నేను చూసినంతలో, ఈ దేశంలో నా వృత్తి సంబంధమైన జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ నాకు పరిచయమైన అమెరికన్లందరూ బాగా కష్టపడి పనిచేసే స్వభావం కలిగినవారు, స్వశక్తి మీద ఆధారపడి పైకి రావాలనే తపన కలిగినవారు.
ఈ నిర్ధారణలో వేరే దాగిఉన్న ఉద్దేశ్యాలేమీ లేవు. అమెరికన్లు కానివారు కష్టపడి పనిచెయ్యరని కాదు. దేశప్రజలందరూ కష్టపడి పనిచేసేస్తారనీ కాదు. ఇలాంటి నిర్ధారణని సర్వత్రా అన్వయించడం సాధ్యమయ్యే పని కాదు. నిర్ధారణకి వ్యతిరేకమైన ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి, సందేహం లేదు. నా అనుభవం పరిధి చాలా చిన్నది అని ఒప్పుకుంటూనే నాకెదురైనవీ, పబ్లిగ్గా వార్తల్లో తెలియ వచ్చినవీ కొన్ని ఉదాహరణలిస్తాను.
ముందుగా పబ్లిక్ వార్తల నించి.
హాలీవుడ్ నటుడు నికొలాస్ కేజ్ (Nicholas Cage) 1996 లో లీవింగ్ లాస్ వేగస్ అనే సినిమాకి ఆస్కార్ గెల్చుకున్నాడు, తదుపరి అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తారగా ఎదిగాడని చాలామందికి తెలిసిన విషయం. గొప్పదర్శకునిగా పేరుపొందిన ఫ్రేన్సిస్ ఫోర్డ్ కోపొలా (Francis Ford Coppola) సోదరుని కొడుకు అనే సత్యం చాలామందికి తెలియదు. కోపొలా కుటుంబ సభ్యులు చాలామంది అప్పటికే సినీరంగంలో పేరుమోసినవారున్నారు. కుటుంబం పేరువల్లనో, లేక చుట్టాల ప్రాపకంవల్లనో కాక తన స్వశక్తితోనే పైకి రావాలని పద్ధెనిమిదేళ్ళ వయసులోనే తన ఇంటిపేరు మార్చుకుని సినీరంగంలో ప్రవేశించాడు. ఎన్నో లోబడ్జెట్ చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు వేశాడు. ఇతను పెద్దతార కాకమునుపు నటించిన చిత్రాల్లో Guarding Tess (1994), Amos & Andrew (1993) మెచ్చదగినవి. ఇటీవల ఒక్క సినిమాకి ఇరవై మిలియన్ డాలర్లు పారితోషికం అందుకున్న నికొలాస్ తనకి ఆస్కార్ తెచ్చిపెట్టిన Leaving Las Vegas కి తీసుకున్న పారితోషికం అందులో వందోవంతు కూడా ఉండదు.
అమెరికాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన వారెన్ బఫెట్ (Warren Buffett) గారి కొడుకులు హోవర్డ్ మరియు పీటర్ బఫెట్. హోవర్డ్ తనంత తానుగా వాణిజ్య రంగంలో ఎదిగి, అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించి ప్రస్తుతం వారి సొంత పొలాన్ని నిర్వహిస్తున్నారు. రెండో కొడుకు పీటర్ మొదటినించీ తనకిష్టమైన వ్యాపకమైన సంగీతంలో కృషిచేసి అనేక విజయాలు సాధించారు. Dances with the wolves అనే చిత్రానికి నేపథ్యసంగీతం అందించి ఆస్కార్ గెల్చుకున్నారు.
గొప్ప రాజకీయ నాయకుల సంతతి కూడా చాలామంది తమతమ రంగాల్లో స్వశక్తితోనే విజయాలు సాధించిన దృష్టాంతాలు చాలా ఉన్నాయి.
