? - టిపికల్ దేశీ - అస్సలు దేశీ కాదు - కొన్నిట్లో అవును, కొన్నిట్లో కాదు.
ఏయే పద్ధతులు, ఆచారాల్ని బట్టి ఈ నిర్ధారణకి వచ్చారు?

సాధ్యమైనంత వివరంగా చెప్పండి.

ఎక్కడ మొదలెట్టాలో తెలియక పోతే ఇలా చూడ్డం మొదలెట్టొచ్చు:

కొన్ని టిపికల్ దేశీ లక్షణాలు .. నేను పొందు పరిచినవి కావు, కొందరు మిత్రులు ప్రవచించినవి
గ్రోసరీ షాపింగ్ ఖర్చులో కనీసం సగమైనా ఇండియన్ గ్రోసరీ
సేటిలైట్ టీవీలో ఇండియన్ ఛానెళ్ళు
సూది నించీ టీవీదాకా ఏది కొనాలన్నా జైహో వాల్మార్ట్

ఇది కొంచెం వ్యక్తిపరంగా సున్నితమైన విషయం కావచ్చు. మీ పేరు చెప్పడం ఇష్టం లేకపోతే అనామకంగానైనా చెప్పొచ్చు.

Comments

Chari Dingari said…
మంచి డిస్కషన్...
కొన్నిట్లో అవును, కొన్నిట్లో కాదు.
@ dnc .. మరయితే మీ సంగతి చెప్పండి!

@ శరత్ .. Details details as they say, the devil is in the details!

@ అజ్ఞాత .. తెలుగుని అంగ్లలిపిలో రాసే వ్యాఖ్యలు ప్రచురించనని వొట్టేసుకున్నాను.
నా గురించి ..
కొన్నిట్లో అవును, కొన్నిట్లో కాదు.
ఎందుకు అవును - కొన్ని లక్షణాలు:
నా సెల్‌ఫోనులో అధికశాతం నంబర్లు భారతీయులవే, అందునా తెలుగువారివే.
క్రమం తప్పకుండా గుడికి వెళ్తాను.
భారతీయ కళలంటే ఇష్టం.
తెలుగు పుస్తకాలు, భారతీయ పుస్తకాలు బాగా చదువుతాను.
గుడికి గాని, కచేరీకి గాని వెళ్ళేప్పుడు పంచకట్టుకుని వెళ్ళడమంటే ఇష్టం.

ఎందుకు కాదు:
సాహిత్యం, సంగీతం, భోజనం - ఈ మూడింట్లో దేశదేశాల పద్ధతులు రుచిచూడ్డం ఇష్టం.
పాశ్చాత్య కళలంటే ఇష్టం. ఏ నగరానికి పోయినా అక్కడి కళాప్రదర్శన శాల చూసొస్తాను.
పచ్చని ప్రకృతిలో కాలినడకన తిరగడమంటే ఇష్టం.
మాల్ అన్నా వాల్‌మార్ట్ అన్నా ద్వేషం.
Anonymous said…
>> గ్రోసరీ షాపింగ్ ఖర్చులో కనీసం సగమైనా ఇండియన్ గ్రోసరీ

NO! Not at all. We do shopping at various grocers including American, Mexican, Chinese, roadside stalls and such. We only go to Indian shops once in 15 days or once a month. In fact I hate visiting Indian grocery store.

>> సేటిలైట్ టీవీలో ఇండియన్ ఛానెళ్ళు

No. None. I do not even have cable TV. Far from Sattellite TV. We see only those channels that are on air. We only watch TV for news weather and may be Dr. Oz show. Btw we do watch Indian movies downloaded to laptop and also via DVDs rented at desi store on weekends. [Kids need the least available TV exposure... is my justification for no cable/sattellite. No plans to add either cable/sattellite in future either.]

>> సూది నించీ టీవీదాకా ఏది కొనాలన్నా జైహో వాల్మార్ట్

Not necessarily. I do not hate Walmart but do buy stuff at other places - in fact I do compare prices a LOT before I buy. Importantly electronic stuff has never been bought at WMT.

>> Temples

We visit Saibaba center (kid's class), hindu temple, hare krishna temple but not in any order/regularity. Just go when there is a function/class etc., ONLY if possible. When going to temple for any functions, I go with normal dress (jeans OK) but family members sometimes do dress sari/dress etc.

