మీ మీ కీబోర్డులకి దుమ్ము దులపండి.
అంతే కాదు, మీ చూపులకి పదును పెట్టండి.
ఈ మధ్యన విరివిగా రాస్తూన్న అబ్రకదబ్ర, ఉమాశంకర్, ఉష, భాస్కర్, భారారె, కిరణ్మయి, సునీత, శరత్, వాసు, రాధిక, రౌడీ, శ్రీ, కల్పన ... ఇంకా చాలామంది..
కొన్నాళ్ళొ చాన్నాళ్ళో రాసి ఈ మధ్య రాయడం ఆపేసిన రానారె, భవాని, చరసాల ప్రసాదు, డా. శ్రీకృష్ణదేవరాయలు .. ఇంకా చాలామంది ..
మీకందరికీ చక్కటి భాష వుంది. సహజమైన, వ్యక్తిగతమైన రచనా శైలి ఉంది. మీమీ రచనల్ని ఆసక్తిగా చదివే, కొత్త రచనలకోసం ఎదురు చూసే పాఠకులున్నారు.
అన్నిటికంటే, ఈ దేశంలో నివాసం ఉండడం వల్ల ఇక్కడి జీవితాన్ని, పరిస్థితుల్ని చదవగలిగే ఒక unique perspective ఉంది మీకు. పత్రికల్లో రాసే వ్యాసాల్లో లాగా మొహమాటాలకి పోవలసిన అవసరం లేదు. నిజాయితీతో నిర్మొహమాటంగా రాసుకోవచ్చు.
తెలుగు సినిమాలూ, ఆంగ్ల సినిమాలూ, చిన్నప్పటి జ్ఞాపకాలూ, తెలుగు రాజకీయాలూ - ఇవే కాదు మనకి విషయాలు. వీటిని రాయొద్దు అనడం లేదు, కానీ, నా వుద్దేశంలో మనం మాట్లాడుకోవలసిన విషయాలు, చెప్పుకోవలసిన కబుర్లు, చేసుకోవలసిన చర్చలు వేరే ఉన్నాయి.
మీ చేతిలో భాషుంది బ్లాగుంది చెప్పే సత్తా ఉంది చదివించే గుణముంది విశ్లేషీంచే బుర్రుంది చూసే చూపుంది - నాకు తెల్సు ఇవన్నీ ఉన్నాయని. ఇప్పటిదాకా మీమీబ్లాగులుల్లో మీమీ రచనలే ఋజువులు. కానీ ఇది సరిపోదు. సరిపోదంటే సరిపోదోచ్.
చూడండి, చూపుకి పదును పెట్టి లోతుగా చూడండి. ఎలా ఉన్నాయి మన జీవితాలు? చుట్టూతా ఉన్న సమాజం ఎలాగుంది? తెలుగు సమాజం ఎలాగుంది? భారతీయ సమాజం ఎలాగుంది? పరస్పర సంబంధా లెలాగున్నై? ఆశలూ, ఆశయాలూ, ప్రిజుడిస్లూ, ప్రైడ్‌లూ, డిజప్పాయింటుమెంట్లూ, వాటికి పూసుకున్న ఆయింటుమెంట్లూ ..
కథలో కవితలో వ్యాసాలో వ్యథలో విశ్లేషణలో డిసెక్షనులో ఏదో ఒక రూపంలో
హాస్యంగానో ఆర్ద్రంగానో సీరియస్‌గానో చర్చగానో ఏదో ఒక మూడ్‌లో
రాయండి రాయండి రాయండి
జీవితాన్ని విప్పి చెప్పే టపాలు రాయండి.
రాయండి, ప్లీజ్!!

Comments
సామాజిక స్పృహను బ్లాగులలో ప్రతిబింబింపఁ జేయాలనే మీ పిలుపు అత్యంత ప్రయోజన కరమై ప్రతిస్ప్ందన మీరూహించని స్తాయిలో ఉంటుందని నే నాశిస్తున్నాను. ధన్యవాదములు.
మీరు చెప్పిన విధంగా రాయడానికి ప్రయతిస్తాను. మన బ్లాగర్లలో ఈ చైతన్యం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు.
భావన .. సారీ సారీ సారీ. మా కంపెనీకి మార్కెటింగ్ కన్సల్టెంటొకడున్నాళ్ళే, ఇప్పుడు చెప్పిన విషయం రేపటికి గుర్తుండదు గురుడికి. అతనితో గత వారంరోజులుగా కుస్తీ పడుతున్నా .. తద్వారా నాక్కూడా ఆ మతిమరుపు సోకింది. ఈ సారికిలా క్షమించెయ్యండి .. భావన గారే కాదు .. ఇంకా నేను చెప్ప మరచిన మిగతా బ్లాగర్లందరూ కూడా ..
శ్రీ .. హ హ హ, శెబాష్. మరి ఆ వెన్ను జలదరింపుని భావి టపాల్లోకి తర్జుమా చెయ్యండి!!
మీరు చెప్పిన వాటిలో నాకు కొంచం తెలిసినవి రాయాలని ఉన్నా, ఒకటి రెండు రాసినా ప్రచురించాలంటే ఏది ఎవరిని నొప్పిస్తుందో, ఏం గొడవ లేవదీస్తుందో అన్నటికంటే ముఖ్యంగా నాకు అల్ల్రౌండ్ పెర్స్పెక్టివ్ లేదేమో అని అనుమానం, ఎందుకొచ్చిన గోడవలె అని ఊరుకున్నాను (ఉదా - తెలంగాణా, ద్రౌపది). సినిమాలు, హాస్యం,.. లాటివైతే ఏ గొడవా ఉండదని ధైర్యం.
