మాయమైన ముఖ్యమంత్రి

ఊపిరి సలపని పనుల్లో ఉండి అసలు బయటి లోకంలో ఏం జరుగుతోందో తెలియని స్థితిలో ఉండగా, ఏదో పనికి సంబంధించిన సమాచారం కోసం జాలంలో ప్రవేశిస్తే, ఈ దిగ్భ్రాంతి కలిగించే వార్త.

ఆయనకి వ్యక్తిగతంగా కానీ, ఆయన ప్రభుత్వ విధానాలకి కానీ నేను అభిమానిని కాదు.
కానీ ఆయన క్షేమంగా ఉన్నారనీ, తిరిగొస్తారనీ మనసారా కోరుకుంటున్నా.

వయ్యస్ మరొక బాలయోగి, మరొక రాజేష్ పైలట్ కారని ఆశిస్తున్నా.
ఐనా ఎందుకో మనసు కీడు శంకిస్తోంది.

చంద్రబాబు మీద అలిపిరి దాడి నేపథ్యంలో నల్లమల అడవుల్లో ప్రభుత్వ జాగిలాలు సృష్టించిన అలజడి ఫలితాల్ని ప్రయక్షంగా చూశాను.
ఒకేళ నిజంగానే వయ్యస్ కి ఏమన్నా అయితే ఇక నల్లమలలో రగులుకునే దారుణ మారణహోమం .. ఆ అమాయక ప్రజల క్షేమం కోసమైనా ఆయన క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా.

Comments