పనుల వత్తిడిలో అస్సలు ఊపిరి సలపకుండా ఉంది అని సాకు చెప్పాలనుంది గానీ అది పూర్తిగా నిజం కాదు. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక పని పెండింగ్ లో ఉన్నదనే ఊహ అస్తమానం మనసులో మెదుల్తూ స్థిమితంగా ఒక టపానైనా రాయనివ్వకపోవడం మాత్రం నిజం.
ఈ కబుర్లు ఆదివారం ఉదయం రాస్తున్నాను. ఇన్ని నెలలుగా నలుగుతూన్న ఆరోగ్య వ్యవస్థ సవరణ చట్టాన్ని ముక్కీ మూలిగి ఎట్టకేలకి చట్టసభలో వోటుకి తెస్తున్నారీ వేళ. చూడాలి ఏమవుతుందో.
కృష్ణదేవరాయల పంచ శతాబ్ది ఉత్సవం - ట. ఆ కర్నాటాంధ్ర రాయణ్ణి తల్చుకుని నేటి కర్నాటాంధ్ర రాయళ్ళ పోకళ్ళని చూసి దుఃఖ పడుతున్నారు సాక్షి గారు ఆంధ్ర భూమి దినపత్రికలో.
టీవీ9 వాళ్ళు దేవులపల్లికి పట్టిన నీరాజనం రెండు భాగాలు - ఒకటి, రెండు.
కొన్నాళ్ళ కిందట ఒక యువమిత్రుడు అడిగాడు తెలుగు పాఠాలు చెప్పరాదా అని. అంత ఓపిక, తీరిక లేదన్నాను, కానీ బాగా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తరచూ చేసే కొన్ని తప్పులు చూశాక, అప్పుడప్పుడూ ఇక్కడ తెలుగు వాడుకల ప్రస్తావన చేద్దా మనిపించింది.
అంజలి, నివాళి - అంజలి అంటే రెండు చేతులూ జోడించి నమస్కారం చెయ్యడం. నివాళి అంటే హారతివ్వడం. కీర్తిశేషులైన వారిని తలుచుకుంటూ వారి పట్ల తమ గౌరవాన్ని ప్రకటించడానికి, మరణానికి సంతాపం ప్రకటించడానికి ఈ మధ్యన ఈ రెండు పదాలూ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. పత్రికల్లో శీర్షికల్లో వాడ్డం, అటుపైన మరణించిన వ్యక్తిని గురించి ప్రముఖులు సందేశాలివ్వడంలో ఈ మాటల వాడుక ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో, ప్రజలందరూ కూడా ఈ మాటలు ఆ సందర్భలో వాడేవి అనేసుకుని అలాగే వినియోగిస్తున్నారు. ఆ సందర్భంలో వాడ్డం తప్పు కాదు, కానీ ఆ మాటలకి అంతకంటే విస్తృతమైన వాడుక ఉన్నదని మనం గురుతుంచుకోవాలి. ముఖ్యంగా నివాళి మంగళప్రదమైనది. దీన్ని చావు సందర్భంలో వాడి వాడి, ఇప్పుడెవరన్నా శుభ సందర్భంలో నివాళి అంటే, ఛా, ఏవిటీ చల్లటి వేళ అలాంటి పాడు మాటలు అని జనాలు ముక్కున వేలేసుకునే స్థితి వస్తుంది. అంతే కాక, కీర్తిశేషుల్ని తలుచుకోవడంలో కూడా ఈ పదాల వాడుక వెర్రి తలలు వేసి అపభ్రంశపు వాడుకలు కొన్నిటిని పుట్టిస్తోంది. నివాళి అంటే సంతాపం ప్రకటించడం అనుకుంటున్నారు జనాలు. మన బ్లాగుల్లోనే చూశానెక్కడో, ఫలాని వారి మరణానికి నివాళి అని రాశారు - మరణానికి నివాళి యేవిటి పిండాకూడు! మొన్న విజయవాడలో ఒక తెలుగు పేపర్లో చూశాను - ఫలాని వారికి అశ్రుతాంజలి అని. ఆ పోయినాయనకి చెవుడు కావాలు అనుకున్నా!
