జూలై నెల మొదట్లో షికాగోలో జరిగిన 17 వ తానా సభల జ్ఞాపిక, తెలుగు పలుకు, ఇప్పుడే నా చేతికందింది.
ముఖచిత్రం అద్భుతంగా ఉంది.
వెనక అట్టమీద, సమకాలీన తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశకు లనదగిన శ్రీశ్రీ, నార్ల, కొకు, గోపీచందుల ముఖాల్ని అమెరికా మౌంట్ రష్మోరుకి మల్లే నీటివర్ణచిత్రంగా ఆవిష్కరించడం బ్రిలియంటైడియా. చిత్రకారుడు చంద్రకి అభినందనలు.
పధ్నాలగు సంవత్సరాల క్రితం షికాగో తానా సభల సావనీరుకి ఏమీ తగ్గకుండా తీసుకు వచ్చారు ఈ పుస్తకాన్ని. ఇంచుమించుగా అప్పటి బృందమే ఈ ఏడు శ్రమించినది కూడా. అనేక అంశాల్లో నాలుగు మెట్లు పైకే ఎక్కారని కూడా చెప్పొచ్చు. కమిటీ సభ్యులకీ, ఇతరత్రా శ్రమించిన వారందరికీ అభినందనలు.
పధ్నాలుగేళ్ళ క్రితం లాగానే, గొప్ప తెలుగు చిత్రకారులు వేసినవాటిల్ని, కళ్ళు మిరుమిట్లుగొలిపే వర్ణచిత్రాల్ని, ముద్రించడం ప్రత్యేక ఆకర్షణ ఈ సావనీర్లో కూడా. దీనికి ఒక కారణం ముఖ్య సంపాదకులు జంపాల గారి చిత్రకళాభిరుచి అయితే, ఆ కారణానికి దన్నుగా నిలిచి ప్రాణం పోసినది ఆచార్యులు, స్వయంగా చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ రామారావుగారి దీక్ష అని చెప్పుకోక తప్పదు. ఆయా చిత్రాల్ని ఒకే పరిమాణానికి తీసుకొచ్చి, రంగులు గల్లంతు కాకుండా, ఫ్రేము కట్టించుకోదగిన క్వాలిటీతో ముద్రించి ఇచ్చిన ముద్రాపకులు కూడా సామాన్యులు కాదు. ఏదేమైనా, వాళ్ళ శ్రమ, మనకి కనుల విందు. రచనల సంగతి ఇంకా తరచి చూళ్ళెదు గానీ, ఈ చిత్రాలు మాత్రం ఈ సావనీరుని అతివిలువైనదాన్ని చేశాయి.
సావనీరు ఆమూలాగ్ర సమీక్ష విన్నవీకన్నవీలో త్వరలోనే.

Comments
మీరు వెళ్ళేరా తానా కి?
@భావన .. పై సమాధానమే .. లేదు, మేం వెళ్ళలే తానాకి. కథ ప్రచురించిన పుణ్యానికి ఉచితంగా సావనీరు ఒక కాపీ దయచేయించారు.
@రానారె .. ఈ సావనీరులో కళ గురించి మరిన్ని విశేషాలు సమీక్షలో
@మహేష్ .. అడిగానండీ. విడిప్రతులుగానీ, ఈ-కాపీగానీ అందుబాటులో లేవు.