నా వ్యక్తిగత పరిచయాల్లో ఇటీవల తారసపడిన ఒక యువకుడి కథనం నన్ను చాలా అబ్బురపరిచింది. ఈ మధ్య కొత్తకారు కొనాలని కారుడీలర్లచుట్టూ తిరుగుతున్నా. ఒక డీలరు దగ్గర జేసన్ అనే సేల్స్‌మేన్ ఆ రోజు నాకు కార్లు చూపిస్తున్నాడు. సుమారు ఇరవయ్యెనిమిదేళ్ళుంటాయి. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, నా వృత్తిరీత్యా కార్లకంపెనీలతో నాకున్న అనుబంధాన్ని గురించి చెబుతున్నా అతనితో. మా నాన్న కూడా జెనెరల్ మోటార్స్‌కి పని చేసేవారు - కొన్నేళ్ళ కిందట రిటైరయ్యారు అన్నాడు జేసన్. అలాగా, ఏ ప్లాంట్‌లో పనిచేసేవారు అన్నా. అబ్బే ప్లాంట్‌లో కాదు అన్నాడు. ఓహో, ఏదో ఇంజనీరో మేనేజరో అయుంటారు అని, ఏ డిపార్టుమెంట్లో అనడిగా. అతను చిన్నగా నవ్వి, ఏ డిపార్టుమెంటని చెప్పను? ఆయన కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా రిటైరయ్యారు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదే సన్నివేశాన్ని భారద్దేశంలో ప్రతిబింబిస్తే, ఒక టాటా కంపెనీకో, రిలయన్స్‌కో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసినాయన కొడుకుని ఒక కార్ డీలర్‌షిప్‌లో సేల్స్‌మేన్‌గా ఊహించగలమా?
ఈ విషయాలన్నీ నా అమెరికన్ సహోద్యోగితో చర్చిస్తుంటే అతనొక మాటన్నాడు. అమెరికాలో ఎస్టేట్ శిస్తులు (అంటే వంశపారంపర్యమైన ఆస్తి తరువాతి తరాలకి బదలీ అయేప్పుడు కట్టాల్సిన శిస్తు) చాలా ఎక్కువ వుంటాయి-ట. అందువల్ల, తండ్రి తాతలు ఎంతెంత ఆస్తులు సంపాయించినా, తరువాతి తరాల చేతులో మిగిలేది చాలా తక్కువే. అదీకాక, చాలా మంది గొప్ప ధనవంతులు తాము సంపాయించిన ఆస్తిలో సింహభాగాన్ని ఏదన్నా ఫౌండేషనుగానో ట్రస్టుగానో ఏర్పరిచి ప్రజోపయోగ కార్య్క్రమలకి ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఇవన్నీ కాక, అమెరికను మనస్తత్వంలో అల్లుకుపోయి ఉన్న స్వేఛ్ఛాప్రియత్వం కూడా ఒక కారణం కావచ్చు.
ఏదేమైనా, ఇలా స్వశక్తితో కష్టపడి పైకిరావడమనే ఆదర్శం వల్ల, అమెరికను సమాజంలో కొత్తతరాలు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా, సృజనాత్మకంగా ముందడుగు వేస్తూ వస్తున్నాయని నాకనిపించింది.

Comments
నా మటుకు నాకు ఎప్పుడు ఆలోచించినా ఇదే ముఖ్య కారణం అనిపిస్తుందండి. మీరు చెప్పిన మిగిలిన కారణాలు కొంత ఉన్నా Individuality లేనపుడు ఎంతో కొంతైనా పర్లేదు అని వారసత్వ సంపదపై ఆధారపడే అవకాశాలు మెండు.
మురళి .. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా ఉంది - చిన్నా చితకా పని చెయ్యాల్సి వచ్చినందుకు సిగ్గు పడరు, నిజమే. శ్రీఫాద వారి తాపీమేస్త్రీ రామదీక్షితులు బీయే గుర్తొస్తున్నాడు కదా?
వేణూ .. వోకే.
అశ్విన్ .. కాదు. చదువుకీ సంస్కారానికీ సంబంధం నాకైతే కనబళ్ళేదు.
అమెరికాలో ఏ పనైనా చేయడానికి సిగ్గుపడకుండా చేసిన వ్యక్తి ఇండియా వచ్చి అదే పని ఇక్కడ చేయగలరా ?..(..చెయ్యరు ...నా జవాబు .)...ఎందుకని ? అర్ధం కాదు .