>> Eating out/Going to movies

Typical eating out is once in 3 or 4 months or may be less. And when eating out the typical food is Tacos, Pizza, subway sandwich and such. Mostly never an Indian restaurant. If we go out of town to a temple then probably eat Indian stuff (3 or 4 times an year?). Seeing movies (american/desi) outside in theater has not happened much in last 10 years. May be 5 times in last 10 years :-)

Are we desi? You decide.
రాధిక said…
ఏమోనండి నేనయితే పక్కా దేశీ అనే అనుకుంటాను.
మేము గెమిని లాంటి చానల్స్ పెట్టించుకోలేదు.అవి చూడడం నాకు అస్సలు ఇష్టం వుండదు.
మా షాపింగ్ లో వారం వారం బియ్యం,పప్పులు,పొడులు ,కొన్ని కూరగాయలు ఇండియన్ స్టోర్లో కొన్నా చాలా వరకూ గ్రోసరీస్ అమెరికన్,మెక్సికన్ షాపుల్లో కొంటాము.సగం సగం అన్న మాట.
ఇంట్లో రోజూ మన వంటలే వండుకుని తిన్నా,వారానికి ఒకరోజు అమెరికన్,మెక్సికన్,చైనీస్,థాయ్,ఇటాలియన్లలో ఏదో ఒకటి రుచిచూస్తాము .మన భోజనాలు తినడానికి రెస్టరెంట్ కన్నా గుడిలో కిచెన్ ప్రిఫర్ చేస్తాము.[గుడి కి వెళ్ళేది సగం దేవుడి కోసం,సగం భోజనం కోసం]
తెలుగు,తమిళ,హిందీ సినిమాలు చూడ్డానికి భాషా బేధం లేకుండా ఏ చెత్త వచ్చినా డబ్బులు ఖర్చు చేస్తాము.
అలాగే ఆంగ్ల సినిమాలు కూడా చూస్తాము.కానీ పిల్లల సినిమాలు,బాగా హైప్ వున్న సినిమాలు[అవతార్,2012 లాంటివి] మాత్రమే చూస్తాము.
మా ఫోనుల్లో కూడా భారతీయుల నంబర్లే ఎక్కువ.
గెట్ టుగెదర్లు,పాట్లాక్కులు,ఫంక్షన్లి......99 శాతం మనవాళ్ళతోనే వుంటాయి.మన డ్రెస్సుల్లోనే వెళతాము.
కానీ అందరివీ భాషలు వేరవడం వల్ల ఆగ్లం లోనేఅ మాట్లాడాల్సి వుంటుంది.తెలుగు వాళ్ళుంటే మాత్రం తెలుగులోనే.
వాల్మార్ట్ కూరగాయలు,జ్యూసు,పాలు లాంటి వాటికి తప్పించి ఇతరత్రా వాటికి వాడము.
కార్ లోనూ,ఇంట్లోనూ భారతీయ సినిమా పాటలు మాత్రమే వింటాము :)
మా అబ్బాయికి పద్యాలు,పాటలు,శ్లోకాలు నేర్పుతున్నాను.[తెలుగు బాగా అర్ధం అవుతుంది కానీ మాట్లాడడానికి కాస్త కష్ట పడతాడు.]
మొత్తం గా చెప్పాలంటే సగం అలా,సగం ఇలా వుండాల్సొస్తుంది.
nuthakkis said…
I was non-desi before moving to NJ, an when moved to NJ early days, it was 50-50..and now we are pure desi, I think everyone knew NJ is part of India..

I used to live on fried Veggies/chicken , BBQ ,Local fesivals / Local stores- American neighbors, and American frnds

After movin to NJ, it was tough to get used to Edison smell.. but now its all good..

Need to have dum-biryani atleast once in a week. Indian store every week. Every Summer you shoul have Mangoes/Jack fruit .. I get guava rather than getting pears / apples..

