ఉగాది జాలకవి సమ్మేళనానికి ఆహ్వానం

తెలుగునాట ఉగాది సందర్భంగా కవిసమ్మేళనాలు జరపడం ఆనవాయితీ.
పొద్దు జాలపత్రికవారి నిర్వహణలో గత రెండు ఉగాదులకీ జాలవేదికపైన ఛందోపద్య కవిసమ్మేళనాలు విజయవంతముగా జరిగినాయి. ఈ సభల నివేదికలు పొద్దు జాలపత్రికలో లభ్యమవుతున్నాయి.

ఇదివరలో జాలవేదిక కున్న పరిమితుల వలన సభాప్రవేశం పాల్గొంటున్న కవుల వరకే కట్టడి చేయాల్సి వచ్చింది. కానీ నివేదిక ప్రచురించిన ప్రతిసారీ పాఠకులు సభలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతూ వచ్చారు. అంచేత ఈ సారి సభలో పదిమంది ప్రేక్షకులను ఆహ్వానించడానికి ఏర్పాటు చేశాము.

వికృతినామ సంవత్సర ఉగాది ఛందోపద్య కవి సమ్మేళనానికి స్వాగతం.
ప్రత్యక్ష జాలసభలో ప్రేక్షకులుగా పాల్గొనే ఆసక్తి కలవారు దయచేసి నాకు మెయిల్ చెయ్యండి.
kottapali at gmail dot com

సభవివరాలు వ్యక్తిగతంగా తెలియజేస్తాను.

కొన్ని ప్రాథమిక విషయాలు, నిబంధనలు:
1. ఇది ఛందో పద్య సభ.
2. ఇది విద్వత్ సభ. దానికి తగిన సభామర్యాద పాటించాలి.
3. ప్రేక్షకులు కూడా సరసమైన సంభాషణ సాగించవచ్చు సందర్భోచితంగా. ఐతే, కవుల పద్యధారకి అడ్డుపడకుండా చూసుకోవాలి.
4. విమర్శ చెయ్యవచ్చు కాని, అది సందర్భోచితంగా, మర్యాదగా ఉండాలి. ఎడతెగని అభిప్రాయాల చర్చలకి ఇది వేదిక కాదు.
5. ఇది బహిరంగ వేదిక కాదు. కవులు, ప్రేక్షకులు కూడా సభానిర్వాహకుల ఆహ్వానం మీద అతిథులుగా హాజరవుతున్నారు.
6. ఇన్ని నియమాలున్నాయని ప్రాణమున్న కట్టెల్లా బిగుసుకుపోవలసిన అవసరం లేదు. సభ ఉద్దేశం పద్యసాహిత్య మేధోమధనంతో ఆనందించడం.

Comments

కవిగా పాల్గొనేంత సీన్ నాకు లేదు. ప్రేక్షకుడిగా కుదురుతుందేమో చెప్పండి.
సురేష్ గారు, దయచేసి నాకు మెయిల్ చెయ్యండి.