అబ్బో, గతవారం చాలా బిజీ ఐపోయింది. బాహ్య ప్రపంచం అంటే ఏవిటో మరిచిపోయేంత బిజీ, చాలా రోజుల .. కాదు, చాలా ఏళ్ళ తరవాత పోయినవారం అనుభవానికి వచ్చింది. అక్కడీకీ, సందు దొరికినప్పుడల్లా మూణ్ణాలుగు బ్లాగులు చదివి ఒకట్రెండు వ్యాఖ్యలు రాస్తూ వచ్చా. కానీ నా టపాలు రాసుకునేందుకు మాత్రం తీరిక చిక్కలేదు.
వేసవి ముగియవస్తున్నదేమో, నాపని మూడు వారాంతాలూ, ఆరు అరంగేట్రాలుగా ఉన్నది. సోమయాజులుగారని పెద్దవారు, చాలా కాలంగా ఇక్కడ కాపురముంటున్నవారు, నాకు మా దేవాలయంలో పరిచయం. విజయవాడ వాణ్ణనో, ఎందుకనో ఆయనకి నేనంటే మంచి అభిమానం. వారి మనుమరాలు చిరంజీవి శిరీష కూచిపూడి రంగప్రవేశం జరుగుతుంటే పిలిచారు పోయిన వారం. గురువు సంధ్యశ్రీ ఆత్మకూరి గారు నా స్నేహితులు కాబట్టి ఆవిడ కూడా పిలిచారనుకోండి. బాగా జరిగింది. ముఖద్వారం దగ్గర అలంకరణ దగ్గరినించీ, ఆడిటోరియంలో రంగాలంకరణ వరకూ ప్రత్యేక శ్రద్ధతో చేసినట్టు స్పష్టంగా తెలిసింది.
కూచిపూడి గురించి, అందులో సోలో ప్రదర్శన గురించి నాకు బొత్తిగా ఏమీ తెలియదు, గనుక నేను శిరీష నాట్యాన్ని విశ్లేషించే సాహసం చెయ్యను. అంశాల ఎంపిక పాతకొత్తల మేలుకలయికగా ఉంది. సంధ్యగారి గురువు వెంపటి చిన్నసత్యంగారి ఆధ్వర్యంలో సమకూరిన రుక్మిణీ కళ్యాణం నాటకం నించి రుక్మిణి ప్రవేశ దర్వుని అభినయింప చేశారు. భుజంగరాయ శర్మగారి కవిత్వం .. సంగీతం కూర్చింది బహుశా పట్రాయని సంగీతరావుగారై ఉండొచ్చు. ఈ అంశం నన్ను బాగా ఆకట్టుకుంది. "ముద్ద గట్టిన వెన్నెలమ్మా, ముద్దు బాలమ్మా, అచ్చపు ముద్దరాలమ్మా" అనే వరుసని పదిసార్లు విశదపరిచి అభినయించడం చాలా బాగా నప్పింది. చివర్లో కుటుంబసభ్యులందరూ విడివిడిగా ధన్యవాదాలు చెప్పబట్టి ఆహూతుల సహనానికి కొంచెం పరీక్ష పెట్టారు కానీ మిగతా అంతా చాలా బాగుంది.
కొన్నాళ్ళుగా నా జీవితంలో ఏర్పడిన సంగీతలేమిని గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించి సవరణచర్యలు చేపట్టానని తెలియజెయ్యడానికి సంతోషిస్తున్నాను. ఎప్పటిదో పాత వాక్మేన్ కేసెట్ ప్లేయరు ఇంకా బానే పని చేస్తోంది. దాన్నీ, నా బోషాణంలోంచి ఒక పది రసవత్తరమైన కచేరీల కేసెట్లనీ సతతం అందుబాటులో ఉంచుకుంటూ, చెవులకి బిరడాలు తీసినట్టు మళ్ళీ సంగీతం వింటున్నా. ఇవ్వాళ్ళ పొద్దున ఆరు మైళ్ళ నడకలో వోలేటి వేంకటేశ్వర్లుగారి కచేరీ ఒకటి విన్నా. బేగడలో రాగం తానం పల్లవి. బేగడ మీగడ అంటారు .. అంటే అంత మధురం అన్న మాట. ఈ రాగాన్ని కొంచెం శోధించాలని బుద్ధి పుట్టింది. చేస్తా త్వరలో.
ఇంటొ ఉన్న బుల్లి బుల్లి వినాయకుళ్ళందర్నీ కొలువు తీర్చి, నా చేతుల్తో చేసిన వినాయకుణ్ణి మధ్యలో ప్రతిష్ఠించి, నమక చమకసహితంగా అభిషేకంతోపాటు వరసిద్ధి వినాయకుణ్ణి పూజచేసుకుని ఈ సాయంత్రం ధన్యుణ్ణయ్యాను. పసుపు ముద్దతో చేసిన మా వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. పోయినేడాది మా యింటి పెరట్లోని బంకమన్నుతో చేశా వినాయకుణ్ణి. ఇలా ఏడాదికో పదార్ధంతో చేసుకుంటు ఉంటే బానే ఉంటుంది, సరదాగా.
ఈ బ్లాగు చదివినవారందరూ సిద్ధివినాయక అనుగ్రహ పాత్రులై వినాయకవ్రతకల్ప ఫలం పొంది, నీలాపనిందలకు గురికాక, ఇష్టకామ్యార్ధసిద్ధులు కాగలరు!

Comments
ఆరుమైళ్ల నడకా?! అంటే దాదాపు పది కి.మీ. అదీ సోమవారం పొద్దున్నే!! భరతనాట్యం చేసేవాళ్లకు ఆ మాత్రం స్టామినా వుండటంలో ఆశ్చర్యమేముందిలెండి. నేను రెండుమైళ్లు పరుగెత్తేసరికి ఫినిష్.
మీకు రాగాలపై మంచి పట్టు ఉన్నట్లుంది. ప్రముఖ రాగాలు సినిమా పాటలలో ఏవిధంగా కూర్చబడ్డాయి అనే విషయంపై ఒక సీరిస్ వెయ్యండి గురువుగారూ. ఓ నాలుగైదు పాటల లింకులతో. ఎప్పటినుంచో తెలుసుకోవాలని ఆశక్తి.
బొల్లోజు బాబా