We go to work at 10AM, and return aroun 6PM (previously I used to get back by 4PM and utilise my evenings).. our team meetings go in Hindi/Urdu/Telugu.. Only one peson in our team in American (out of 30ppl), so he doesnt attend meetings..
We watch all movies Telugu/Hindi.. and very few English...Buy lots of gold.. no sports .. only eating..and getting fat.. getting frustrated these days.. but God knows, when we will be re-located from New Jersy.
కొత్తపాళీ గారూ ఇవన్నీ తెలియదు కానీ, గ్రాసరీ అంతా చాలా వరకు ఇండియన్ స్టోర్స్. మన వంటలతో పాటి వారానికొక్కసారన్నా ఇటాలియన్ లేక మెక్సికన్ ఫుడ్ పడాల్సిందే.అలాగే సబ్ వే వెజీ డిలైట్ కూడా బాగా ఇష్టం. ఇక టి.వి. విషయానికొస్తే కేబుల్ లో మన ఇండియన్ ఛానల్స్ ఏమీ రావు.పూజలూ పునస్కారాలు చేయడం అన్నీ మా ఇంటావిడ వంతు హారతి అద్దుకోవడం మావంతు. గుడికి వెళ్ళేది తక్కువే. భారత లలితకళలంటేనే ఇష్టం. పాశ్చాత్య సంగీతం పెద్దగా ఎక్కదు. కానీ ఇక్కడి వారి నృత్యాలు మన నాట్యాలలాగే చూస్తాను. బాగుంటాయి. ఇంకా....షాపింగ్ అంటే అదీ ఇదీ అని కాకుండా అన్నీ చోట్ల చేస్తాము.అలాగని వాల్మార్ట్ అంటే ద్వేషం లేదు. వాల్మార్ట్ లో వచ్చిన కొత్తల్లో మిగిలిన షాప్ ల గురించి తెలియనప్పుడు బాగానే కొనేవారం కానీ ఇప్పుడు పది శాతానికి లోపలే పడిపోయింది. ఇక్కడి ప్రకృతి అమితంగా ఇష్టం.అలాగే దూర ప్రయాణాలు కార్ లో చేయడమూ ఇష్టమే. ఇంకేముందబ్బా???
ముందుకొచ్చి వివరంగా చెప్పిన అందరికీ ధన్యవాదాలు.

వివరాల్లోకి వెళ్ళడంలో నేను అసలు తెలుసుకోవాలనుకున్న సమాధానం మరుగున పడిపోయింది. నేను నా టపాలో ఇలాంటి వివరాల్తో ఆలోచించమని చెప్పకుండా ఉండాల్సింది.

My question is not so much about your personal habits, but you own sense of your identity. How do you see yourself.

I will ponder over it some more and perhaps resurrect this question at a later time, and hope to frame it better then.

Meanwhile, thank you all!
భావన said…
నన్ను నేను ఐతే దేశి అనే అనుకుంటా. పద్దతులు ఆచారాలు కోసమని కాదు కాని మనస్తత్వం 70% అలానే దేశి గానే వుండి పోయింది, ఇక్కడకు వచ్చి చాలా కాలం అయ్యింది కాబట్టీ ఒక 30% ఇక్కడ అలవాట్లు ఐపోయాయి పొద్దుటే సీరియల్ చల్లటీ పాలు తో మొదలవ్వటం వంటివి. చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరగటమో లేదా మతం మార్చుకుని/తెల్ల వాళ్ళను పెళ్ళి చేసుకుని ఆ మార్చుకున్న/internationalization వుషారు లో దేవుడి తో పాటు జీవన విధానం బాగా మార్చుకుంటేనే అని కొందరు మారటం చూసేను కాని మిగతా అందరు చాలా మట్టుకు దేశీనే అనుకుంటున్నా నేనైతే.
బాగుంది భలే చర్చ. మరి స్వదేశీయులకి ఇలాంటి టేస్టులేం లేవా ? :)
విజయశర్మ గారు, అవును మరి, స్వదేశంలో ఉంటూ చూసేవాళ్ళకి మా విదేశీ జీవితం తమాషాగానే ఉంటుంది మరి. :)
ok here is my take. This is an evolution and on going process in my view. Just an observation in to myself - I made good friends from American community and they open yet an avenue in to the life style here. Looking back at these 16y, up until 10 years back I was 80:20 and now 60:40 [టిపికల్ దేశీ - అస్సలు దేశీ కాదు] and down the line after would I be 20:80 or 80:20 I don't know. My kids are now 40:60 and hope to see them stay at that ratio.