చిన్ని .. మీ గొంతు కోసమే ఎదురు చూస్తున్నా. The First voice of dissent! ఇప్పటిదాకా రాకపోవడమే ఆశ్చర్యం. మీరు లేవనెత్తిన అబ్జెక్షన్ల కోసమనే అంత పొడుగు డిస్క్లైమరు పెట్టా! :)
పోనీ అదలా వొదిలెయ్యండి. మీ వాదనే ఒప్పుకుందాం కాసేపు. శాతాలు నిష్పత్తుల సంగతి నాకు తెలీదు. ఇండియాలో నా వుద్యోగ కాలం సుమారు రెండేళ్ళు. అమెరికాలో సుమారు ఇరవయ్యేళ్ళు. ఆ రెండేళ్ళల్లో, నేను పని చేసిన రెందు సంస్థల్లో తమకున్న ప్రపతి ప్రాపకాన్నుపయోగించుకుని పైకి పాకాలని చూసే వాళ్ళ జాబితా రాస్తే చాంతాడంత అవుతుంది. ఈ ఇరవయ్యేళ్ళల్లో అటువంటిది ఇంచుమించుగా చూళ్ళేదనే చెప్పొచ్చు. చూస్తే గీస్తే .. కొంత వివిలోనే ఉంది, ఉద్యోగ పరిధిలో అసలు లేదు.
కానీ మళ్ళీ ఒప్పుకుంటాను - నా అనుభవ పరిధి చిన్నదే!
బహుశా అభద్రదతా వలన కూడా కావొచ్చెమో?
"ఒళ్ళు వంచి ఆర్జించే ప్రతి ఒక్క డాలర్
ఓపిగ్గా నేర్పుతుంది డిగ్నిటీ ఆఫ్ లేబర్
ఇండియాలో కలవారి బిడ్డలు కొందరు తిరుగుతారు గాలికి
అమెరికాలో పడుచు విధ్యార్ధులు పనిచేస్తారు కూలికి "
అమెరికా ఈ సంస్కృతికి కుటుంబ వ్యవస్థ కూడా కారణం అనిపిస్తుంది నాకు. మన దేశంలోలా తల్లితండ్రులకి , పొగేసి తమ పిల్లలకివ్వాలి అనే అలోచన తక్కువగా ఉండడం కూడా ఇందుకు కారణం.
వెంకటరమణ .. వోకే.
లలిత .. ఆరుద్ర మాటలు బాగున్నై.
వాసు .. కావచ్చు.
౧. భారతదేశంలో జఱిగే అనేక విషయాలపై భోగట్టా సేకరించే సంస్థలు గానీ, వ్యక్తుల విజయాల మీద పుస్తకాలు/ వ్యాసాలూ రాసేవారు గానీ, రాస్తే కొని చదివేవారు గానీ ఎవరూ లేరు. అదొక్కటే కాదు, ఈ దేశంలో ఏ విషయం మీదా మీకు గణాంకాలు గానీ, వివరాలు గానీ లభించవు. అందుచేత ఇతర దేశాల్లో మాదిరే కష్టించి పైకొచ్చినవాళ్ళు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నప్పటికీ అది మనకి తెలియక మనమీద మనమే తప్పుడుగా వ్యాఖ్యానించుకుంటున్నాం. నేను వ్యక్తిగతంగా చాలామందిని చూశాను. వారిలో నా బాస్ లున్నారు. నా దగ్గఱ చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. నా బంధువులున్నారు. నా స్వస్థలం గుంటూరులో నా పరిచయస్థులలోంచి అలాంటివారిని కనీసం ఒక వందమందిని చూపించగలను. అలా దేశమంతటా ఉంటారు. ఉన్నారు కాబట్టే ఈ దేశం 1950 ల నాటి సోషలిస్టు వ్యవస్థకి భిన్నంగా ప్రభుత్వ సంస్థల హస్తాల్లోంచి బయటపడి ఈనాడు పాఠశాలలూ, వైద్యశాలలనుంచి కంప్యూటర్లూ, ఎయిర్ లైన్సుతో సహా అన్ని రంగాల్లోను స్వదేశీ ప్రైవేట్ సంస్థల ద్వారా నడుపుకునేటంత గొప్ప శక్తిసామర్థ్యాల దిశగా పయనించగలిగింది. కష్టపడకుండానే అంత ప్రైవేట్ పెట్టుబడి ఎలా పోగుపడుతుంది ?
