విజయవాడ కబుర్లు

రంగు రుచి వాసన ఆ పైన పంచేంద్రియాలకీ అందని ఆత్మానుభవాలు ఇంకా పైన వీటన్నిటికీ అతీతమైన అలౌకికానందాలు .. ఎన్నెన్ని ఎన్నెన్ని .. రోజూ నన్ను ముంచెత్తుతున్న ఆ వరదలో మునిగి పోనా తేలిపోనా కొట్టుకు పోనా ..

అమ్మని గురించైనా రాయడం సాధ్యమవుతుందేమోగాని మాతృభూమిని గురించి మాత్రం సాధ్యం కాదు .. కనీసం నాకు. రాయడం అంటు వచ్చేప్పటికి ఏదో ఒక దృక్కోణం ఉండాలి - హాస్యమో, ప్రేమో, ద్వేషమో, ఎక్కిరింపో - విజయవాడని గురించి వాటిల్లో ఏ ఒక్క భావాన్నీ కోణాన్నీ ఎంచుకోలేను. ఎవరో మిత్రులు అడిగారు .. మాతృదేశ పర్యటన అనుభవాలు రాయమని .. ఏం రాయను?

కొన్ని విషయాల్లో విజయవాడ (భారద్దేశం) చాలా మారిపోయింది .. కొన్ని విషయాల్లో అస్సలు మారలేదు. జరిగిన మార్పు మంచిదో, మార్పు చెందకుండావున్న స్థిరత్వం చెడ్డదో మరి నాకు తెలియదు. కానీ ఉన్న పరిస్థితి మాత్రం ఇది. వూరూ దేశం లాగానే మనుషులూనూ .. కొన్ని విషయాల్లో చాలా మారిపోయారు, కొన్ని విషయాల్లో నలభయ్యేళ్ళ కిందటా ఎలాగో, అలాగే ఉన్నారు.

ఒకటి మాత్రం నిజం .. వాళ్ళ ఆప్యాయత .. అభిమానం .. ప్రేమ .. అలాగే ఉన్నాయి, నన్ను తడిపేస్తూనే ఉన్నాయి.

పుస్తకం గెటప్ బాగా వచ్చింది, నేను కోరుకున్నట్టుగా. అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నా. విజయవాడలో అయితే, ఏలూర్రోడ్డు మీదున్న నవోదయలో దొరుకుతుంది. మిగతా వూళ్ళలో వివరాలు కనుక్కుని చెబుతాను.
మళ్ళీ కలుద్దాం.

Comments

Vasu said…
శుభాకాంక్షలు. రేపు కదా ఆవిష్కరణ.
మీ పుస్తకం మంచి ఆదరణ పొందుతుందని గట్టి నమ్మకం ఉంది .
Chari Dingari said…
Congratulations, Can I get it from avkf.org?
"ఒకటి మాత్రం నిజం .. వాళ్ళ ఆప్యాయత .. అభిమానం .. ప్రేమ .. అలాగే ఉన్నాయి, నన్ను తడిపేస్తూనే ఉన్నాయి. " very true.

మీ పుస్తకావిష్కరణ సభ జయప్రదం కాగలదని ఆశిస్తూ.
"రంగు రుచి వాసన ఆ పైన పంచేంద్రియాలకీ అందని ఆత్మానుభవాలు ఇంకా పైన వీటన్నిటికీ అతీతమైన అలౌకికానందాలు ........అమ్మని గురించైనా రాయడం సాధ్యమవుతుందేమోగాని మాతృభూమిని గురించి మాత్రం సాధ్యం కాదు .. "

చాలా చాలా బాగున్నాయి
ఇంతేనా అండి బెజవాడ కబుర్లు ...
కాస్త గుంటూరులో ఎక్కడ దొరుకుతుందో కూడ సెలవిద్దురూ ..!
మీ బ్లాగుని చూడటం ఇదే మొదటిసారి అండి .నేనింకా ఈ బ్లాగ్లోకంలో శైశవ దశలో వున్నాను.
చాలా బ్లాగుల్లో మీ వ్యాక్యలు చూసాను.
చాలమంది బ్లాగర్లు మి గురంచి రాస్తారు..
కాని కూడలిలో మీ బ్లాగు టపాని చూడలేదు.
మీ బ్లాగులో "ఈ బ్లాగులో వచ్చే కొత్త టపాలూ, వ్యాఖ్యలూ కూడలిలోనూ జల్లెడలోనూ కనిపించవు." చూస్తే అప్పుడు అర్థమైంది.
మాలతి said…
శిరికందంబంలో ఫొటోలు ఇప్పుడే చూసేను. చాలా బాగున్నాయి. మీరు తీరిక చేసుకుని సభలో ఎవరు ఏం మాటాడేరో కూడా రాయాలి. మీపుస్తకావిష్కరణ జయప్రదంగా జరిగినందుకు, మీపుస్తకం గెటప్ అందంగా వచ్చినందుకు, ... మరిన్ని కథలూ అవీ రాయాలని కోరుకుంటూ, అభినందనలు తెలుపుకుంటున్నాను.
- మాలతి
మూడేళ్ళలోనే, నాకు, బెజవాడలో చాలా మార్పులు కనిపించాయి. ఆ మార్పు మంచో చెడో అప్రస్తుతం. మీరు గమనించిన మార్పులను, With out judging[In a neutral perspective], వ్రాస్తే సంతోషించేవాళ్ళలో నేను ఒకణ్ణి.

________________________________
ఒకటి మాత్రం నిజం .. వాళ్ళ ఆప్యాయత .. అభిమానం .. ప్రేమ .. అలాగే ఉన్నాయి, నన్ను తడిపేస్తూనే ఉన్నాయి.
_________________________________
నిజమే, I agree.

ఈ నెలాఖరులో, బెజవాడ వెళ్ళినప్పుడు, మీ పుస్తకం కొని చదువుతాను.
శ్రీ said…
మీ పుస్తకం విజయవాడ నవోదయాలో కొనుక్కుంటాను లేండి.

14 బ్లాగర్స్ డేకి మీరు హైదరాబాద్ వస్తున్నారా?
భావన said…
కొత్త పాళి గారు మా కోసం నాలుగు ఫోటో లు కూడా ప్లీజ్. ఇప్పుడే రావు గారు పెట్టిన పిక్చర్స్ చూసేము. అభినందననలు. మరి మేమెట్లా కొన్నుకోవాలండి పుస్తకం?
"అమ్మని గురించైనా రాయడం సాధ్యమవుతుందేమోగాని మాతృభూమిని గురించి మాత్రం సాధ్యం కాదు .. "
ఇది మాత్రం అక్షరసత్యం! మీ అనుభూతుల జల్లులను ఇక్కడివరకూ మోసుకొచ్చి మాతో పంచుకోమని, మీ రాక కోసం ఎదురుచూస్తూ..
kiranmayi said…
కళ్ళలోనించి నీళ్ళు వచ్చాయండి మీ పోస్ట్ చదువుతుంటే. మాతృ భూమిని గురించి వ్రాయాలంటే కష్టమే. మీ పుస్తకావిష్కరణ జయప్రదం అయ్యిందని అనుకుంటున్నాను. తొందరగా విశేషాలు వ్రాయండి.
teju said…
it is very nice and thankyou for giving such a nice book