So, the 10 things each weighing 10 points are ..

1. food
2. friends
3. language(s)
4. books
5. religion/spirituality
6. traditions
7. personality at core
8. hobbies
9. outfit
10. movies

నిజానికి దేశాన్ని వదిలాకనే దేశి అంటే ఇదీ అన్న నిర్వచనం తెలుస్తా. అంతవరకు ఇంటి అలవాట్లు, కుటుంబ పడికట్లే లెక్కలోకి వచ్చేవి. ఆస్త్రేలియాలో శ్రీలంక తమిళుల స్నేహితంలోనే సాంప్రదాయ విలువలు అర్థం అవుత. ఫిజీ ఇండియన్ల అభిమానం లోనే కుటుంబ/స్నేహ బాంధవ్యాల అవగాహన అలవడటం. నేను, నా కుటుంబం అన్న గట్టుకావలి లోకం కళ్ళకి అగపడింది దేశం సరిహద్దులు దాటకనే.
దేశీ మీటర్ < 10% ఇంట్లో మాట్లాడే తెలుగు, నేను వేసే లుంగీ, అప్పుడప్పుడు జాలంలో చదివే తెలుగు తప్ప భారతీయతను ఎప్పుడో మిసిసిపీలో తర్పణం చేశాను. చాలామటుకు స్థానికంగా అమెరికాలో తయారైన వస్తువులు వాడుతుంటాము. అమెరికా తెలుగువాన్ని అని మాత్రం గర్వంగా చెప్పుకోగలను.
gaddeswarup said…
Kottapali garu,
Since I am not sure whether this is for all NRIs or those only in USA, I will only make some general remarks. Firstly these identifications seem vary with time even for a sinle person. Second and more difficult point: I find often what we feel may be different from what we think that we feel. Having said that,I feel that we grow up with in early years is difficult to get rid of even if we try and many say that people finally die in their mother tongue. I do not know how much of a desi I am; I do not wear Indian clothes, I do not go to temples, I do not interact much with Indians, I do not read or speak Telugu that much. But Telugu keeps coming back and Telugu poems and songs stir me much more than English poems (sometimes it is Hindi songs which I heard in the forties eventhough I do not know Hindi). My heart still skips a beat when I hear Telugu in strange places. The images of villages and fields in coastral Andhra stay with me almost every day. And I still eat avakaya and sambarukaaramu (a type of chilli powder used by farming families in Guntur, Krishna districts)everyday. As Wordsworth said 'child is father to the man'.
Naganna said…
దాదాపు రాధిక గారిలా...

కాకపోతే.. తెలుగు ఛానెళ్ళు మా, టివి తొమ్మిది ఉన్నాయి. ఇంట్లో హాలీవుడ్, కార్టూన్ ఫిల్మ్ ఫెస్టివల్ నడుస్తుంది. వీలైనంతగా ఆర్గానిక్ పదార్థాలు కొంటాము, వాల్ మార్ట్ తక్కువ.
teresa said…
As my kids comment often, I got out of India , but the indian in me did not get out.
I am talking about core vlues here, not the కట్టూ, బొట్టూ.
I think Iam 40:60 Desi/western.
అయ్యా!!
తిండి - పూర్తిగా దేశీనే.
ఎప్పుడన్నా బయట తింటే అది సబ్వేలో. హోటేలుకి వెళ్తే దేశీ హోటేలే.
వెరీ రేర్ వెండీస్/ఆర్బీస్ సూరిగాడికి ఫ్రెం ఫ్రైస్ కోసం.

ఇక వెచ్చాలు -
పప్పులు కూరలూ - దేశీ.

పాలు గట్రా - బీజేస్/సమ్మక్క.

గుళ్ళు గోపురాలు, పూజలు పునఃస్కారాలు చెప్పేదేముందీ.

సూరిగాడి బళ్ళో, నెలకోసారి బువ్వకూడా దేశీ ఫుడ్డే. ఆళ్ళ టీచరు, ఇడ్లీలో దోశెలో, కొబ్బరి పచ్చడేసి పంపండి అని చెప్తుంది. వాడి తరగతిలో, ఇరవై ఐదు మందిలో పాపం నలుగురే విదేశీయులు :):)
అర్రెర్రె...ఎలా మిస్సైపోయానబ్బా ఈ పోష్టు?