౨. నిజానికి భారతీయులతో పోలిస్తే అమెరికన్లు వట్టి సోమరిపోతులు. వాళ్ళు ఆ సోమరితనాన్ని వ్యక్తిగతాల వెనుకా, హక్కుల వెనుకా దాచుకుంటారు. వాళ్ళలో కొద్దిమంది శ్రమజీవుల్ని చూసి. చూపించి అమెరికన్ లంతా ఏదో సాధించేస్తున్నారంటే నేను నమ్మజాలను. అయితే దాన్ని ఒక వ్యక్తిగత అభిప్రాయంగా గౌరవిస్తాను. భారతదేశంలో 24 గంటలూ పనిచేసే హోటళ్లున్నాయి. 24 గంటలూ పనిచేసే వైద్యులున్నారు. 24 గంటలూ పనిచేసే పోలీసులున్నారు (నిజానికి మన పోలీసులకి పనిగంటలూ, సెలవులూ లేవనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు చెబుతున్నాయి). అర్ధరాత్రి ఫోన్ చేసి అడిగినా doubts clarify చేసే లెక్చరర్లున్నారు. ఏరి చూపించండి ఇలాంటివాళ్ళని కనీసం ఒక్కఱిని అమెరికాలో ? ఇక్కడే కాక అన్ని దేశాల్లోను భారతీయులు కష్టించి పనిచేసే జాతిగా గుర్తింపు పొందారు. నా ఉద్దేశంలో భారతీయులు పని కోసం వారాంతాన్ని కోరుకుంటారు. తద్భిన్నంగా అమెరికన్లు వారాంతం కోసమే పనిని కోరుకుంటారు.
౩. భారతీయులు తమ తరువాతి తరాలకోసం సంపాదించడం, అందునిమిత్తం పొదుపు చేయడం చాలా మంచి విషయం. ప్రపంచమంతా అమెరికన్ల మాదిరే కేవల వర్తమాన వాదులై జీవితాన్ని నమిలేసి తుక్కులా ఊసిపారేస్తే భావితరాల గతి అధోగతే. భావితరాల పట్ల ఏ రూపంలో బాధ్యత గలిగి ఉండడమైనా ప్రోత్సాహనీయం. అలాంటి బాధ్యతాభావం ఉంది కనుకనే ఇండియా అమెరికాలాగా దివాలా ఎత్తలేదు. ఎందుకంటే ఇక్కడ కంపెనీలకే కాక కుటుంబాలక్కూడా నికరమైన Asset base ఉంది. అమెరికన్ల మాదిరి అది చెక్కకొంపల తుక్కు Assets కావు. అదీగాక భారతీయులు ఎంతో అవసరమైతే తప్ప అప్పుచేయరు. అదే వారిని ప్రపంచవ్యాప్తమైన ఆర్థికమాంద్యం నుంచి రక్షఱేకులా కాపాడింది. ఇటీవలి విదేశ వాణిజ్య పరిణామాల ఫలితంగా భారతదేశంలో వృద్ధిశాతం (growth rate) తగ్గిపోయింది. కానీ వ్యవస్థ మాత్రం అలాగే చెక్కుచెదఱకుండా ఉంది. ఈ సందర్భంగా భారతీయుల పొదుపు వారి సంపాదనలో 33 శాతం అని చెప్పుకోవడానికి నేను గర్విస్తాను.
అమెరికన్లకి దేశం పట్లనే కాదు, కనిపెంచిన తల్లిదండ్రుల పట్లా, భార్యాబిడ్డల పట్లా కూడా ఏ విధమైన బాధ్యతా లేదు. వాళ్ళని చూసి మనమెందుకు నోరు వెళ్ళబెట్టాలో నాకర్థం కాదు. బాధ్యత లేనివాళ్ళు శ్రమజీవులు కావడం అసాధ్యం. పాపం, వాళ్ళు నిజంగా అంత శ్రమజీవులే అయితే అమెరికాలో శరీరశ్రమ అవసరమైన అన్నిరకాల బండలాగుడు పనులకీ హిస్పానిక్కులే ఎందుకు దిగుతున్నారో, ఒక్క స్థానిక అమెరికన్ కూడా ఎందుకు మూటలు మొయ్యడో తెలుసుకోవాలని ఉంది. స్థానిక US పౌరులు నడ్డివంగని, మడత నలగని వైట్ కాలర్ పనులు తప్ప ఇంకేమీ చెయ్యడానికి ఎందుకు ఇష్టపడరో నాకు తెలుసుకోవాలనుంది.
