తెలుగు బ్లాగులకి ఒక ఉమ్మడి వేదికనిచ్చి కూడలి, జల్లెడ ఏగ్రిగేటర్లు బ్లాగర్లకి గొప్ప మేలు చేశాయి, సందేహం లేదు. కొన్నాళ్ళు ఈ బ్లాగులోకంలో మసలిన తరవాత, ప్రతివారికీ త్వరలోనే తెలిసిపోతుంది, కూడలిలో కనబడిన ప్రతీ టపా మనం చదవం. కొన్ని కొన్ని బ్లాగులకోసం, వాటిల్లో కొత్త టపా ఏదైనా వచ్చిందేమోనని కళ్ళు గాలిస్తుంటాయి. అదీకాక, బ్లాగుల సంఖ్య పెరిగే కొద్దీ కొత్తగా విడుదలైన టపాలన్నీ చదవడం దాదాపు అసాధ్యమవుతుంది. ఎంపిక తప్పనిసరి.
జల్లెడలో ఇలా మనకిష్టమైన బ్లాగుల్ని ఎంచి అవి మాత్రమే చూపించుకునే సదుపాయం ఉన్నట్టుంది, నేనెప్పుడూ ఉపయోగించలేదు. గూగుల్ రీడర్ అని ఒక పరికరం ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది. ప్రవీణ్ బ్లాగుద్వారా దీన్ని గురించి తెలిసి చాలా రోజులే అయినా, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం పట్ల ఉండే బద్ధకం వల్ల దాన్ని ఇంతవరకూ ఉపేక్షించాను. గత కొద్ది నెలలుగా కూడలిలో అయినా జల్లెడలో అయినా నేను సాధారణంగా చూసే బ్లాగుల టపాల్ని వెతుక్కోవడం కష్టమైపోతూ వచ్చింది. సుమారు నెల్రోజుల కిందట ఒక మిత్రుడు ఈ గూగుల్ రీడర్ పరికరాన్ని ఉపయోగిస్తుంటే చూశాను. అబ్బ, ప్రాణానికి హాయిగా ఉందిగా అనుకున్నా. వాడ్డం చాలా సులభమని ధైర్యం చెప్పాడు ఆ మిత్రుడు.
మీరూ వాడి చూడండి.

Comments
One another hidden benefit of using it is even though you don't like their themes or fonts, you can read it in reader normally.
But that said, people like me would be lazy to leave a comment in the respective blogs.
కాని ఇవి సమానార్ధకాలే గాని, అచ్చం ఒకదానికోటి తూగేవి కావు. తెలుగులో పరికరమన్నా, ఉపకరణమన్నా టూల్ (tool) అనే అర్ధం ఉంది.
వీలైతే మీరు షార్ప్ రీడర్ ను దించుకుని ప్రయత్నించండి. ఇది మీకు ఆఫ్ లైన్లో బ్లాగులను చదవడానికి బాగా పనికివస్తుంది. ఇందులో ఉన్న ఒక మంచి ఉపయోగమేమిటంటే, మీరు సబ్ స్క్ర్రైబ్ చేసుకున్న బ్లాగుల పుటలు చాలా సింపుల్ గా కనబడతాయి. మీకు యధావిధిగా కూడా చూసుకునే వీలుంది. సింపుల్ గా కనబడటం వెనకాల మీకు బ్లాగులోని పుటలు తొందరగా డౌన్లోడ్ అవుతాయి
ప్రయత్నించండి. నేను ఓ ఐదారు సంవత్సరాలనుంచి దీనిని వాడుతున్నాను
ఇట్లు,
భవదీయుడు
PS: లంకె ఇవ్వడం మరిచాను. http://www.sharpreader.net/
http://googlereader.blogspot.com/2007/02/by-bloggers-for-bloggers.html