నా కథల పుస్తకం దొరికే వివరాలు


హైదరాబాదులో కాచిగూడాలో ఉన్న నవోదయ బుక్ హౌసులో రేపటినించీ దొరుకుతుందీ పుస్తకం.

కాచిగూడా వెళ్ళడం దూరం, కష్టం అనుకుంటే, హాయిగా విజయవాడ నవోదయ పబ్లిషర్సుని సంప్రదించండి. మీ యింటికే అందేట్టు పోస్టులో పంపిస్తారు. వివరాలివి..
Navodaya Publishers
Karl Marx Road,
Vijayawada.
520 002
Phone : (0866) 2573500
e-mail : vjw_booklink@yahoo.co.in

అమెరికాలో ఉన్న మిత్రులకి .. పుస్తకాల్ని అమెరికాకి దిగుమతి చేసుకునే ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. అందుబాటులోకొచ్చాక తెలియజేస్తాను.
ఎవరో AVKF.org గురించి అడిగారు. వాళ్ళు కొత్తగా విడుదలయ్యే పుస్తకాల్ని గమనిస్తూనే ఉంటారనీ, ఆయా పుస్తకాలకి తమ సిబ్బందితో చిన్న పరిచయాలు రాయించి డేటాబేస్లో ఎక్కిస్తారనీ, ఇదంతా జరిగేందుకు కోంచెం సమయం పడుతుందనీ తెలిసింది. బహుశా ఇంకో వారంలో ఆ సైట్లో కూడా దొరకొచ్చు.

Comments

Welcome back :-) ముఖచిత్రం చాలా చాలా బావుంది!
Vasu said…
ఈ కిటికీ అమెరికా నించి మీ విజయవాడ (జ్ఞాపకాల) ని చూపిస్తుందన్నమాట. బావుంది
కొత్తపాళీ గారూ, బందుల పుణ్యమా అని మీ పుస్తకం ఇంకా నవోదయా వాళ్ల దగ్గరకు రాలేదనుకుంటాను. ఈ రోజు పుస్తక ప్రదర్శనలో వారి స్టాలులో అడిగాను.ఇంకా రాలేదు..ఈ పదిరోజుల్లో వస్తే ప్రదర్శనలో పెడతామన్నారు.
నిషి .. అవును నాక్కూడా నచ్చింది. లోపలి బొమ్మలు కూడా బాగా వచ్చాయ్. (మరీ ఊరిస్తున్నానా?)

వాసు, కానే కాదు :) టైటిలుకి ఆ బొమ్మ ఆర్టిస్టు ఇచ్చిన ఒక వ్యక్తీకరణ మాత్రమే :)

సిసిము గారూ .. అలాగా? విజయవాడ నించి వారం క్రిందటే పంపామని చెప్పారు.
@ aswinisri .. తెంగ్లీషులో రాసిన కారణంగా మీ వ్యాఖ్య ప్రచురించ లేదు. దయచేసి పూర్తిగా తెలుగులో కానీ పూర్తిగా ఇంగ్లీషులో కానీ రాయండి.
శ్రీ said…
నిన్నటివరకు కృష్ణాలో బంద్!ఈరోజే మీ పుస్తకం కొనుక్కుంటాను
Anonymous said…
Mr.kottapaali! weh! weh! Weh!(this is an interjection, therefore does not belong to any language ha! ha! ha!)This comment is for the reply you have given to me!Anyway! congrats!this is for the information you have given in the blog.
AB said…
దన్యవాదాలు, వీలైంత త్వరాగా చదివి మీకు మెయిల్ చేస్తాను.
Pustakam.net లో మీ పుస్తకము గురించి చదివాను. అభినందనలు. వీలైనంత త్వరలో చదవాలనుకుంటున్నాను.