తాడేపల్లిగారూ, అలా ఉంది నా పరిస్థితి. మన దేశంనించి ఉదాహరణలు చెప్పుకోవాలంటే ఎవరిదాకానో ఎందుకు మా అమ్మా అప్పలే ఉన్నారు. మా అప్ప వాళ్ళ నాయన బ్రిటీషు హయాములో పేద్ద ఆఫీసరు. ఆయన పలుకుబడి ఉపయోగించుకుని ఉంటే ఈయన ఎన్ని అందలాలైనా ఎక్కి ఉండొచ్చు. స్వశక్తిని నమ్ముకుని స్వస్థలమైన సేలం నగరాన్ని వదిలి గుంటూరు ఏసీకాలేజిలో ఆచార్యులుగా చేరారు. తదుపరి విజయవాడ పట్టణంలో పదిమంది గౌరవించే విద్యావేత్తగా పేరుపొందారంటే అది ఆయన వ్యక్తిత్వ బలమే కాని వేరు కాదు. అలాగే మా అమ్మ కూడా. మా అమ్మ గురించి చెప్పడం మొదలు పెడితే ఇక్కడ చాలదు. సందర్భోచితంగా వేరెక్కడైనా రాస్తాను.
స్వయంకృషి, ప్రైవేటు పెట్టుబడుల కూర్పు గురించి మీరు చెప్పిన పాయింతు బావుంది. అది సత్యమే కూడా.
అలాగే అమెరికా నించి నే చెప్పిన దాణికి వ్యతిరేక ఉదాహరణలూ చాలా చెప్పుకోవచ్చు. బుస్షు పుత్రులూ, ఇత్యాదులు. అందాకా ఎందుకూ, మా వూళ్ళోనే ఒక త్రాష్టపు దెయ్యం ఒకడుండేవాడు. కాంగ్రెస్వుమన్ అయిన తల్లి పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి డిట్రాయిట్ మేయర్ అయ్యాడు అతి పిన్న వయసులో. ఒక పక్కన వ్యక్తిగత విలాసాలకి విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తూ, నగరాన్ని అంతకంతకీ కూపంలోకి తోసేశాడు. చివరికి అవినీతి కేసులో పట్టుబడి జైలుకెళ్ళాడు.
మీరు చివరి పేరాలో వెలిబుచ్చిన అభిప్రాయాలు మాత్రం శుద్ధ తప్పు. ఒకసారి అమెరికా వచ్చి నిజమైన అమెరికాని మీరే చూడండి.
తాదేపల్లి గారు మీరు చెప్పిన ఆఖరి పేరా మాత్రం అస్సలు నిజం కాదండి. ఇక్కడ వాళ్ళు శ్రమ చేస్తారు కాని శ్రమ కు తగ్గ ప్రతిఫలం లేకుండా తక్కువ ఖరిదూ లో స్పేనిష్ వాళ్ళ ను తెచ్చుకుంటారు బిజినెస్స్ వాళ్ళు. ఆ విధమైన శ్రమ దోపిడి సోషలిస్టిక్ దేశం మన దేశం లోనే చేస్తున్నారు ఇంక కేపిటలిస్టిక్ దేశం చెప్పేది ఏమి వుంది అండి..
-- తాడేపల్లి
యెనానిమిషులకి .. ఈ మట్టుకి మీ వ్యాఖ్య అభ్యంతరకరంగా లేదనే భావించి ప్రచురిస్తున్నాను. అవకాశం ఉంది గదాని, విభేదించాల్సి వచ్చినప్పుడల్లా యెనానిమిషులు కానక్కరలేదు. మీ పేరు ధైర్యంగా చెప్పొచ్చు. ఎవ్వరూ తలగొట్టి మొలెయ్యరు!
Meher,
You said it!
