ఏమని ట్వీటెదనో ఈ వేళా ..

తెలుగుబ్లాగు మొదలెట్టిన కొత్తల్లో బ్లాగు పేరుతో ఒకట్రెండు పేరడీ కందాలు రాశాను.

ఇవ్వాళ్ళ డా.పెన్ బ్లాగులో తెలుగు తారలు ట్వీటుతున్నారని చదివాక ఈ ట్వీటు పేరడీలు వాటంతటవే పెల్లుబికినాయి. సరదాగా ..

ట్వీటమని నన్నడగ వలెనా నేనే పరవశించీ ట్వీటనా?

అంతగా నను ట్వీటకు ఉష్ .. మాటాడకు

ట్వీటంటే తెలుసా నీకూ? తెలియందే ట్వీటు చెయ్యకూ ..

ఓలమ్మీ ట్వీటు రేగిందా? వొళ్ళంతా మీట నొక్కిందా?

జగమే ట్వీటు బ్రతుకే ట్వీటు జాలమ్ములో ఇదే స్వీటు స్వీటు

నేను ట్వీటాను, లోకం మెచ్చిందీ ..

నిన్ను ట్వీటేటందుకె పుట్టానే గుమ్మ .. నువు ట్వీటకపోతే వృధా ఈ జన్మ

ట్వీటూ లేదూ స్వీటూ లేదూ ట్వీటేటందుకు ట్విట్టరు లేదూ ఏక్ నిరంజన్

నను పాలింపగ ట్వీటును పంపితివా .. గోపాలా ..

ట్విట్టరు ట్విట్టరు ట్విట్టరులో ఓహో జగమే ట్వీటెనుగా ట్వీటెనుగా మీటెనుగా

Comments

హా..హ్హ..హా..స్వీటు లాంటి ట్వీటు పోస్ట్..:)

నాకెందుకో ఈ 'ట్వీటర్' సెలబ్రిటీలకు తప్పించి సామాన్యులకు అంతగా ఉపయోగపడని అప్లికేషన్ అని అనిపిస్తుంటుందండీ...
రాధిక said…
:)కొత్తపాళీగారు కొత్త పాటలకి కూడా పేరడీలు రాస్తున్నారే :)
@ శేఖర్ .. నాకూ అదే అనిపించింది.
@ రాధిక .. మరేమనుకున్నారు - కాదేదీ పేరడీ కనర్హం! నేను కొత్త సినిమాలు చూస్తూనే ఉంటాను, కానీ పాటలు విడిగా వినను, అందుకని గుర్తుండవు. ఇక్కడ పేరడించిన కొత్త పాటలు మీబోటి స్నేహితులే కొంతకాలం క్రితం నా దృష్టికి తెచ్చారు అందుకని గుర్తున్నై.
Unknown said…
మీ జాబితాకి నాదో చేర్పు అండీ....

ట్వీటుతా నీ యబ్బా ట్వీటుతా
ట్వీటని నా కొడుకెందుకు లోకంలో
స్వర్గలోకమగపడతది ట్విట్టర్ లో ... :-)

(తాగుతా నీ యబ్బా తాగుతా అనే పాటకు[సినిమా గుర్తు లేదు] పేరడీ)
ట్వీ ట్వీ ట్వీ ట్వీటంటే చేదా, మీకా ఉద్దేశ్యం లేదా?
ఇలా చేస్తున్నారంటే ఎగతాళీ ఈ, త్వరలోనే ట్వీటుతారు కొత్తపాళీ ఈ :)
@ రవిచంద్ర .. హమ్మ్

@ సౌమ్య .. భలే. మంచి అంత్య ప్రాస రెండో లైనులో.

నాకు ఇంకోటి తట్టింది - ట్వీటింది, మస్తు ట్వీటింది తారాలోకం ..
హ హ హ ఇలా రాసుకుంటూ పోతే బోలెడు తడతాయి :)
kiranmayi said…
అమ్మా ఇంతమంది పారడీలు వ్రాస్తే నేనురుకుంటానా?

my additions to the list :
1 . ట్విటవె మేనత్త కూతురా , నువ్వు ట్విటితే నా గుండె..... (నేను స్కూల్ లో చదువుకునే రోజుల్లో మోస్ట్ happening సాంగ్)
2 . ట్విట్టి ట్విట్టి ట్విట్టిటం నువ్వంటేనే నాకిష్టం....