మీ టపా మాత్రం భలే ఊపునిన్చ్చింది రాయాలని.కనీసం ఒకటే genre కి పరిమితం కాకుండా ప్రయత్నిస్తాను.
భావనా వె వె వె !!!!! ఏమి అనుకోకండి. ఇవాళ్ళ ఒకరిని వెక్కిరించాలని ఇందాకట్నుంచి చూస్తున్నా. మీరు దొరికారు.
రాస్తా, రాసేస్తా, రాసేస్తున్నా.
మాస్టారు, ఇలా వీక్ డే లో మమ్మల్ని ఉద్రేకుల్ని చెయ్యడం మీకు తగునా?
కానీ ఈ విన్నపం, సూచన, విజ్ఞాపన .. పేర్లు ఉదహరించడం గురించి కానీ కొన్ని పేర్లు మర్చిపోవడం గురించి కానీ కానే కాదని ఈ పాటికి గ్రహించే ఉంటారు.
మూమూలుగా విశ్లేషణాత్మక టపాల్లో తప్పులు కనిపెడుతుంటారు బ్లాగర్లు.అలవాట్లో పొరబాటుగా నేను మీ టపాలో తప్పులేరుతున్నా. కాస్కోండి.
౧. ఈ టపా అమెరికా వాళ్ళకు మాత్రమేనా? మీరిలా అమెరికా బయట ఉన్న వాళ్ళను పట్టించుకోకపోవడం అస్సలు బాగా లేదు. :-) (ఇది ఒక టైపు వివక్ష అని మనవి చేసుకుంటూ, ఖండిస్తున్నానధ్యక్షా!)
౨. అందరినీ రెచ్చగొట్టి, ఆ మంటల్లో చలికాగుదామనుకోవడం ఏమీ బాగాలేదు. మీరు ఏ అనానిమాసురుల దాడికి భయపడో, బద్ధకపిశాచి చేతుల్లో ఇరుక్కునో, కథలు రాయడాన్ని ప్రోత్సహించడం ఆపేశారు. ఒక వేళ మీరు కొనసాగిస్తే, బహుమతి స్పాన్సరింగు (నా దగ్గరున్న బొమ్మరిల్లు వారి ఓ పాత పొట్టినవల) ఉడతా సహాయంగా చేపడదామని ఎన్ని రోజులుగానో కోరిక. అలా మిగిలిపోయింది.
౩. రాయలవారి ధరించి విడిచేసిన మాలిక సౌరభాలకు మా నాసికలను అడిక్టుఁ జేయించి, ఇప్పుడు ఆ డ్రగ్గు మాకు కాకుండా చేస్తున్నారు. (అదీ రాయల వారి పట్టాభిషేకం జరిగి ౫౦౦ యేళ్ళయిన శుభసందర్భంగా!). హెంత అన్యాయం?
౪. అప్పుడెప్పుడో దీపాలు వెలిగించారు. ఆ దీపం కొండెక్కింది!
కావున, మీరూ ఈ విజ్ఞప్తులను పరిశీలించాలని మనవి చేసుకుంటున్నాను.
మీ మొదటి పాయింటు .. మీ తీరుకున్నంత సేపు ఖండించండి, ఏం పర్లేదు :)
మీ మిగతా మూడు పాయింట్లకి ఈ టపాలో నా పిలుపుకీ ఏవ్హీ సంబంధం లేదు. కథల పోటీలు ఆపింది ఎవరికో భయపడీ కాదు, బద్ధకం మూలంగానూ కాదు (మిగతా వాళ్ళంతా కష్టపడి రాస్తుంటే నా బద్ధకానికొచ్చిన ఢోకా ఏం లేదు). ఒక్కొక్క పోటీకీ వచ్చిన పదిహేను ఇరవయ్యేసి కథలు చదివేందుకు తీరిక దొరక్క అలా వాయిదాలు పడి, ఆ రాసిన వాళ్ళు ఖాయిలా పడి .. దీన్ని మళ్ళీ కొనసాగిస్తాను ఎప్పుడో.
రాయలవారి వేషం నేనైతే ఇప్పటికి పక్కన పెట్టేసినట్టే. ఆ వేషం వేసేందుకు నాకంటే బోలెడు సమర్ధులు ఇప్పుడు బ్లాగ్లోకంలో తగినంత మండి ఉన్నారు. పొద్దు వారు పూనుకుంటే నా ప్రమేయం లేకుండానే భువన విజయం జరిపించవచ్చు.
దీపాల రిఫరెన్సు ఏంటో అర్ధం కాలేదు.
౪. సరిగ్గా తెలీదు కానీ, అప్పుడెప్పుడో గ్లోబల్ వార్మింగు గురించి మీరో బ్లాగు ఆరంభించి, కొంత దూరం తీస్కెళ్ళినట్టున్నారు. ఆ విషయం గురించి అడిగాను.
Will respond with some positive news shortly.
Thanks for reminding me abotu things that do matter :)
బ్లాగు పేరు http://antaryagam.blogspot.com