RK
From Economic Points for Immigration:
"In 2007, foreign born workers made up nearly half the workers with less than high school education. The US needs thse workers to fill seasonal and unskilled jobs". I just found this googling once. Many more such reports have to be studied for a better picture. I also have doubts about various philanthraphic foundations. For a long time their interest seemed to coincide with American foreign and business interests.
చాల చాల బాగా విశ్లేషించారు.నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను
According to a recent study by BBC, Americans were found to be the most charitable in the world. I personally know a few people who help out in soup kitchen, donate a good portion of their incomes. When I met with an accident, I got free sessions physical therapy sessions, when my insurance delayed approvals. I am not saying that there are no charitable people in India, just that Americans are as charitable.
People are as concerned about their family here as any other place. I personally know many people in India who dont care about their parents and parents do not really care about their children.
People are the same everywhere. Their basic nature and insecurities are the same. Social condition make people behave differently.
Meher, Hollywood is as much representation of America as Bollywood is of India.
వ్యవసాయం మీద కూడా నమ్మకమైన ఆదాయం ఇప్పటికీ లేదు.
మన తరువాత తరం కనీస సౌకర్యాలతోనైనా బతకాలంటే ఎంతో కొంత ఆస్తి సంపాదించాలి.
కాని ఇప్పుడు అంత అభద్రతాభావం అవసరం లేదు.
బాగా చదువుకున్నవాళ్ళకి ఉద్యోగం ఇవ్వాళ కాకపోతే రేపైనా వస్తుంది.
అందుకే మధ్యతరగతివాళ్ళంతా తల తాకట్టు పెట్టైనా పిల్లలని చదివిస్తున్నారు.
బహుశా ఇంకో తరం తరువాత ఆస్తులమీద ఆసక్తి తగ్గుతుందేమో?
riksha tokkina vaadu kotiswarudu aite atadi koduku malli riksha tokki batuku modalu pettallaa!
cheppulu kutte vaadi koduku tandri ceppula showroom vadilesi malli cheppulu kutti batakala?
tandri varasatvam sampada naipunyam andukunnappude taruvta taram inka kotta purogati saadhincha galaru. oka taram kante maroka taram merugugaa vundalante tallidandrulu tama santaanaaniki tama sampadalu aavishkaranalu andinchali. appudu mari kotta unnatamaina samaajam erpadutundi.
ఇక ఎస్టేటు శిస్తును చాలామంది ధనవంతులు ట్రస్టులను స్థాపించి ఆ ట్రస్టులకు తమ వారసులని అధిపతులను చేసి, ట్రస్టు ద్వారా వారికి భారీ జీతాలిప్పించి తప్పించుకుంటుంటారు.
తన ఆస్తినంతా పిల్లలకు మిగల్చడం అమెరికాపై అపనమ్మకం కలిగి ఉండటమేనని బిల్ గేట్స్ తమ పిల్లలకు చెరొక 10 మిలియన్లు తప్ప మిగిలినది ఫౌండేషనుకు వ్రాశాడు. ఇక ఫౌండేషన్ కు పిల్లలని అధిపతులను చేస్తాడో లేదో చూడాలి.
ఎస్టేటు శిస్తులు జోక్ కాదు. మీరు జీవితాంతం శ్రమపడి చచ్చేదాకా మోర్టుగేజి కట్టి ఇళ్ళు మిగిల్చి చచ్చారనుకోండి. మీకు ఆ ఇంటి విలువలో 25-55% దాకా శిస్తు కట్టే స్థోమత ఉంటాలి. మోర్టుగేజి కట్టడానికే జీవితమైపోతే ఎస్టేటు శిస్తు కట్టడానికి రెండవజన్మనెత్తి చాకిరీ చెయ్యాలి. అందుకే మళ్లీ దానికో ఇన్సూరెన్సు ఉంటుంది (ఎస్టేటు శిస్తు ఇన్సురెన్సు) అంకుల్ శామా? మజాకా!
