హీబ్రూ నించి స్ఫూర్తి పొందుదాం

Let's take a listen.

మనమూ తెలుక్కి ఒక వీరతాళ్ళ సంఘం ఏర్పరిస్తే ఎలాగుంటుంది?

ఆచార్య వేమూరి గారి వీరతాళ్ళ కార్యక్రమం ఆగకుండా కొనసాగుతుంటే బాగుండేది. హీబ్రూ సంఘానికి రోజుకి ముప్ఫైకి పైన విచారణలొస్తాయిట, ఫలాని చోట ఏ మాట వాడాలి, ఈ పదానికి అర్ధమేవిటీ, ఇలాగని!

'nuff said.

Comments

ఇస్రాయల్ వెళ్లిన నా స్నేహితుడొకాయన వారి హీబ్రూ వాడకం గురించి, దాని చారిత్రక నేపథ్యం గురించి ఇదివరకు ఒక సారి చెప్పారు. నిజంగా నమ్మలేకపోయాను. ఆయన ఈ విషయాలు సంస్కృత భాషకి అన్వయిస్తూ చెప్పి, భారత దేశం అన్ని ప్రాంతాలలోనూ ఈనాడు ఆంగ్లం వాడుతున్నట్టుగా మనదయిన సంస్కృతం ఎందుకు వాడకూడదు? అని అన్నారు.

సడే, వ్యవహారికంలో తెలుగు సంగతే అంతంత మాత్రం, ఇక దేవ భాష గురించెందుకంటారా...

హీబ్రూ భాష చరిత్రనుంచి మనమేదయినా నేర్చుకుని మన భాషలకి అమలుపరచగలమా అన్న వైపు కృషి సాగాలేమో.

కాస్త అసంబద్దమయినా ఇంకో విషయం. చైనా, జపాను వంటి దేశాలకి మౌలికంగా ఒకే భాష ఉండడం వారి పురోగమనానికీ, జాతీయ భావాలకి, దేశభక్తికీ కాస్త ఉపకరించిందేమో అనిపిస్తుంది.
rākeśvara said…
మా గోదావరి జిల్లాలకు ప్రత్యేక రాష్ట్రం గావాలి.
హర్ష .. నేనీ విషయాన్ని ప్రస్తావించడం తెలుగుని ఉద్దేశించే, సంస్కృతం గురించి కాదు.

రాకేశ్వర, అలాగే, ఇచ్చేశా :)
రెండు వేల ఏళ్లనాడే వాడుక భాషగా చచ్చిపోయిన భాషను తిరిగి ఒక దేశపు వాడుక భాషగా నిలబెట్టుకోగలగటం యూదలకే చెల్లు. వీళ్లకి సాష్టాంగనమస్కారాలు చెయ్యెచ్చు.

హర్ష, చైనాను సంఘటితంగా ఉంచింది భాష కాదు లిపి. వేర్వేరు భాషలు మాట్లాడినా (వాళ్ళు డయలెక్ట్స్ అంటారు కానీ నిజానికవి భాషలే) ఏ భాషలో వ్రాసినా ఇతరులు చదివి అర్ధంచేసుకోగల చిత్రలిపి.
Vasu said…
"మనమూ తెలుక్కి ఒక వీరతాళ్ళ సంఘం ఏర్పరిస్తే ఎలాగుంటుంది?"

అనగా ఏమి??

"ఆచార్య వేమూరి గారి వీరతాళ్ళ కార్యక్రమం ఆగకుండా కొనసాగుతుంటే బాగుండేది. " ఇది కూడా తెలియదు బొత్తిగా ఏదన్న లంకె ఉంటె ఇవ్వగలరు.

విచారణ కాన్సెప్ట్ బావుంది. బోలెడు సందర్భాలకి ఏ పదం వాడాలో సమయానికి దొరకట్లేదు, ఏదోకటి దొరికినవి ఎబ్బెట్టుగా ఉంటున్నాయి సరిగ్గా సరిపోయేవి దొరకట్లేదు. ఇప్పుడు ఈ వ్యాఖ్య లో అప్పుడే ఆ సందర్భం వచ్చింది.