పనిలో పనిగా మీ తెలుగు ఎంత తాజాగా ఉందో పరీక్షించుకోండి - ఈ కింది మాటలకు అర్ధాలు చెప్పండి
కలికము
కోటేరు
మక్కెలు
తుక్కు
మొగసాల

Comments
నమస్కారం. మీరు చెప్పినట్లు ' నివాళి ' అనే పదానికి నిఘంటు అర్థం ' ఆరతి ' అనే మాటే ! కానీ వాడుకలో అనేక పదాల అర్థాలు, ప్రయోగాలు కాలానుగుణంగా మారటం కూడా సహజమైన ప్రక్రియే ! ' నివాళి ' అనే పదం చాలాకాలంగా మీరు ఉదాహరించిన అర్థంలో వాడటం జరుగుతోంది. ఇది నిన్న మొన్న ప్రారంభమైనది కాదు. ప్రముఖ రచయితలూ, పండితులు కూడా ఇదే అర్థంలో వాడటం నాకు తెలుసు. భాషపై పట్టున్న ప్రముఖులు సంపాదకులుగా వున్న పత్రికలలో కూడా ఈ ప్రయోగం చాలాకాలంగా జరుగుతోంది. నేను భాషా పండితుణ్ణి కాను గానీ ఒక విషయం చెప్పదలచుకున్నాను. ' నివాళి ' అనే మాటకు చనిపోయిన వాళ్ళ విషయంలో ప్రయోగించడం వల్ల అర్థం మారిపోతొందని నాకనిపించడం లేదు. ఆ పద ప్రయోగ పరిధిని మరింత విస్తృతం చేసి మరణించిన వారి పట్ల గౌరవాన్ని, భక్తిని చాటుకునేందుకు వాడుతున్నారని నేననుకుంటాను. చనిపోయిన వారిని దేవుడితో సమానంగా భావించడం, వారికి పూజలు జరపడం మన సంసృతిలో భాగం కదా ! సాయిబాబా, ఊరూరా వెలిసిన గ్రామదేవతలు దీనికి ఉదాహరణలు.
అంతెందుకు ? మీ టపాలో ' టీవీ9 వాళ్ళు దేవులపల్లికి పట్టిన నీరాజనం రెండు భాగాలు... ' అన్న దాంట్లో ' నీరాజనం ' అనే పదానికి కూడా నిఘంటు అర్థం ' ఆరతి '. ఆ అర్థంలోనే వాడితే దేవులపల్లి వారికి వాడకూడదేమో ! కానీ ఆ అర్థ పరిధిని విస్తృతం చేసినపుడు ఆ ప్రయోగం తప్పు కాదు. ' అంజలి ' ప్రయోగానికి కూడా ఇదే వర్తిస్తుందేమో ! ' సుస్వాగతం ' అనే పదం తెలుగు నిఘంటువులలో కనిపించదు. ఆ పదం ఆబ్దిక మంత్రాలలో పితృదేవతలను ఆహ్వానించే సందర్భంలో వాడతారు. కానీ ప్రస్తుతం ఆ పదాన్ని ఏ అర్థంలో వాడుతున్నామో చెప్పనక్కర్లేదనుకుంటాను.
వ్యవహారికంలో విస్తృతంగా వుండే పద ప్రయోగాల గురించి పరిజ్ఞానమే తప్ప భాష మీద అధికారమున్న వాణ్ని కాదు... కానీ నేను కూడా ' నివాళి ' అనే పదాన్ని అందరిలాగే ఈ అర్థంలోనే వాడుతున్న బ్లాగరుని కాబట్టి భుజాలు తడుముకున్నాను. నొప్పించివుంటే మన్నించండి.
@ చిన్ని గారు, జాగ్రత్తగా గమనించండి, నా టపాలో ఎక్కడన్నా మాండలికాల ప్రస్తావన గాని, ప్రామాణిక భాష ప్రస్తావన గాని ఉన్నదా? బై ది వే, అశ్రుతము అంటే వినబడనిది :)
స్వాంతన, శాఖాహారం!
కోటేరు = సన్నగా పొడవుగా షార్ప్ గా ఉంటున్నది అని తెలుసు
మక్కెలు= కీళ్ళు
తుక్కు = పనికిమాలిన వ్యర్ధం
మొగసాల= రచ్చబండ లాంటి పబ్లిచ్ ప్లేసు తీర్పులూ గట్రా చెప్పేది
కోటేరు - వాడియైన , సూదంటి ..
మక్కెలు - ఎముకలు, కీళ్ళు
తుక్కు - ???
మొగసాల - ???? (మొదలు అనుకుంటున్నా ..)
తుక్కు =పారవేయదగ్గ వ్యర్థ పదార్థము
మక్కెలు =ఎముకలు
కోటేరు లాంటి ముక్కు అని విన్నప్పుడల్లా నాకు అంటే ఏమిటి అని కుతూహలంగా ఉండేది. ఎవర్నీ అడగలేదు. ఇప్పుడు మీరు చెప్తారని ఆశిస్తున్నాను.
కలికితురాయి ని ప్రతీక అనే అర్థంలో విన్నాను కానీ కలికము అంటే అదేనా, కాదా తెలీదు.
ఇంకా ఇలాంటి ప్రయత్నాలు మన బ్లాగుల్లో చేస్తే ఎంతో బావుంటుంది. అభినందనలు. అంత్యాక్షరి లాంటి దేదైనా పెడితే కూడా మన భాషా ఙ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దోహదం చేయగలవనిపిస్తోంది.
కోటేరు - సన్నని పొడవైన ( నాజూకైన )
మక్కెలు - తుంటి ఎముకలు
తుక్కు - వ్యర్ధము( చెత్తకు పర్యాయపదంగా మా దగ్గర బాగా వాడుకలో వుంది )
మొగసాల _
మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు అని సామెత వుందికదా....అంటే అదేదో రచ్చబండ వంటిది అయుంటుంది