కొసమెరుపు: జార్జి బుష్షు "డబ్బున్న వాళ్ళ"కు టాక్సుబ్రేకిచ్చాడో అని రొడ్డచేతివారు ఏడ్చేది ఈ శిస్తు గురించే
కొత్తపల్లి గారు చెప్పింది ..తల్లితండ్రులు బాగా సంపాదించాకా కూడా పిల్లలు గ్రౌండ్ జీరొ నుండి మొదలుపెట్టి తమంతట తాము నిరూపించుకొవాలి అన్న తత్వం వున్నవారు అని. తాడేపల్లి గారు చెప్పేది చాల పేదరికం నుండి కస్టపడి పైకి వచ్చిన వారు. అల్రేడి తల్లి తండ్రులు బాగా సంపాదించిన వాళ్ళు కాదు.. దీరుబై అంబాని సున్నా నుండి పది మెట్లు ఎక్కితే ముకేష్ , అనిల్ పదకొండునుండి ఎక్కడం మొదలుపెట్టారు కానీ ఒకటి నుండి కాదు.. ఇండియా లొ 90 % అంతే..
రెండొది "భారతీయులతో పోలిస్తే అమెరికన్లు వట్టి సోమరిపోతులు"ఇది సరి అయినది కాదు.. తాడెపల్లిగారు చెప్పిన ఉదాహరణ ల ఎదీ కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు.
***వాళ్ళలో కొద్దిమంది శ్రమజీవుల్ని చూసి. చూపించి అమెరికన్ లంతా ఏదో సాధించేస్తున్నారంటే నేను నమ్మజాలను. -
@@@ మనింట్లొ తండ్రి సంపాదిస్తుంటే అతని భార్య , సరి అయిన ఉద్యొగం వచ్చెవరకు పిల్లలు, తల్లి తండ్రులు, కొన్ని కుటుంబాలలొ అన్నతమ్ములు కూడా కూర్చుని తింటుంటారు.. ఇక్కడ అందరూ పని చెస్తారు..
*** నిజానికి మన పోలీసులకి పనిగంటలూ, సెలవులూ లేవనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు చెబుతున్నాయి..
@@@ అది కస్ట పడి పనిచెయ్యడం కాదు .. సిబ్బంది లేక గతి లేక చెయ్యడం.. అయిన వాళ్ళు తీసుకునే లంచాలకి 48 గంటలు చేసిన తక్కువే.. ఇంకొ మాట.. ఇక్కడ పొలీసులూ వాళ్ళ డ్యూటీ కి మించే వర్క్ చెస్తారు.
లాస్ట్ పేరాగ్రాఫ్ చాలా దారుణం అండి.. ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ..
" అమెరికన్లకి దేశం పట్లనే కాదు, కనిపెంచిన తల్లిదండ్రుల పట్లా, భార్యాబిడ్డల పట్లా కూడా ఏ విధమైన బాధ్యతా లేదు.. "
తల్లితండ్రులని , పిల్లలని ఊరికే పొషిస్తేనే ప్రేమున్నట్టా.. వాళ్ళ దేశ బక్తి గురించి మనం సర్టిఫికేట్ ఇవ్వడం ఎమిటి .
ఇక హిస్పానిక్ గురించి.. వాళ్ళు చీప్ లెబర్ అంతే..
** స్థానిక ఊశ్ పౌరులు నడ్డివంగని, మడత నలగని వైట్ కాలర్ పనులు తప్ప ఇంకేమీ చెయ్యడానికి ఎందుకు ఇష్టపడరో నాకు తెలుసుకోవాలనుంది. - ఇదెవరు చెప్పారు మీకు ?
ప్రతీ దెశం లేక కల్చర్ లొ కొన్ని మంచివి ఉంటాయి.. కొన్ని చెడ్డవి ఉంటాయి.. మనం చేసేవి మాత్రమే సరైనవి అనుకొవడం సరి కాదు.. నేర్చుకొవల్సి ఉంటే అది అమెరికా నుండి అయినా , పాకిస్తాన్ నుండి అయిన సిగ్గులేకుండా నేర్చుకొవాలి.. ఆ నేర్చుకొవల్సిన విషయాల్లొ కొత్తపల్లి గారు రాసిన స్వశక్తి ఒకటి అని నేను నమ్ముతాను..