ఆ వీరతాళ్ళ సంఘం దాని గురించే ఐతే నేను సిద్ధం.
SRRao said…
కొత్తపాళీ గారూ !
మీరు చెప్పింది నిజమే ! స్పూర్తి పొందాలి. మన భాషను బ్రతికించుకోవాలి.
తెలుగుపదం ఆ స్థాయికి ఎదుగుగాక!
@ Vasu .. ఎవరూ పుట్తించకుండా మాటలెలా పుడతాయి, వెయ్యి వీడికి రెండు వీరతాళ్ళు అనే ఘటోత్కచుడి (మాయాబజారు) డయలాగు మూలం ఈ వాడుకకి. వీరతాళ్ళు పేరిట ఆచార్య వేమూరి వేంకటేశ్వర్రావుగారు కొన్ని నెలలు ఒక శీర్షిక నిర్వహించారు సిలికానాంధ్రా వారి సుజనరంజని జాల పత్రికలో, కొత్త తెలుగు పదాలు పుట్టుంచడం గురించి. సుజనరంజని పాతసంచికల్లో మే జూన్ 2007 సంచికల్లో చూడండి.
మరణించిన రెండువేల సంవత్సరాల తరువాత ఫీనిక్సు పక్షిలా పునర్జీవితమైన్ ఆధునిక ప్రపంచ భాషల్లో ఒకటిగా మారిన హిబ్రూ భాషకథ భాషాప్రేమికులకు 'బైబిల్' లాంటిది (literally!). ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తరువాత హిబ్రూను అధికార భాషగా నిర్ణయించాక చూసుకుంటే వారికి మిగిలి ఉన్న ఒకేఒక లిఖిత సాహిత్యం పాత నిబంధన గ్రంధం ఒక్కటే. అందులోని పదాలనుండే ఆధునిక భావనలకు పదబంధాలను సృష్టించవలసి వచ్చింది. ఉదాహరణకు, విద్యుత్తు అన్న మాటకు ఏంపదం వాడాలా అని వెదికి బైబిల్లో దేవుని తలచుట్టూ ఉన్న కాంతి చక్రానికి వాడిన పదం "హష్ మల్" ను ఖాయం చేశారు. దేవుని సంజ్ఞ అనే అర్థంలో బైబిల్లో వాడిన 'రాంజోర్' అన్న పదాన్ని 'traffic signal' కు వాడారు. ఇలా ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళలో సకల విజ్ఞానశస్త్రాలనూ వారిభాషలోకి అనువదించుకొన్నారు. వారిభాషలోనే చదువుకొంటున్నారు. మన భారతీయ భాషలేవీ ఆధునిక పదసంపదలో నేటి హిబ్రూ కాలిగోటికి కూడా భాషకు దరిదాపులకు కూడా రాలేవు. పదాలను ప్రామాణీకరించే అకాడమీలాంటిది ఒక హిందీకి తప్ప మరే భారతీయ భాషకూ లేకపోవడం ఒక పెద్ద లోటు.
వీవెన్ .. తెలుగుపదాన్ని సమయానికి గుర్తు చేసినందుకు నెనర్లు.
కూడలి చూసే బ్లాగరులారా .. కూడలి పేజీ పైభాగంలో ఉండే పతాక భాగంలో ఈ వారం తెలుగు పదం అని ఒక దీర్ఘ చతురస్రం కనిపిస్తోంది చూశారా ఎప్పుడన్నా? దానిమీద క్లిక్కితే అది కూడా మిమ్మల్ని తెలుగుపదం గూటికి తీసుకెళ్తుంది. ఉపయోగించండి, మీకు తెలిసింది పంచుకోండి.