మళ్లీ ఓ మాంచి ఉడుంపట్టు పట్టి, అప్పుడెప్పుడో నెలన్నర క్రితం కొద్దిగా రాసి వదిలేసిన ఈ "భాగ్యాన్ని" పొడిగించాలి... దీని మూడో భాగంలో వివరిస్తానండీ మీ టపాలోని ప్రశ్నలకు నా సమాధానం!
Chari Dingari said…
భాస్కర్.. విదేశీయులంటే...నలుగురు 'తెల్ల/నల్ల' వాల్లనేనా? వాళ్ళే అసలు అమెరికా దేశీయులు కదా :)...కొంచెం సరళత అవసరం...
శ్రీ said…
నేను దేశీనే!

తెలుగు సినిమాలు, మసాలా దోశలు, మసాలా టీలు.
ఈనాడు, గ్రేట్ ఆంధ్రా, ఐడిల్ బ్రైన్లు...
తెలుగు బ్లాగులూ, లేఖినులూ
కింగ్ ఫిషర్, తాజ్ మహల్ బీర్లూ...

అవును నేను దేశీనే!
ఇంగ్లీషు అజ్ఞాత గారు .. వివరంగా చెప్పినందుకు నెనర్లు

రాధిక, నిజం. బాబుకి తెలుగు నేర్పే ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషం. శ్లోకాలతో పాటు మన తెలుగు పద్యాలు కూడా నేర్పండి.

నూతక్కి గారు .. I totally hear you re. Edison, NJ. I used to live in Phialadelphia, and every time the urge overtook me to live my desi-ness, I used to drive to Edison and spend the whole day on Oak Tree Road :)
భారారె .. సరే :)
భావన .. ఫిర్ భీ దిల హై హిందూస్తానీ అంటారు :) మీరు చెప్పిన రెందు కారణాల వల్ల తప్ప మనుషులు దేశీతనం వొదులుకోరంటారా?
ఉష .. బాగుంది మీ 10 పాయింట్ల ఎజెండా. దేశం
వొదిల్తే ఉత్పన్నమయ్యే ప్రశ్నలే ఇవి. దేశంలోనే ఉన్నప్పుడు ఆ ప్రశ్నే రాదుగదా
రవి .. నువ్వు ఈ కబుర్లన్నీ కాదులే. తెలుగువికీని తొలిరోజుల్లో వొంటి చేత్తో మోసినవాడివి నువ్వు దేశీ కాదంటే మేంఉ నమ్మకేం?
స్వరూప్ గారు, బాగుంది సర్ మీరు చెప్పింది.
నాగన్న, కనబడినందుకు సంతోషం. అమ్మాయి, పిల్లకాయలు కులాసానా? :)
teresa, I hear you on the India part .. but now you have to go and bring up core values .. oh boy!.. whole different ballgame :)
భాస్కర్ .. సూరిగాడి స్కూల్లో విదేశీయులు .. ఇక్కడ dnc గారికొచ్చిన డౌటే నాకూ వొచ్చింది. ఎవరు స్వదేశీయులు, ఎవరు విదేశీయులు? నిర్వచించి మా సందేహము తీర్పుము :)
వంశీ గారు, ఎదురు చూడమంటారయితే! మీరు పక్కా దేశీనే :)
శ్రీ .. Super. మీరు మాత్రం అట్లాగే ప్రొసీడైపోండి. లేకపోతే మెట్రోడిట్రాయిట్లో దేశీమేటర్ మొన్న డౌజోన్స్ పడిపోయినట్టు పడిపోతుంది :)
మనల్ని దేశీ అంటాంకదా. మరి వీళ్ళో వి-దేశీయులేగా!!:):)
cbrao said…
"మాల్ అన్నా వాల్‌మార్ట్ అన్నా ద్వేషం."
-ఎందుకు?
సీబీ రావుగారు, అమెరికను కన్సూమరిజానికి ప్రతీకల్లా అనిపిస్తాయి నాకవి. నేను కొనుక్కోవలసిన వస్తువులు, సాధ్యమైనంత వరకూ విడీగా చిన్న షాపుల్లో కొనుక్కునేందుకు ప్రయత్నిస్తాను.