ఒక ఉదాహరణ .. అమెరికా లొ మీరు ఒక షాప్ లొకి వెల్తున్నరనుకొండి .. మీ ముందువెళ్ళే వాళ్ళు మీకు తలుపు తీసి పట్టుకుంటారు.. అది వెనకొచ్చేది ఆడవాళ్ళొ , పెద్దవాళ్ళొ , చిన్న పిల్లలోయితే తప్పని సరి.. అది వాళ్ళ మర్యాద.. మన వాడు వెనుక వాళ్ళ ముక్కు పచ్చడి అయినా పట్టించుకోరు.. అలాగే మనం పదిమంది వున్నప్పుడు ఎదయినా తినవలసి వస్తే ముందు అందరికి ఆఫర్ చేసి అప్పుడు మనం తింటాం.. వాళ్ళు ఎవరిని అడగరు.. ఇలా అటు ఇటు మంచివి ఉంటాయి.. అంతే కాని ఆ కల్చర్ ని జనరలిజె చేసి నిందించడం సరి కాదు..
నేను వీళ్ళ కల్చర్ లొ నాకు మంచిది అనిపించి, నాకు సాద్యపడితే ఫాలౌ అవటానికి ట్రై చెస్తాను... అన్ని గుడ్డిగా కాదు.
మెహర్ -- ఇండియా నుండి అమెరికా వచ్చి పొగిడెవాళ్ళలొ చాలమంది "అమెరికా గొప్ప. అమెరికన్స్ ఇంకా గొప్ప.. నేను అలా అయిపొవాలి అని అనరు అండి.. అమెరికన్ లలొ కూడ మనకు లేని కొన్ని మంచి లక్షణాలు వున్నాయి.. అవి నేర్చుంటే బావుంటుంది అని.. అంతే కానీ అన్ని గుడ్డిగా ఫాలౌ అయిపొవాలని కాదు..
దేశబక్తి నిరూపించుకొవాలంటే మనం చేసే తప్పులు కూడా గుడ్డి గా సమర్దించి వాదించడం కాదని నా అబిప్రాయం.. నేను బారతీయులు కాకుండా వెరే వారితొ మాట్లాడేటప్పుడు మాత్రం నేను మన తప్పు ఉన్న బారతీయులనే సమర్దిస్తా.. కానీ మనలొ మనం మాట్లాడుకునెటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అనుకొవడం బెటర్ ..
Nicholas Cageని మొదట్లో పట్టించుకోలేదు కానీ City of Angels చూసాకా బాగా ఇంప్రెస్ అయిపోయానండీ నేను.
"భారద్దేశంలో ప్రతిబింబిస్తే, ఒక టాటా కంపెనీకో, రిలయన్స్‌కో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసినాయన కొడుకుని ఒక కార్ డీలర్‌షిప్‌లో సేల్స్‌మేన్‌గా ఊహించగలమా?"
ఊహించలేము. అసలు ఊహించము కూడా...!
విషయం బాగుందండీ..
అమెరికా లొ వున్న బారతీయులందరకీ అమెరికా బెస్టు కాదన్నా.. చాలామందికి మాతృభూమే బెస్టు.. కాకపొతే..అమెరికా వెళ్ళి కొన్ని కొత్తవి నేర్చుకుంటున్నారు అంతే.. ఆ తేడా అర్ధం చేసుకొండి..
- ఇంకొక తెలుగు అభిమాని
Hollywood is as much representation of America as Bollywood is of India
భళా..భలే చెప్పారు నిజాన్ని.
రవి వైజాసత్య,
బాగా చెప్పారు. As always, when I read your comments, I feel I am in company, not alone.
మిగతా అందరికీ,
అమెరికా పట్ల ఉన్న మూసాభిప్రాయాలు చాలా వరకూ సత్య దూరాలే. అవి తప్పు అని అందరికీ తెలియ చెప్పాలని, నా విశ్లేషణని ప్రజలకి ఉచితంగా పంచి పెట్టేవాణ్ణి ఒకప్పుడు :-) అదెంత వ్యర్ధ ప్రయత్నమో అనుభవం లో తెలిసి వచ్చి దారుణంగా దెబ్బ తిని నోటికి ప్లాస్టర్ వేసుక్కూర్చొని, తమాషా తిలకిస్తుంటానిప్పుడు.
ప్రజలు వాళ్ళు నమ్మలనుకున్నవి నమ్ముతారంతే. ఫీల్ గుడ్ ఫాక్టర్. పాళీ గారు ఇంకో టపాలో చెప్పినట్లు నథింగ్ వర్క్స్ లైక్ ఫీల్ గుడ్ కాన్సెప్ట్స్.